Rishab Shetty On Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాపై రిషబ్ శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
‘కాంతార’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న రిషబ్ శెట్టి, దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది ‘కాంతార’. ఈ చిత్రంలో తానే నటించి, దర్శకత్వం వహించాడు రిషబ్ శెట్టి. తొలుత కన్నడ నాట అద్భుత విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఆ తర్వాత తెలుగు, హిందీలోనూ విడుదల అయ్యింది. ఈ చిత్రం రిలీజ్ అయిన ప్రతిచోట బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇప్పటికీ భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ దుమ్మురేపుతోంది. అమెరికాలో మొత్తం 2 మిలియన్ డాలర్లకు వసూళ్లు చేపట్టింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. ఈ చిత్రం త్వరలో మిలియన్ డాలర్ల మార్కును చేరుకునే అవకాశం కనిపిస్తోంది.
ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పటికే ఈ సినిమాను చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రిషబ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వ ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లాంటి వారు ‘కాంతార’ చిత్రాన్ని చూసి అభినందిస్తున్నారు. తాజాగా తారక్ కూడా ఈ సినిమాను చూశారు. అనంతరం రిషబ్ శెట్టికి ఫోన్ చేసి.. అద్భుతమైన సినిమా చేసినట్లు ప్రశంసించారు. ఈ విషయాన్ని రిషబ్ శెట్టి స్వయంగా వెల్లడించాడు.
అవకాశం వస్తే ఎన్టీఆర్ తో సినిమా
రిషబ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్ లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పని చేసే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు తప్పకుండా అని సమాధానం చెప్పారు. తాను ఎన్టీఆర్ కు పెద్ద అభిమానని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్ తో సినిమా గురించి తానెప్పుడూ ఆలోచింలేదని చెప్పాడు. వాస్తవానికి తాను ముందుగా హీరోను ఊహించుకుని కథలు రాయనని చెప్పాడు. ముందుగా కథ రాసిన తర్వాతే, ఎవరు ఈ కథకు న్యాయం చేయగలుగుతారో ఆలోచిస్తానని చెప్పారు. సినిమా అన్నాక ఎవరు, ఎవరితోనైనా, ఎప్పుడైనా సినిమా చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే అల్లు అరవింద్ తో కలిసి సినిమా చేయనున్నట్లు రిషబ్ ప్రకటించారు. అయితే, తన ఏపాయింట్ ను బేస్ చేసుకుని కథ, రాస్తారు? అందులో ఎవరిని హీరోగా తీసుకుంటారు? అనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు.
After watching #Kantara, Jr NTR @tarak9999 appreciated me over the phone...!
— 𝐍𝐓𝐑 𝐓𝐡𝐞 𝐒𝐭𝐚𝐥𝐰𝐚𝐫𝐭 (@NTRTheStalwart) November 5, 2022
~ Actor/Director @shetty_rishab pic.twitter.com/C81FIAo4fr
త్వరలో ‘కాంతార’ సీక్వెల్ ప్రకటన!
ఇక ‘కాంతార’ సినిమా అద్భుత విషయాన్ని అందుకోవడంతో, ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ అంశంపై రిషబ్ తో పాటు నిర్మాత విజయ్ కిరగందూర్ పాజిటివ్ గా స్పందించారు. కేజీఎఫ్ విజయం సాధించడంతో దానికి సీక్వెల్ తీసిన విజయ్, కాంతార సినిమాకు కూడా సీక్వెల్ రావడం ఖాయం అని చాలా మంది భావిస్తున్నారు. త్వరలోనే కాంతర సీక్వెల్ కు సంబంధించి ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
Also Read : తెలుగు సినిమా దర్శకులందు త్రివిక్రమ్ వేరయా!