KCPD Video Song: కేసీపీడీ - యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోన్న చిన్న సినిమా సాంగ్!
కార్తీక్ రాజు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'అథర్వ'. డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల అవుతోంది. ఇందులో 'కేసీపీడీ' వీడియో సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.
అగ్ర కథానాయకుల సినిమాల్లో పాటలు, ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న సింగర్స్ పాటలు యూట్యూబ్, ఆడియో & డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్స్‌లో వైరల్ అవుతున్నాయి. వైరల్ కావడమే కాదు... చార్ట్ బస్టర్స్ అవుతున్నాయి. ఆ స్థాయిలో చిన్న చిత్రాల్లో పాటలు హిట్ కావడం లేదు. అటువంటిది ఓ చిన్న సినిమాలో పాట రెండు రోజుల్లో దగ్గర దగ్గర 4 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషమే. పూర్తి వివరాల్లోకి వెళితే...
'అథర్వ' సినిమాలో 'కేసీపీడీ' సాంగ్!
యంగ్ హీరో కార్తీక్ రాజు (Karthik Raju) నటించిన తాజా సినిమా 'అథర్వ' (Atharva Movie). ఇందులో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ (Simran Choudhary). ఐరా మరో కథానాయిక. మహేష్ రెడ్డి దర్శకత్వం వహించారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుభాష్ నూతలపాటి నిర్మించారు. ఇందులోని 'కేసీపీడీ' వీడియో సాంగ్ ఇటీవల విడుదల అయ్యింది.
కేసీపీడీ... ఈ పదం యువతలో, సోషల్ మీడియాలో పాపులర్. 'భగవంత్ కేసరి' సినిమాలోని ఓ సన్నివేశంలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'ఎట్లా ఉంది శుక్లాజీ' అంటే... 'అబ్‌సల్యూట్‌లీ కీసీపీడీ బాబు' అని జాన్ విజయ్ చెబుతారు. ఇప్పుడీ 'కేసీపీడీ' మీద 'అథర్వ' సినిమాలో ఓ సాంగ్ చేశారు.
Also Read: త్రివిక్రమ్ సెలక్షన్ మీద విమర్శలు, సందేహాలు - ఏంటిది ఆదికేశవ?
'అథర్వ' సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఆయన బాణీకి 'కేసీపీడీ...' అంటూ కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించగా... శ్రీచరణ్ పాకాల స్వయంగా ఆలపించారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఈ సాంగ్ దుమ్ము రేపుతోంది. హీరోకి పోలీస్ ఉద్యోగం వచ్చిన సందర్భంలో వచ్చే గీతమిది. ఆల్రెడీ 3.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
Also Read: సుకుమార్ రేర్ రికార్డ్ - తెలుగులో రాజమౌళి తర్వాత లెక్కల మాస్టారే!
డిసెంబర్ 1న 'అథర్వ' విడుదల
Atharva Telugu Movie Release Date: 'అథర్వ' సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదొక క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఓ నేరం జరిగిన తర్వాత దోషులను పట్టుకోవడంలో శిక్షించడంలో ఫోరెన్సిక్, క్లూస్ టీం పాత్ర ఏమిటి? అనే పాయింట్ తీసుకుని తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రానికి జయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
'అథర్వ' చిత్రాన్ని తాజాగా పోలీస్ శాఖలోని క్లూస్, ఫోరెన్సిక్ విభాగంలో కొందరు చూశారు. అప్పుడు తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ అడిషనల్ డైరెక్టర్ డా. అనిత ఎవాంజెలిన్ మాట్లాడుతూ... ''పోలీస్ శాఖలో క్లూస్ టీం ఎంత ప్రముఖమైంది?అనేది చూపించారు. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. మా వాళ్ళను హీరోల్లా చూపించారు. ఫోరెన్సిక్, క్లూస్ డిపార్ట్మెంట్లు వేరు. ఈ సినిమా మా అందరికీ ఓ నివాళి. మా కష్టాన్ని అందరికీ తెలిసేలా తీసిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి'' అని అన్నారు.