News
News
X

Kalyanam Kamaneeyam: సంక్రాంతి బరిలో సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’ మూవీ, మోషన్ పోస్టర్ రిలీజ్

సాధారణంగా సంక్రాంతి సీజన్ లో ఎక్కువ స్టార్ హీరోల సినిమాలే విడుదల అవుతాయి. అయితే అప్పుడప్పుడూ ఈ పెద్ద సినిమాల లిస్ట్ లో కొన్ని చిన్న సినిమాలు కూడా వచ్చి క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నింస్తుంటాయి.

FOLLOW US: 
Share:

సంక్రాంతిని క్యాష్ చేసుకోడానికి టాలీవుడ్ నిర్మాతలు ఎప్పుడూ ముందుంటారు. దీంతో చిన్న, పెద్ద చిత్రాలన్నీ క్యూ కడతాయి. ఒకప్పుడు పెద్ద సినిమాలు వస్తున్నాయంటే.. చిన్న సినిమాలు బరి నుంచి తప్పుకొనేవి. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆధరిస్తారనే ధైర్యం పెరిగింది. అందుకే, ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా సంతోష్ శోభన్ సైతం సంక్రాంతికి సిద్ధమవుతున్నాడు. ‘కళ్యాణం కమనీయం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మూవీ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో పాటు తమిళ హీరోలు అజిత్, విజయ్ సినిమాలు కూడా సంక్రాంతికే విడుదల కానున్నాయి. వీరితో ఇప్పుడు మరో రెండు చిన్న చిత్రాలు పోటీకి దిగుతున్నాయి. ఇప్పటికే రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన ‘విద్య వాసుల అహం’ సినిమా 2023, జనవరి 14 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సంతోష్ శోభన్, ప్రియ భవాణీ కలసి నటించిన ‘కళ్యాణం కమనీయం’ సినిమా కూడా జనవరి 14 న విడుదల కానున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్, వీడియోలను విడుదల చేశారు మేకర్స్. అనిల్ కుమార్ ఆళ్ళ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యూవీ క్రియేషన్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. 

View this post on Instagram
 
A post shared by UV Creations (@uvcreationsofficial)

యూవీ క్రియేషన్ బ్యానర్ పై సంతోష్ శోభన్ ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమాలో నటించారు. మళ్లీ అదే బ్యానర్‌పై సంతోష్ శోభన్ నటిస్తున్న రెండో సినిమా ఇది. అలాగే ఆయన నటించిన ‘అన్నీ మంచి శకునములే’ మూవీ కూడా విడుదలకు సిద్దంగా ఉంది. ఇటీవల సంతోష్ నటించిన ‘లైక్ షేర్ సబ్స్కైబ్’ పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా కనిపించింది. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 

Read Also: 2022 మోస్ట్ పాపులర్ స్టార్స్‌లో దక్షిణాది తారల హవా, టాప్ 10లో ఆరుగురు మనోళ్లే!

Published at : 09 Dec 2022 03:46 PM (IST) Tags: Santosh Shoban kalyanam kamaneeyam Priya Bhavani Santosh Shoban New Movie

సంబంధిత కథనాలు

NTR 32 Exclusive : ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ 32 - తమిళ దర్శకుడితో కాదు, తెలుగోడితోనే!

NTR 32 Exclusive : ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ 32 - తమిళ దర్శకుడితో కాదు, తెలుగోడితోనే!

Arjun Das Tollywood Entry : తెలుగులో అర్జున్ దాస్ ఎంట్రీ - లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్‌రా

Arjun Das Tollywood Entry : తెలుగులో అర్జున్ దాస్ ఎంట్రీ - లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్‌రా

Vani Jayaram Funeral : ముగిసిన వాణీ జయరామ్ అంత్యక్రియలు - మృతిపై మిస్టరీ గుట్టువిప్పే పనిలో పోలీసులు

Vani Jayaram Funeral : ముగిసిన వాణీ జయరామ్ అంత్యక్రియలు - మృతిపై మిస్టరీ గుట్టువిప్పే పనిలో పోలీసులు

Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి 2' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్

Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి 2' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్

Ram Charan : హైదరాబాద్ పాతబస్తీలో రామ్ చరణ్ పాట - శంకర్ ప్లాన్ ఏంటంటే?

Ram Charan : హైదరాబాద్ పాతబస్తీలో రామ్ చరణ్ పాట - శంకర్ ప్లాన్ ఏంటంటే?

టాప్ స్టోరీస్

Viveka Murder Case : నిజాలు బయటపడే రోజు దగ్గర్లోనే, సీఎం జగన్ సహకరించి ఉంటే 10 రోజుల్లో విచారణ పూర్తి - దస్తగిరి

Viveka Murder Case : నిజాలు బయటపడే రోజు దగ్గర్లోనే, సీఎం జగన్ సహకరించి ఉంటే 10 రోజుల్లో విచారణ పూర్తి - దస్తగిరి

Pervez Musharraf Profile: ముషారఫ్ పాక్ నుంచి ఎందుకు పారిపోయారు? భుట్టోను హత్య చేయించారా?

Pervez Musharraf Profile: ముషారఫ్ పాక్ నుంచి ఎందుకు పారిపోయారు? భుట్టోను హత్య చేయించారా?

YS Sharmila: తెలంగాణలో ఆత్మహత్యలే లేవు అన్న సన్నాసి ఎవరు? - వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు

YS Sharmila: తెలంగాణలో ఆత్మహత్యలే లేవు అన్న సన్నాసి ఎవరు? - వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు

WhatsApp Tips: ఫోన్ టచ్ చేయకుండా వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లు చేయటం ఎలా? సీక్రెట్ ట్రిక్ ఇది!

WhatsApp Tips: ఫోన్ టచ్ చేయకుండా వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లు చేయటం ఎలా? సీక్రెట్ ట్రిక్ ఇది!