Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 25: విహారి జాడ తెలుసుకునేందుకు లక్ష్మీ చేసిన ప్రయత్నాలు ఏంటి..? పోలీసులు విహారని ఎన్‌కౌంటర్ చేశారా..? లేదా..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode: విహారిని చూపించాల్సిందేనంటూ లక్ష్మీ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో.. న్యూస్ ఛానెళ్లలో వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ రోజు ఏపిసోడ్‌లో చూడొచ్చు.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode: విహారీ తల్లి కంగారు పడుతుంటే...సహస్ర కూడా భయాందోళన చెందుతుంది. విహారికి ఏమైనా ప్రమాదం తలపెడతారేమేనని ఆందోళన చెందుతారు. దీంతో పద్మాక్షమ్మ వారికి ధైర్యం చెబుతుంది. ఎవరైనా శత్రువులు బెదిరించడానికే ఇదంతా చేసి ఉంటారని...నా పలుకుబడి ఉపయోగించి విహారి ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటానని అభయమిస్తుంది. బెదిరించడానికే అయితే ఈపాటికి మనకు ఫోన్ చేసి ఉండేవాళ్లని..కానీ ఇప్పటి వరకు మనకు ఎలాంటి ఫోన్లు రాలేదంటే అనుమానించాల్సేందనని అంబికా అంటుంది. ఈలోగా మహాలక్ష్మీ ఎక్కడ అని విహారి తల్లి ఆరా తీయగా...అది పోలీసుస్టేషన్ దగ్గరే ఏడుస్తోందంటూ పద్మాక్షమ్మ విసురుగా సమాధానం ఇస్తుంది.ఇప్పుడు దాని గొడవ ఎందుకు అదేమైనా విహారిని వెతికి తీసుకొస్తుందా అంటుంది. దీనికి ఆమె ఐటీ రైడ్స్ జరిగినప్పుడు విహారిని కాపాడింది లక్ష్మీనే అని...ఇప్పుడు కూడా లక్ష్మీనే విహారిని కాపాడుతుందని అంటారు. అది మీకు ఏదో మందుపెట్టిందని...అందుకే ఎప్పుడూ దాని భజనే చేస్తున్నారంటూ అంబికా మండిపడుతుంది.
విహారిని చూపించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ లక్ష్మీ పోలీసుస్టేషన్ ఎదుటే నిరసన దీక్షకు కూర్చుకుంటుంది. చీకటిపడినా అక్కడి నుంచి కదలకుండా ఉంటుంది. పోలీసు కానిస్టేబుల్ వచ్చి చెప్పినా ససేమిరా అంటుంది. ఇదే విషయం ఆమె ఎస్‌ఐకు చెబుతుండగా విహారి వింటాడు. నా కోసం తాను పోరాటం చేస్తోందని బాధపడతాడు.
విహారిని ఎప్పుడు ఎన్‌కౌంటర్ చేస్తారంటూ అంబికా సీఐపై ఒత్తిడి చేయడంతో....లక్ష్మీ స్టేషన్ బయటే ఆందోళన చేస్తోందని చెబుతాడు. దాన్ని పక్కకు లాగేసి విహారని త్వరగా తీసుకుని వెళ్లాలని చెప్పడంతో సరేనంటాడు. లేడీకానిస్టేబుళ్లతో బలవంతంగా లక్ష్మీని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తారు. ఇదంతా చూసిన ఓ విలేఖరి మీడియాకు ఉప్పందిస్తాడు. ఈ వ్యవహారం మొత్తం టీవీలో వస్తుంది. ఈవిషయం టీలో చూసిన విహారి తల్లి...ఎంతో ఆందోళన చెందుతుంది. ఖచ్చితంగా విహారి స్టేషన్‌లోనే ఉండి ఉంటాడని అందుకే లక్ష్మీ ఆందోళన చేస్తోందని అంటుంది.పోలీసులు క్లియర్‌గా చెప్పారని అక్కడ ఎవరూ లేరని....లక్ష్మీ కావాలనే సింపతీ కోసం షో చేస్తోందని అంబికా మండిపడుతుంది. మినిష్టర్‌తో కూడా మాట్లాడనని....ఆయన ఎస్పీతో మాట్లాడి విహారిని పట్టుకుంటామని హామీ ఇచ్చారంటూ పద్మాక్షమ్మ చెబుతుంది.ఈలోగా ఈ లక్ష్మీ ఇలా గొడవ చేయడం దేనికని మండిపడుతుంది.
ఇంతలో లేడికానిస్టేబుళ్లు లక్ష్మీని పట్టుకుని బయటకు గెంటివేస్తారు. అప్పుడే అక్కడికి కమిషనర్ రావడంతో పోలీసులు కంగుతింటారు. ఏం జరిగిందని కమిషనర్ సీఐని నిలదీయగా....మార్నింగ్ నుంచి ఈ అమ్మాయి స్టేషన్ ఎదుట న్యూసెన్స్ చేస్తోందని సీఐ చెబుతాడు. అప్పుడు లక్ష్మీ కలుగజేసుకుని....విహారిని లోపల బంధించి లేడని అబద్ధం చెబుతున్నారని కమిషనర్‌కి లక్ష్మీ ఫిర్యాదు చేస్తుంది. విహారిగారిని వెతికిపెట్టమని మినిష్టర్ నుంచి నాకు కూడా కాల్స్ వచ్చాయమ్మా....కానీ అతను ఇక్కడ లేడనే వీరికి నేను కాల్ చేయలేదని అంటాడు. అప్పుడు సీఐ కలుగజేసుకుని విహారి ఇక్కడ నిజంగా లేడని చెప్పడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.నువ్వు ఇంకా మారలేదా అని మండిపడతాడు. విహారి గొంతు నేను విన్నానని చెప్పడంతో...నిజంగా విహారి లోపల ఉంటే నేనే అతన్ని విడిపించి వీరందరినీ ఉద్యోగం నుంచి తీసివేస్తానని చెబుతాడు. అందరూ కలిసి లోపల వెతకడానికి వెళతారు. ఎస్పీ లోపలకి వెళ్లి స్టేషన్ మొత్తం చెక్ చేస్తాడు.కానీ కమిషనర్‌కు కూడా విహారి ఎక్కడ ఉన్నాడో కనిపించడు. దీంతో స్పెషల్ టీంను పెట్టి విహారిని వెతికిస్తానని ఏమైనా అవసరం ఉంటే తనకు ఫోన్ చేయాల్సిందిగా ఫోన్ నెంబర్ ఇచ్చి కమిషనర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. విషయం పెద్దది అవ్వకు ముందే పని కానిచ్చేయాలంటూ విహారిని తీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేయాలని సీఐ ఎస్‌ఐని ఆదేశిస్తాడు. దీంతో వారు విహారికి కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లేందుకు బయటకు తీసుకు వస్తారు. అప్పుడు రోడ్డుపై అక్కడే ఉన్న లక్ష్మీని విహారి చూడటంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

