News
News
X

Vinaro Bhagyamu Vishnu Katha Update : వినరో భాగ్యము - అసలు మ్యాటర్ రివీల్ చేసేది ఆ రోజే

కిరణ్ అబ్బవరం హీరోగా 'బన్నీ' వాస్ నిర్మించిన సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. త్వరలో అసలు మ్యాటర్, జానర్ రివీల్ చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది. టీజర్ రానుంది. 

FOLLOW US: 
Share:

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha). అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్ నిర్మించారు. ఇందులోని తొలి పాట 'వాసవ సుహాస...'ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తోంది. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ కూడా ఆ పాట, సాహిత్యాన్ని మెచ్చుకున్నారు. ఇప్పుడు వచ్చే వారం టీజర్ విడుదల చేయడానికి రెడీ అయ్యారు.

జనవరి 9న జానర్ టీజర్
'వినరో భాగ్యము విష్ణు కథ' నుంచి ఒక టీజర్ విడుదలైంది. కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు (జూలై 15) సందర్భంగా గత ఏడాది జూలై 14న గ్లింప్స్ విడుదల చేశారు. హీరో పాత్రను పరిచయం చేశారు. ఆ గ్లింప్స్, 'వాసవ సుహాస...' ప్రోమోస్ చూస్తే కిరణ్ అబ్బవరం రెండు లుక్కులో కనిపించారు. జాబ్ చేసే మోడ్రన్ అబ్బాయి. పక్కా పల్లెటూరి యువకుడిగా! సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? కథ ఎలా ఉంటుంది? జానర్ ఏమిటి? అనే విషయాలకు త్వరలో రాబోయే టీజర్ చూస్తే క్లారిటీ వస్తుందట. 

జనవరి 9న ఉదయం 10.15 గంటలకు 'వినరో భాగ్యము విష్ణు కథ' టీజర్ విడుదల చేయనున్నట్లు జీఏ2 పిక్చర్స్ తెలిపింది. ఈ సందర్భంగా హీరో హీరోయిన్స్ స్టిల్ విడుదల చేసింది. 

ఫిబ్రవరి 17న 'వినరో భాగ్యము...'
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు. దానికి మూడు రోజుల తర్వాత... ఫిబ్రవరి 17, 2023లో 'వినరో భాగ్యము విష్ణు కథ'ను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. చిత్తూరు నేపథ్యంలో ఏడుకొండల వెంకన్న సాక్షిగా తిరుమల తిరుపతి కొండల కింద జరిగే కథతో రూపొందుతోన్న చిత్రమిది. 

Also Read : ఇక్కడ చైతన్య - సమంత, అక్కడ రితేష్ - జెనీలియా... ఇది కలెక్షన్ల 'మజిలీ' 

View this post on Instagram
 
A post shared by Geetha Arts (@geethaarts)

ఆల్రెడీ విడుదలైన 'వాసవ సుహాస...' పాటను ముందుగా కళాతపస్వి కె విశ్వనాథ్‌కు వినిపించింది చిత్ర బృందం. ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు. పాట విన్నాక... ''నా పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి'' అని విశ్వనాథ్ తెలిపారు. ఇటువంటి పాటను  నిర్మాతలు ఎలా ఒప్పుకొన్నారని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు విడుదలైన పాట వింటే, ఆ సాహిత్యం చూస్తే... విశ్వనాథ్ అలా ఎందుకు అన్నారో తెలుస్తుంది.

పాట ప్రారంభానికి ముందు తాత, మనవడు మధ్య జరిగే సంభాషణ సినిమాలోని కథా సారాంశాన్ని తెలిపే విధంగా ఉంది. కనిపించే ప్రతివాడు మన పక్కింటి వాడేనని సందేశాన్ని సినిమాలో ఇస్తున్నారని అర్థమైంది. ''నీ స్థాయి అనేది ప్రపంచాన్ని నువ్వు ఎంత ఎత్తు నుంచి చూస్తావ్ అన్నదాని బట్టే ఉంటుంది'' అని 'శుభలేఖ' సుధాకర్ చెప్పే మాట బావుంది. కనిపించే ప్రతి మనిషికి సాయం చేసే గుణం ఉన్న యువకుడిగా హీరో పాత్రను పాటలో పరిచయం చేశారు. కిరణ్ అబ్బవరం లుక్ కూడా పక్కింటి కుర్రాడిలా ఉంది.

Also Read : పార్టీలో లిప్ కిస్ ఇస్తూ దొరికేసిన తమన్నా - హైదరాబాదీ నటుడితో డేటింగ్

కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని అంత గొప్పగా పాట రాశారు. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ అందించిన బాణీ, కారుణ్య గానం కూడా బావున్నాయి. ఈ పాటకు విశ్వ రఘు నృత్య దర్శకత్వం వహించారు. ఇందులోని సాహిత్యం అర్థం కాకున్నా మళ్ళీ వినాలనిపించేలా ఉంది. సాహిత్యానికి అర్థం తెలుసుకోవాలంటే... కింద ఫోటో మీద ఓ లుక్ వేయండి.  

'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'ప్రతి రోజూ పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', 'ఊర్వశివో రాక్షసివో', '18 పేజెస్' వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన జీఏ 2 పిక్చర్స్ లో ఈ సినిమా మరో హిట్ అవుతుందని యూనిట్ నమ్ముతోంది.

కిర‌ణ్ అబ్బ‌వ‌రం సరసన క‌శ్మీర ప‌ర్ధేశీ (Kashmira Pardeshi) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాతో మురళీ కిశోర్ అబ్బురు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: స‌త్య‌ గమిడి - శ‌రత్ చంద్ర నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియ‌ల్, స‌హ నిర్మాత‌: బాబు, సంగీతం: చైత‌న్ భరద్వాజ్.

Published at : 03 Jan 2023 05:50 PM (IST) Tags: Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha Movie Kashmira Pardeshi VBVK Teaser

సంబంధిత కథనాలు

Dhanush Speech: తెలుగు, తమిళ ప్రజలు ఎంత దగ్గరివారో తెలిసింది - ‘సార్’ ట్రైలర్ లాంచ్‌లో ధనుష్ ఏమన్నారంటే?

Dhanush Speech: తెలుగు, తమిళ ప్రజలు ఎంత దగ్గరివారో తెలిసింది - ‘సార్’ ట్రైలర్ లాంచ్‌లో ధనుష్ ఏమన్నారంటే?

Siri Hanmanth Emotional: షర్ట్‌పై కిస్ చేసేదాన్ని - తప్పు చేశానంటూ ఏడ్చేసిన సిరి, ఓదార్చిన శ్రీహాన్

Siri Hanmanth Emotional: షర్ట్‌పై కిస్ చేసేదాన్ని - తప్పు చేశానంటూ ఏడ్చేసిన సిరి, ఓదార్చిన శ్రీహాన్

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

సిద్దార్థ్- కియారా జంటకు క్షమాపణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..

సిద్దార్థ్- కియారా జంటకు క్షమాపణలు చెప్పిన ఉపాసన, ఎందుకంటే..

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?

టాప్ స్టోరీస్

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !

Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్  !

No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్‌! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్‌ తెస్తున్నారు!

No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్‌! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్‌ తెస్తున్నారు!

PM Modi On Opposition: ఈడీ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి,ప్రజలే నా రక్షణ కవచం - ప్రధాని మోదీ

PM Modi On Opposition: ఈడీ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి,ప్రజలే నా రక్షణ కవచం - ప్రధాని మోదీ