Karthikeya 2 Heroine: ‘కార్తికేయ-2’ హీరోయిన్ ఈమే.. నిఖిల్‌తో మళ్లీ జతకడుతున్న ముద్దుగుమ్మ
నిఖిల్-స్వాతి జంటగా నటించిన కార్తికేయ మూవీ సూపర్ హిట్టైంది. ఇప్పుడీ మూవీకి సీక్వెల్ తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు చిత్రయూనిట్. ఈ మేరకు హీరోయన్ ను రివీల్ చేశారు.

యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో 'కార్తికేయ 2' సినిమా తెరకెక్కుతోంది. 2014లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘కార్తికేయ’ మూవీకి సీక్వెల్ ఇది. అయితే ‘కార్తికేయ’ సినిమాలో కలర్స్ స్వాతి హీరోయిన్‌గా నటించింది. సీక్వెల్లో వేరొక హీరోయిన్‌ను తీసుకోవాలనుకున్న యూనిట్.. ఇప్పటి వరకూ ఎవరా బ్యూటీ అన్నది అధికారికంగా ప్రకటించలేదు. కృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ 'కార్తికేయ 2' చిత్ర యూనిట్ ఓ వీడియో హీరోయిను అనౌన్స్ చేశారు. ఇందులో నిఖిల్ సరసన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వెల్లడించారు.
Meeku Telusu ani maaku Telusu... But andariki intha Ishtamaina Ammayi Vishayam malli cheppadam lo Anandam meeku telusu @anupamahere Is In #karthikeya2 #anupamaparameswaran @chandoomondeti @AbhishekOfficl @vivekkuchibotla @MayankOfficl @peoplemediafcy @AAArtsOfficial pic.twitter.com/9IW13Vq3c8
— Nikhil Siddhartha (@actor_Nikhil) August 30, 2021
హీరో నిఖిల్ వీడియో తీస్తుండగా.. డైరెక్టర్ చందు హీరోయిన్ ముఖాన్ని చేతులతో మూసేసి రివీల్ చేసినట్టు సరదాగా చూపించారు. నిఖిల్ తో అనుపమా పరమేశ్వరన్‌కు ఇది రెండో సినిమా. ఇప్పటికే పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న '18 పేజెస్' చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘‘ఈ సినిమాలో నాయిక ఎవరనే విషయాన్ని చాలా రోజులు రహస్యంగా ఉంచాం. ఇప్పుడు బయటపెడుతున్నాం. అనుపమతో మరోసారి నటించడం ఆనందంగా ఉంది’’ అని నిఖిల్ తెలిపారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ‘కార్తికేయ 2’ ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని శరవేగంగా చిత్రీకరిస్తున్నారు.
ఇక అనుపమా పరమేశ్వరన్ విషయానికొస్తే.. ప్రేమమ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఆరంభంలో కొన్ని అవకాశాలు అందిపుచ్చుకున్నా ఆ తర్వాత కాస్త వెనుకబడింది. ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రేమమ్ బ్యూటీ కెరీర్ జోరందుకుంటోంది. స్వామి రారా, కార్తికేయ సినిమాలతో నిఖిల్-స్వాతి హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ఇప్పుడు 18 పేజెస్, కార్తికేయ 2 తో నిఖిల్-అనుపమ కూడా హిట్ పెయిర్ అనిపించుకుంటారేమో చూడాలి.
ALSO READ:‘టక్ జగదీష్’ సర్‌ప్రైజ్.. పేరు మార్చుకున్న ‘అమెజాన్ ప్రైమ్’, మీరూ మార్చుకోవాలంటూ..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

