News
News
X

Janhvi Kapoor: నాన్నతో ఆ అలవాటు మాన్పించేందుకు అమ్మ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు: జాన్వీ

ఎవరు ఎన్ని చెప్పినా తన తండ్రి మాత్రం ఆ అలవాటు మానలేదని చెప్పింది జాన్వీ. బోణీ కపూర్ సిగరెట్లు మానేసే వరకూ శ్రీ దేవి నాన్ వెజ్ తినను అని భీష్మించుకుని కూర్చుందట.

FOLLOW US: 

సినీ నటి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందం, నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి. సినిమాల్లో నటిస్తుండగానే బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను 1996లో వివాహం చేసుకున్నారు శ్రీదేవి. వారికి జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ సినిమాల్లో నటిస్తున్నారు. బోణీ కపూర్ శ్రీదేవి జంట ఎంతో చూడముచ్చటగా ఉండేవారు. అయితే ఒక్క విషయంలో మాత్రం బోణీ కపూర్ తో శ్రీ దేవి బాగా ఇబ్బంది పడిందట. దానివల్ల శ్రీదేవి ఆరోగ్యం కూడా బాగా క్షించిందట. ఈ విషయాన్ని స్వయంగా జాన్వీ కపూర్ బయపెట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జాన్వీ దాని గురించి చెప్పి శ్రీదేవిని గుర్తు చేసుకుంది.

బోని కపూర్ సిగరెట్లు ఎక్కువగా తాగేవారట. ఎంతలా అంటే చైన్ స్మోకర్ లా పెట్టెలు మీద పెట్టెలు కాల్చి పడేసేవారట. ఈ విషయమై శ్రీదేవి ఎప్పుడూ బోనీ కపూర్ తో గొడవ పడుతూ ఉండేదని చెప్పింది జాన్వీ. ఎవరు ఎన్ని చెప్పినా తన తండ్రి మాత్రం సిగెరెట్ లు మానలేదని చెప్పింది జాన్వీ. బోని కపూర్ సిగెరెట్లు మానేసే వరకూ శ్రీ దేవి నాన్ వెజ్ తినను అని భీష్మించుకుని కూర్చున్నారట. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించి బాగా వీక్ అయిపోవడంతో డాక్టర్లు కూడా నాన్ వెజ్ తినాలని సూచించారట, బోని కూడా బతిమిలాడరట. కానీ శ్రీదేవి మాత్రం తినను అని తెగేసి చెప్పారట.

ఇంత జరిగినా సరే తన తండ్రి మాత్రం సిగెరెట్లు మానలేదని, అది ఎవ్వరితరం కాలేదని చెప్పుకొచ్చింది. ముంబాయ్ లో జుహు ఇంట్లో తల్లిదండ్రులతో కలసి ఉన్నప్పటి సంఘటనలు గుర్తు చేసుకుంది జాన్వీ. తన తండ్రిని స్మోకింగ్ కు దూరంగా ఉంచడానికి తన చెల్లి ఖుషి కపూర్ తో కలసి ఎన్నో ప్రయత్నాలు చేశామని చెప్పింది. ఉదయాన్నే సిగెరెట్లు ప్యాకెట్ తీసుకొని వాటిని కట్ చేయడం, వాటికి టూత్ పేస్ట్ అంటించి పెట్టడం లాంటి పనులు చేసే వాళ్ళమని గుర్తు చేసుకుంది జాన్వీ.

మొత్తానికి బోణీ నాలుగైదు సంవత్సరాల క్రితం స్మోకింగ్ మానేసాడట. "ఆమె నన్ను అప్పుడు ఆపాలని కోరింది. కానీ నేను ఆపలేదు. ఇప్పుడు ఆపుతున్నా" అని బోణీ అన్నారట. ఫిబ్రవరి 24 2018లో దుబాయ్ లో ఓ వివాహ వేడుకకు వెళ్లిన శ్రీదేవి మళ్ళీ తిరిగి రాలేదు. అక్కడ వాష్ రూమ్ లో జారి బాత్ టబ్ లో పడటం వలన ఆమె మరణించిందని రిపోర్ట్ లో రాశారు. అయితే శ్రీ దేవి మరణం పై చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ రిపోర్ట్ లో మాత్రం నీటిలో మునిగిపోవడం వలన చనిపోయిందని రాశారు. శ్రీదేవి మరణంతో యావత్ సినీ ప్రపంచం షాక్ గురైంది. ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమా రంగంలోనే ఉంది. జాన్వీ తన నటనతో అందరిని ఆకట్టుకుంటోంది.  వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది. జాన్వీ కపూర్ త్వరలో సర్వైవల్ థ్రిల్లర్ మిలీలో కనిపించనుంది.

News Reels

Also Read : విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య & ఇంకా - సమంత 'యశోద'కు పాన్ ఇండియా హీరోల సపోర్ట్

Published at : 26 Oct 2022 07:41 PM (IST) Tags: Sridevi Janhvi Kapoor Boney Kapoor

సంబంధిత కథనాలు

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

18 pages movie song: మీరు పాడకపోతే ఇక్కడే ధర్నా చేస్తా - శింబుతో బలవంతంగా పాట పాడించిన నిఖిల్, ఈ వీడియో చూశారా?

18 pages movie song: మీరు పాడకపోతే ఇక్కడే ధర్నా చేస్తా - శింబుతో బలవంతంగా పాట పాడించిన నిఖిల్, ఈ వీడియో చూశారా?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ మొదలు- ఫైనల్ కి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరు?

టాప్ స్టోరీస్

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

YS Sharmila : లోటస్ పాండ్ టు ఎస్‌ఆర్ నగర్‌ పోలీస్ స్టేషన్ వయా సోమాజిగూడ - షర్మిల అరెస్ట్ ఎపిసోడ్‌లో క్షణక్షణం ఏం జరిగిందంటే ?

YS Sharmila :  లోటస్ పాండ్ టు ఎస్‌ఆర్ నగర్‌ పోలీస్ స్టేషన్ వయా సోమాజిగూడ - షర్మిల అరెస్ట్ ఎపిసోడ్‌లో క్షణక్షణం ఏం జరిగిందంటే ?