News
News
X

Kantara 2 Movie Update : 'కాంతార'కు సీక్వెల్, ప్రీక్వెల్ కూడా  

సూపర్ డూపర్ హిట్ 'కాంతార'కు సీక్వెల్, అలాగే ప్రీక్వెల్ చేసే అవకాశాలు ఉన్నాయని హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి కన్ఫర్మ్ చేశారు. అయితే... దానికి ముందు ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చారు. 

FOLLOW US: 
 
ఇప్పుడు 'కాంతార' (Kantara) సినిమా పేరు దేశవ్యాప్తంగా వినబడుతోంది. తొలుత కన్నడలో విడుదల అయిన సినిమా... ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల అయ్యింది. అన్ని భాషల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అంతే కాదు... భారీ వసూళ్లు కూడా సాధిస్తోంది. సంచలన విజయం నమోదు చేసింది. కన్నడలో కేవలం రెండు వారాల్లో వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. మిగతా భాషల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. 'కాంతార'ను మెచ్చిన ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ చేసే అవకాశాలు ఉన్నాయి. 

Kantara Sequel Update : ''కాంతార'కు సీక్వెల్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే, ప్రీక్వెల్ (Kantara Prequel) కూడా! అయితే, ప్రస్తుతానికి నేను వాటి గురించి ఆలోచించడం లేదు. రెండు నెలలు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఈ విశ్రాంతి సమయంలో... ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను'' అని రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

'కాంతార' కథకు...
రిషబ్ బాల్యానికి!
'కాంతార' చిత్రంలో కథానాయకుడిగా నటించడమే కాదు... ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆయన బాల్యానికి, 'కాంతార' కథకు ఓ సంబంధం ఉంది. ఆయన దక్షిణ కర్ణాటకలో తీర ప్రాంతానికి చెందిన వ్యక్తి. అక్కడ దైవారాధన ఎక్కువ. మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు కుల దైవం వంటి ఆచారాలు ఉన్నాయి. బాల్యంలో ఆ ఆచారాలను గమనించిన రిషబ్ శెట్టి, ఈ సినిమాలో చూపించారు. 

'కెజియఫ్' (KGF) కంటే ముందు నుంచి... 
'కాంతార' సినిమాను కన్నడలో విడుదల చేసే ఉద్దేశంలో తీశామని, మా చిత్రానికి వచ్చిన స్పందన చూశాక... ఇతర భాషల్లో డబ్బింగ్ చేశామని రిషబ్ శెట్టి తెలిపారు. 'కెజియఫ్' తర్వాత ఇతర భాషల్లో కన్నడ సినిమాలకు ఆదరణ పెరిగిందని చాలా మంది భావిస్తున్నారని, అది నిజం కాదని ఆయన పేర్కొన్నారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అని, ఆయన 'మహిషాసుర మర్ధిని' సినిమా పలు భాషల్లో డబ్బింగ్ అయ్యిందని రిషబ్ శెట్టి గుర్తు చేశారు.  

News Reels

Also Read : రొమాన్స్, థ్రిల్, సూసైడ్ - హెబ్బా పటేల్ సినిమాలో నరేష్, పవిత్రా లోకేష్

'కాంతార' సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. రెండు రోజుల్లో ఈ సినిమా పదకొండు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. అజనీష్ లోకనాథ్ నేపథ్య సంగీతానికి మంచి పేరు వచ్చింది.  కథానాయిక సప్తమి గౌడ పాత్ర సహజంగా ఉందని చాలా మంది ప్రశంసించారు. అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. 'కెజియఫ్' రెండు భాగాలతో దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : అరవింద్ ఎస్ కశ్యప్, కూర్పు : ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్, సంగీతం - అజనీష్ లోకనాథ్. 

Published at : 18 Oct 2022 10:19 AM (IST) Tags: Kantara Movie Rishab Shetty Kantara 2 Movie Update Kantara Sequel Kantara Prequel Rishab Shetty Interview

సంబంధిత కథనాలు

Prabhas Movie : ఐదు 'కాంతార'లు తీయొచ్చు -  ప్రభాస్, మారుతి మూవీ వీఎఫ్ఎక్స్ బడ్జెట్‌తో!

Prabhas Movie : ఐదు 'కాంతార'లు తీయొచ్చు - ప్రభాస్, మారుతి మూవీ వీఎఫ్ఎక్స్ బడ్జెట్‌తో!

RRR Box Office Japan: జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్‘ వసూళ్ల సునామీ, రజనీకాంత్ ‘ముత్తు‘ రికార్డును చిత్తు చేసేనా?

RRR Box Office Japan: జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్‘ వసూళ్ల సునామీ, రజనీకాంత్ ‘ముత్తు‘ రికార్డును చిత్తు చేసేనా?

Veera Simha Reddy : తమన్‌కు టార్గెట్ ఫిక్స్ చేసిన బాలకృష్ణ ఫ్యాన్స్ - బాక్సులు పగిలిపోవాలంతే

Veera Simha Reddy : తమన్‌కు టార్గెట్ ఫిక్స్ చేసిన బాలకృష్ణ ఫ్యాన్స్ - బాక్సులు పగిలిపోవాలంతే

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

టాప్ స్టోరీస్

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Rahul Gandhi on BJP: 'పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

Rahul Gandhi on BJP: 'పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

IND vs BAN 1st ODI: నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!

IND vs BAN 1st ODI:  నేడు భారత్- బంగ్లా తొలి వన్డే- బంగ్లా పులులపై టీమిండియా పైచేయి సాధిస్తుందా!