అన్వేషించండి
Kareena Kapoor: కరీనాకు కరోనా పాజిటివ్.. సూపర్ స్ప్రెడర్ గా మారిన నటి..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్, నటి అమృతా అరోరాలకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.

కరీనాకు కరోనా పాజిటివ్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్, నటి అమృతా అరోరాలకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నటీమణులు కోవిడ్ రూల్స్ ని ఉల్లంఘించి ముంబైలో పలు పార్టీలకు హాజరైనట్లు సమాచారం. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంస్థ కరీనా, అమృతాలను రీసెంట్ టైంలో కలిసిన వాళ్లందరినీ RTPCT టెస్ట్ చేయించుకోమని సూచించింది. కరీనా, అమృతా ఇద్దరూ కూడా సూపర్ స్ప్రెడర్స్‌గా మారినట్లు సదరు సంస్థ పేర్కొంది.
కొన్నిరోజులుగా వీరిద్దరికీ కరోనా లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ మధ్యకాలంలో కరీనా, అమృతా బాలీవుడ్ లో చాలా పార్టీలకు హాజరయ్యారు. అందులో కొందరు సూపర్ స్టార్స్ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు కరీనా, అమృతాలకు కరోనా పాజిటివ్ అని రావడంతో చాలా మంది స్టార్స్ లో టెన్షన్ మొదలైంది. ఒక్కొక్కరూ టెస్ట్ లు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత మంది కోవిడ్ పాజిటివ్ గా తేలే ఛాన్స్ ఉంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కోవిడ్ రూల్స్ ను ఫాలో అవ్వమని పదే పదే చెబుతున్నా.. ఇలా సెలబ్రిటీలే వాటిని ఉల్లఘించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పైగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో కరీనా కోవిడ్ పాజిటివ్ వార్తతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
View this post on Instagram
Also Read:సమంత ఐటెం సాంగ్.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్..
Also Read:బన్నీతో సమంత 'నాటు' స్టెప్.. ఊరమాస్ ఉందే..
Also Read: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?
Also Read: ఇది కేవలం జెర్సీ మాత్రమే కాదు.. నాగచైతన్య ఎందుకు అలా అన్నాడంటే?
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ చూసి రామ్, భీమ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















