Yash Movie In Telugu : తెలుగు ప్రేక్షకుల ముందుకు 'రారాజు'గా యష్ - విషయం ఏంటంటే?
కన్నడ కథానాయకుడు, 'కెజియఫ్' రాకీ భాయ్ యష్ ఈ నెల 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'రారాజు'గా! అసలు విషయం ఏంటంటే?
రాకీ భాయ్‌కు యావత్ దేశం సలామ్ చేసింది. అతని హీరోయిజానికి, నటనకు ఫిదా అయ్యింది. రాకీ భాయ్‌గా కన్నడ కథానాయకుడు యష్ (Yash) ను చాలా మంది గుర్తు పడుతున్నారు. 'కె.జి.యఫ్ 1' (KGF Chapter 1), 'కె.జి.యఫ్ 2' (KGF 2) సినిమాల ప్రభావం ఆ స్థాయిలో ఉంది మరి! ఇప్పుడు యష్ పాన్ ఇండియా హీరో. అయితే, 'కెజియఫ్' కంటే కన్నడలో కొన్ని సినిమాలు చేశారు. అందులో ఓ సినిమా ఈ నెల 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
యష్, రాధికను ఒక్కటి చేసిన సినిమా!
యష్ కథానాయకుడిగా నటించిన కన్నడ చిత్రం 'సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్'. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో 'రారాజు' (Raraju Movie) ను డబ్బింగ్ చేశారు. ఇందులో రాధికా పండిట్ (Yash Wife Radhika Pandit) హీరోయిన్. ఈ సినిమాలో నటించిన తర్వాతే యష్, రాధిక పెళ్లి జరిగింది. అక్టోబర్ 28, 2016లో ఈ సినిమా విడుదల అయితే... అదే ఏడాది డిసెంబర్ 9న గోవాలో పెళ్లి చేసుకున్నారు.
యష్ వ్యక్తిగత జీవితంలో ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 14న పద్మావతి పిక్చర్స్ సంస్థ విడుదల చేస్తోంది. నిర్మాత వి.ఎస్. సుబ్బారావు మాట్లాడుతూ ''కన్నడలో భారీ విజయం సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను సైతం తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభిస్తోంది'' అని చెప్పారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన 'కిక్' శ్యామ్, సీత, రవిశంకర్ తదితరులు 'రారాజు' చిత్రంలో నటించారు.
తెలుగులోకి యష్ కన్నడ సినిమాలు క్యూ కడతాయా?
ఇప్పుడు తెలుగులో కూడా యష్‌కు మంచి క్రేజ్ ఉంది. దాన్ని నిర్మాతలు గుర్తించారు. అందుకని, ఆయన నటించిన కన్నడ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారట. రాబోయే రోజుల్లో ఆ సినిమాలు క్యూ కట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. పునీత్ రాజ్ కుమార్ సినిమా 'చక్రవ్యూహ' సైతం తెలుగులోకి 'సివిల్ ఇంజనీర్'గా వస్తోంది.
Also Read : చిరంజీవి ఫ్యామిలీతో కాంట్రవర్సీ - ఆలీకి అల్లు అరవింద్ క్లాస్?
View this post on Instagram
యష్ నెక్స్ట్ సినిమా ఏంటి?
'కెజియఫ్ 2' విడుదల తర్వాత నుంచి యష్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన కొత్త సినిమా ఏంటి? అనేది ఇంకా క్లారిటీ రాలేదు. 'కెజియఫ్ 3' గురించి 'కెజియఫ్ 2'లో హింట్ ఇచ్చినప్పటికీ... అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం!
'కెజియఫ్ 2' భారీ విజయం తర్వాత యష్ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆయన ఏ సినిమా చేసినా, ఎవరితో చేసినా పాన్ ఇండియా రిలీజ్ కన్ఫర్మ్. అందువల్ల, యష్ కథల ఎంపికలో యష్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పలువురి దర్శకుల పేర్లు వినబడుతున్నాయి. కానీ, ఎవరితో సినిమా (Yash New Movie) అనేది క్లారిటీ రావడం లేదు.
Also Read : తెలుగులోకి మరో పవర్ స్టార్ సినిమా - 'సివిల్ ఇంజనీర్' టీజర్ రిలీజ్
View this post on Instagram