Kangana Ranaut: ఇజ్రాయెల్ రాయబారిని కలిసిన కంగనా, హమాస్ నేటి రావణాసుర అంటూ ఆగ్రహం
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటించింది. ఆ దేశ రాయబారి నార్ గిలాన్ ను కలిసి ఆమె, ఓ వీడియో క్లిప్ ను ట్విట్టర్ లో షేర్ చేసింది. హమాస్ ను నేటి రావణాసురగా అభివర్ణించింది.
కంగనా రనౌత్. సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందింది. ఏ విషయాన్ని అయినా డేర్ అండ్ డ్యాషింగ్ గా కుండబద్దలు కొడుతుంది. తన అభిప్రాయాన్ని సుత్తి లేకుండా సూటిగా చెప్తుంది. అంశం ఏదైనా తనదైన శైలిలో గళం విప్పుతుంది. తాజాగా ఇజ్రాయెల్, హమాస్ నడుమ వార్ నడుస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ రాయబారి నార్ గిలాన్ ను కంగనా కలిసింది. రామ్ లీలా మైదానంలో జరిగిన రావణ దహనం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె, గిలాన్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. ఈ భేటీకి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
ఇజ్రాయెల్‌కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది- కంగనా
ఇజ్రాయెల్ లోని తాజా పరిస్థితుల గురించి ఆదేశ రాయబారితో చర్చించినట్లు కంగనా వెల్లడించింది. “నా మనసంతా ఇజ్రాయెల్ గురించే ఆలోచిస్తోంది. మా హృదయాలు రక్తమోడుతున్నాయి” అంటూ ఓ వీడియో క్లిప్ ను నెటిజన్లతో పంచుకుంది. “ఇజ్రాయెల్ కు, యూదులకు నా మద్దతు ఉంటుంది. ఈ విషయం గురించి నేను ఇప్పటికే చాలా సార్లు బహిరంగంగా చెప్పాను. హిందువులు శతాబ్దాలుగా మారణ హోమం ఎదుర్కొంటున్నట్లే, యూదులు కూడా ఎదుర్కొంటున్నారు. భారత్ హిందువులకు ఎలా ఉందో, యూదులకు కూడా ప్రత్యేక దేశం ఉండాల్సిందే” అని కంగనా అభిప్రాయపడింది.
View this post on Instagram
హమాస్ మోడ్రన్ రావణ- కంగనా
ఇక ఉగ్ర సంస్థ హమాస్‌పై కంగనా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. హమాస్‌ను మోడ్రన్ రావణాసురగా అభివర్ణించింది. “ఇజ్రాయెల్, భారత్ ఉగ్రవాదంపై నిరంతరం పోరాడుతూనే ఉన్నాయ. రావణ దహనం కోసం ఢిల్లీకి వచ్చాను. ఇజ్రాయెల్ ఎంబసీకి వెళ్లి ఆధునిక రావణ హమాస్ తో పోరాడుతున్న ఇజ్రాయెలీలను కలవాలి అనుకున్నాను. చిన్నారులు, మహిళలను బలి తీసుకుంటుంటే నా గుండె పగులుతోంది. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందనే నమ్మకం నాకు ఉంది” అని కంగనా వెల్లడించింది. అటు ఈ సందర్భంగా తన ‘తేజస్’ సినిమాకు సంబంధించి తేజస్ యుద్ధ విమానం ప్రతిమను గిలాన్ కు అందజేసింది.
My heart goes out to Israel.
— Kangana Ranaut (@KanganaTeam) October 25, 2023
Our hearts are bleeding too.
Here’s my conversation with Israel’s ambassador to Bharat Naor Gilon. @IsraelinIndia pic.twitter.com/yIuUPognN1
ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘తేజస్’
అటు కంగనా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ నటించిన నటించిన తాజా చిత్రం ‘తేజస్’ ఈ నెల 27న విడుదల కానుంది. సర్వేష్ మేవారా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను, రోనీ నిర్మించారు. అటే ఆమె నటించిన మరో సినిమా 'ఎమర్జన్సీ' కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన కంగనా లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. అచ్చం ఇందిరా కనిపిస్తున్నట్లుగానే ఉంది. ఈ చిత్రాలు సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు పెంచుతున్నాయి.
Read Also: రామ్ లీలా మైదానంలో రావణ దహణం, సరికొత్త చరిత్ర సృష్టించిన కంగనా రనౌత్, కానీ ఓ అపశ్రుతి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial