Jamie Lever: ఆ ఒక్కటీ అడక్కు - హీరోయిన్‌గా లెజెండరీ కమెడియన్ కూతురు
Aa Okatti Adakku Movie: ఆ ఒక్కటీ అడక్కు... నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన సినిమా. ఇప్పుడు ఆ టైటిల్‌తో మరో సినిమా తెరకెక్కుతోంది. అందులో హీరోయిన్‌గా లెజెండరీ కమెడియన్ కుమార్తె నటిస్తున్నారు.
Johnny Lever's daughter Jamie Lever set to make her Telugu debut with Aa Okatti Adakku: నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఈవీవీ దర్శకత్వం వహించిన సినిమా 'ఆ ఒక్కటీ అడక్కు'. అప్పట్లో ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ పేరుతో ఇప్పుడు తెలుగులో ఓ సినిమా రూపొందుతోంది. లేటెస్ట్ 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాతో లెజెండరీ కమెడియన్ కుమార్తె తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
కథానాయికగా జానీ లివర్ కుమార్తె జెమీ
లెజెండరీ కమెడియన్, హిందీ సినిమాలతో పాపులర్ అయిన జానీ లివర్ ఉన్నారు కదా! ఆయన కుమార్తె పేరు జెమీ లివర్. హిందీలో నాలుగైదు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ చేశారు. అక్షయ్ కుమార్ 'హౌస్ ఫుల్ 4'లో ఒక రోల్ చేశారు. ఇప్పుడు తెలుగు తెరకు 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాతో కథానాయికగా పరిచయం అవుతున్నారు. మాతృభాషలో సినిమా చేసే అవకాశం రావడంతో జెమీ లివర్ చాలా సంతోషంగా ఉన్నారు.
జానీ లివర్ బాలీవుడ్ సినిమాలు ఎక్కువ చేసినప్పటికీ... ఆయన తెలుగు వ్యక్తి. ఆయన మాతృభాష తెలుగు. ఏపీలోని ప్రకాశం జిల్లాలో కల కనిగిరిలో ఆయన జన్మించారు. కొన్ని రోజులు హైదరాబాద్ పాతబస్తీలో కూడా ఉన్నారు. తండ్రి ముంబైలో సెటిల్ కావడంతో జెమీ లివర్ అక్కడ పెరిగారు. అయితే... ఆమెకు తెలుగు స్పష్టంగా వచ్చు. ఇప్పుడు తెలుగు సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు.
Also Read: జయరామ్ పెళ్లాంతో సరిగా కాపురం చేసే క్యారెక్టర్లు చేయరా?
'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాలో అవకాశం రావడం, నటిస్తుండం పట్ల జెమీ లివర్ మాట్లాడుతూ ''కల నిజమైనట్లు ఉంది. నటిగా నా ప్రయాణంలో ఇదొక సినిమాగా మాత్రమే చూడటం లేదు. తెలుగు నా మాతృభాష. తెలుగులో నటించడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. నా గ్రాండ్ మదర్ కి నేను ఇస్తున్న నివాళి ఈ సినిమా'' అని చెప్పారు.
'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాను రాజీవ్ చిలక ప్రొడ్యూస్ చేస్తున్నారు. భాషలకు అతీతంగా పెద్దలతో పాటు చిన్నారులను ఎంతగానో ఆకట్టుకున్న 'ఛోటా భీమ్' ప్రొడ్యూసర్ ఆయన. అంతే కాదు... సీనియర్ నటులు సిఎస్ఆర్ ఆంజనేయులు వారసుడు కూడా. ఆయన తమ పెద్ద తాతయ్య అని శ్రీనివాస్ చిలక తెలిపారు. రెండు దశాబ్దాల నుంచి యానిమేషన్ రంగంలో ఎంతో మంది అభిమానం సొంతం చేసుకున్న బ్యాంగ్ విక్రమ్ బేతాల్, ది కృష్ణ, చోటా భీమ్ వంటి కార్యక్రమాలను గ్రీన్ గోల్డ్ గ్రూప్ సంస్థ ద్వారా రాజీవ్ చిలక ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు చిలకా ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి తెలుగు సినిమా పరిశ్రమలో తమ ప్రయాణం ప్రారంభిస్తున్నారు.
Also Read: సీడెడ్, గుంటూరులో లాభాల్లోకి 'నా సామి రంగ' - నాలుగు రోజుల్లో ఎంత వచ్చిందంటే?
రాజీవ్ చిలక మాట్లాడుతూ ''లయన్ కింగ్' చూసి ఇలాంటి సినిమా ఇండియాలో ఎందుకు తీయకూడదు అనిపించింది. వరల్డ్ డిస్నీ నాకు ఓ ఇన్‌స్పిరేషన్. నేను యానిమేషన్ రంగంలోకి అడుగు పెట్టినప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి. వాటని అధిగమిస్తూ కష్టపడుతూ పైకి వచ్చాం. 'లయన్ కింగ్' లాంటి సినిమా చేయాలని గ్రీన్ గోల్డ్ స్టార్ట్ చేశాం. నాకంటే ముందు నాకు తెలిసిన స్నేహితులు చాలా మంది ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ కాలేక ఇంటికి వెళ్లిపోయారు. అన్నీ గమనిస్తూ వచ్చా. ప్రజెంట్ రెండు తెలుగు సినిమాలు, హిందీలో ఓ చిన్న పిల్లల చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇవీ కాకుండా ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి'' అని చెప్పారు.