Kaikala Chiranjeevi Friendship: చిరంజీవి కైకాల కాంబోనే కాదు, వాళ్ల స్నేహం కూడా సూపర్ హిట్టే
Kaikala Chiranjeevi Friendship: మెగాస్టార్, కైకాల సత్యనారాయణ మధ్య గొప్ప స్నేహబంధం ఉంది.
Kaikala Chiranjeevi Friendship:
చిరంజీవితో సాన్నిహిత్యం..
కైకాల సత్యనారాయణ నట ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు దాటుకుని వచ్చారు. గంభీరమైన పాత్ర అయినా...సరదాగా సాగిపోయే క్యారెక్టర్ అయినా అలా ఒదిగిపోయారు. డైలాగ్ డిక్షన్‌లో అప్పటికే ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ ఓ ట్రెండ్ సెట్ చేశారు. అంతకు మించి చేస్తే కానీ నిలదొక్కు కోలేరు. అలాంటి సీనియర్ నటులను దాటుకుని తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ క్రియేట్ చేసుకోవాలని తపించారు కైకాల. ఆ తపనే ఆయనను స్పెషల్‌గా నిలబెట్టింది. సీనియర్ ఎన్‌టీఆర్‌తో దాదాపు 100 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించేలా చేసింది. ఆ ముందు తరం నటులతోనే కాదు. తరవాత వచ్చిన బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్...ఇలా అందరితోనూ నటించారు సత్యనారాయణ. అయితే...వీరిలో ఆయన సన్నిహితంగా ఉంది మాత్రం చిరంజీవితోనే. వాళ్లిద్దరి స్నేహం గురించి తెలుగు ఇండస్ట్రీ ఎప్పూడూ స్పెషల్‌గా చెబుతూనే ఉంటుంది. కైకాల అంటే చిరంజీవికి ఎనలేని అభిమానం. వాళ్ల ఇంటికి తరచూ వెళ్తుండే వారు కూడా. సినిమాలకు దూరమై, వేషాలు రాని సమయంలోనూ కైకాలకు అండగా నిలబడ్డారు చిరంజీవి. గతేడాది జులై 25 న ఆయన కైకాల సత్యనారాయణ 86వ పుట్టినరోజు జరుపుకున్నారు. అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించింది. పూర్తిగా బెడ్‌కే పరిమితమయ్యారు. ఇలాంటి సమయంలోనూ చిరంజీవి కైకాల ఇంటికి వెళ్లారు. ఆయన ఆప్యాయంగాపలకరించారు. ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అంతే కాదు. ఆయన బెడ్‌పై ఉండగానే కేక్ కట్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. అంతే కాదు. వాళ్ల కుటుంబ సభ్యులకు ధైర్యం కూడా చెప్పారు. సోషల్ మీడియాలో ఈ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు చిరంజీవి.
చిరంజీవి సినిమాలకు సహ నిర్మాతగా..
చిరంజీవి, కైకాల సత్యనారాయణ కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. వీటిలో కైకాల యముడిగా నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. వీటితో పాటు స్టేట్ రౌడీ, కొదమ సింహం, బావగారు బాగున్నారా లాంటి చిత్రాలూ ప్రేక్షకులను అలరించాయి. చిరంజీవి కెరీర్‌లోనూ బెస్ట్‌గా నిలిచాయి. రుద్రవీణ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు సినిమాల్లోనూ వీళ్లిద్దరి కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయింది. మరో విశేషం ఏంటంటే...కైకాల సత్యనారాయణ రమా ఫిలింస్ పేరిట ప్రత్యేక ఓ ప్రొడక్షన్ సంస్థనూ ప్రారంభించారు. చిరంజీవితో చేసిన కొదమ సింహం సినిమా...రమా ఫిలింస్ బ్యానర్‌లోనే
విడుదలైంది. అదొక్కటే కాదు. చిరంజీవి నటించిన మరి కొన్ని చిత్రాలకూ సహ నిర్మాతగా ఉన్నారు కైకాల. అందుకే..వాళ్లిద్దరి స్నేహం అంతగా బలపడింది. ఆరు దశాబ్దాల పాటు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన కైకాల...క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. అనారోగ్యంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. సినీ కార్యక్రమాల్లోనూ చాలా తక్కువగా కనిపించేవారు. అప్పుడప్పుడూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించారే తప్ప...పూర్తి స్థాయి క్యారెక్టర్ చేయలేదు.
Also Read: Kaikala Satyanarayana Death : నటుడిగా కైకాల ప్రయాణంలో మజిలీలు - సత్యనారాయణ సమగ్ర సినిమా చరిత్ర