Janaki Kalaganaledu November 2nd: మల్లిక తిక్క కుదిర్చిన జానకి- హత్య చేసిన అఖిల్
అఖిల్ డబ్బు సంపాదన కోసం తప్పు దారి ఎంచుకుంటాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జ్ఞానంబ మల్లికని పిలిపించి మాట్లాడుతుంది. నీ కడుపులో ఉన్నది వేరు బయటకి మాట్లాడుతున్నది వేరు అని తెలిసినాక బాధగా అనిపించి ఆ విషయం మాట్లాడదామనే పిలిచాను. మా నుంచి విడిపోయి దూరంగా ఉండాలని అనుకున్నావ్. అదే విషయం చెప్పేశావ్. మా నుంచి వేరుగా ఉండాలనే నీకు మేము చేసి పెట్టేది నచ్చకపోవచ్చు. అందుకే నీకు నచ్చింది వండించి పెడతాను అని జ్ఞానంబ చెప్పేసరికి మల్లిక ఊపిరి పీల్చుకుంటుంది. అంటే నేను కడుపుతో లేను అనే విషయం జానకి ఇంకా చెప్పలేదన్న మాట ఎందుకు చెప్పలేదా అని ఆలోచిస్తుంది.
ఎలాగూ మన నుంచి వేరు పడి ఉండాలని అనుకుంది కదా ఇప్పుడు కూడా తననే వండుకోమనండి అప్పుడు వేరుగా ఉన్నట్టు తనకి కూడా తృప్తిగా ఉంటుందని జానకి చెప్తుంది. అందువల్ల వచ్చే మంచి చెడులు కూడా తీసుకుంటుందని జానకి మల్లికని అడిగితే ఏం చేప్పాలో తెలియక తల ఊపుతుంది. అవసరం అయితే మల్లిక చికిత సహాయం తీసుకుంటుందిలే మల్లికనే వండుకొనివ్వమని రామా కూడా అంటాడు. సరే మీరు అన్నట్టు మల్లిక తన వంట తనే చేసుకుంటుందని జ్ఞానంబ చెప్తుంది. మల్లిక ప్రెగ్నెన్సీ గురించి అప్పుడే చెప్పకూడదు అత్తయ్యగారు తట్టుకోలేరు సమయం చూసి చెప్పాలని జానకి మనసులో అనుకుంటుంది.
Also read: లాస్య నోటి దురుసు అదుపులో పెట్టుకోమన్న అభి- వాదులాడుకున్న దివ్య, అనసూయ
అఖిల్ డబ్బు తీసుకుని మాల్ సప్లై చేసే వాళ్ళ దగ్గరకి వస్తాడు. డబ్బులు ఇచ్చి మాల్ తీసుకుంటాడు. తీసుకునే వాడికి నీకు తప్ప వేరే వాళ్ళకి తెలియకుండా హ్యాండిల్ చెయ్యి, ఏదైనా తేడా వస్తే మీ వాళ్ళందరిని ఇందులో ఇరికిస్తాను అని మాల్ ఇచ్చిన వాడు వార్నింగ్ ఇస్తాడు. అది ఎక్కడ అమ్మాలి అని అడుగుతాడు. మన కాలేజీలో అమ్ముకోవచ్చని అఖిల్ ఫ్రెండ్ చెప్తాడు. అందరూ తింటూ ఉంటే మల్లిక లొట్టలు వేస్తూ ఉండటం చూసిన జ్ఞానంబ తనకి కూడా పెట్టమని అంటుంది. ఆశగా తినడానికి వచ్చిన మల్లికని గోవిందరాజులు దెప్పిపొడుస్తాడు. మరీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ స్వేచ్చకి అడ్డుపడుతున్నట్టు ఉంటుంది, కడుపులో బిడ్డ గురించి మనం మాత్రమే కాదు తను కూడా చూసుకోవాలి కదా వేరుగా ఉంటే తను కూడా చేసుకోవాలి కదా. కడుపు నిండితే బిడ్డ గురించి జాగ్రత్త తీసుకోవాలనే ఆలోచన రాదు, సొంత నిర్ణయాలు తీసుకొనివ్వు బాధ్యత అంటే ఏంటో తెలుస్తుందని గోవిందరాజులు చెప్తాడు.
జ్ఞానంబ మాట్లాడబోతుంటే గోవిందరాజులు అడ్డుపడి ఆపుతాడు. మల్లిక నువ్వు వెళ్ళి నీకు నచ్చింది వండుకుని తిను అని అంటాడు. చేసేది లేక మల్లిక వంటలు చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ వంటగదిలోకి వచ్చిన గోవిందరాజులు మల్లికని ఆడుకుంటాడు. జానకి ఐపీఎస్ కోచింగ్ దగ్గరకి ఐపీఎస్ ఆఫీసర్ ప్రసన్న కుమార్ వస్తారు. కోచింగ్ తీసుకునే వాళ్ళని మోటివేట్ చెయ్యడానికి వస్తారు. తప్పు చేస్తే సొంతవాళ్ళు అని కూడా చూడకుండా వాళ్ళకి శిక్ష పడేలా చూడాలని చెప్తాడు. బంధాలకి తల వంచకుండా డ్యూటీ చేయాలని అలా అని ప్రమాణం చెయ్యమని అంటారు. ఎవరు ప్రమాణం చేసేందుకు ముందుకు రారు కానీ జానకి మాత్రం ప్రతిజ్ఞ చేస్తుంది. తనని చూసి మిగతా వాళ్ళు కూడా ప్రతిజ్ఞ చేస్తారు. అందరికీ ఇన్ స్పైర్ గా నిలిచావంటూ ఐపీఎస్ ఆఫీసర్ జానకిని మెచ్చుకుంటాడు.
Also read: దేవి ప్లాన్ అదుర్స్, అడ్డంగా బుక్కైన రుక్మిణి- ఆదిత్యే తన తండ్రి అని తెలిసిపోతుందా?
తరువాయి భాగంలో..
అఖిల్ కాలేజీలో మాల్ అమ్ముతూ మాధురి అనే అమ్మాయికి చిక్కుతాడు. తను అఖిల్ నిలదిస్తుంది. వెంటనే తను కాలేజీ బయటకి పరుగులు పెడుతుంటే అఖిల్ కూడా వెంటపడతాడు. ఇప్పుడు నువ్వు ఆగకపోతే నిజంగా చంపేస్తాను అని తన మీదకి కర్ర విసురుతాడు. అక్కడే ఉన్న జానకి అది చూస్తుంది. తలకి దెబ్బ తగలడం వల్ల మాధురి రక్తపు మడుగులో కిందపడిపోతుంది.