Janaki Kalaganaledu November 25th: మల్లికకి తప్పిన పెద్ద ప్రమాదం- జానకితో సవాల్ చేసిన రామా
కుటుంబం కోసం జానకి ఐపీఎస్ చదువు వదిలేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జానకి ఐపీఎస్ చదువు వదిలేసిందని తెలుసుకున్న మల్లిక తెగ సంబరపడుతుంది. రామా ఎంత చెప్పినా కూడా జానకి మాత్రం ఇంటి కోడలిగా, రామా భార్యగా ఉంటానని తెగేసి చెప్తుంది. ‘రెండే రెండు రోజుల్లో మీ మనసు మార్చి మళ్ళీ మిమ్మల్ని కాలేజీకి వెళ్ళేలా చేస్తాను అలా చేయకపోతే నేను జానకి భర్తనే కాదు’ అని రామా శపథం చేస్తాడు. మల్లిక విషయం తెలిసిన ఆనందంలో తెగ డాన్స్ చేస్తూ హుషారుగా ఉంటుంది. డాన్స్ చేస్తూ ఉండటం జ్ఞానంబ చూస్తుంది. మల్లిక గెంతులు వేస్తూ కాలు జారి కిందపడి దీపం కుందు మీద పడబోతుంటే సమయానికి జ్ఞానంబ వచ్చి పట్టుకుంటుంది. తర్వాత కాలు విరిగింది అని నాటకం ఆడుతుంది.
Also Read: గుండెలు పగిలేలా రోదించిన అనసూయ- ఉగ్రరూపం దాల్చి తల్లిని ఇంట్లోకి అడుగుపెట్టొద్దన్న నందు
కడుపుతో ఉన్నదానివి చూసుకునే పని లేదా అని జ్ఞానంబ తిడుతుంది. ఇంట్లో అందరూ మల్లిక అరుపులకి బయటకి వస్తారు. ఏమైందని గోవిందరాజులు అడుగుతాడు. ఒక్క క్షణం నేను పట్టుకోకపోతే కడుపు దీపపు కుందుకి తగిలి చాలా పెద్ద ప్రమాదం జరిగేది అని చెప్తుంది. ‘నువ్వు వట్టి మనిషివి కూడా కాదు కడుపుతో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా జరగరానిది జరిగితే ఏంటి పరిస్థితి. కుదురుగా ఉండమని చాలా సార్లు చెప్పాను. పొరపాటున ఏమైనా అయి ఉంటే ఎంత బాధపడే వాళ్ళం’ అని జ్ఞానంబ తిడుతుంది. జ్ఞానంబ ఇంట్లో పరిస్థితుల గురించి ఆలోచిస్తూ చాలా కంగారు పడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ ధైర్యం చెప్తారు. ఇంట్లో శాంతి కోసం ఏదైనా పూజ చేస్తే పరిష్కారం ఉంటుందేమో అని పూజారిని అడుగుతారు. శివుడికి అభిషేకం చేస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయని పూజారి చెప్పడంతో పూజకీ ఏర్పాట్లు చెయ్యమని రామాకి చెప్తుంది.
ఇక మల్లికని జానకి తన గదిలోకి తీసుకుని వెళ్తుంది. నటించింది చాలు ఇక ఆపు అని జానకి అంటుంది. నటించడం ఏంటి అని మల్లిక నీళ్ళు నములుతుంది. అత్తయ్యగారు తిడతారని నువ్వు ఈ నాటకం ఆడుతున్నావని నాకు తెలుసు అని జానకి అనేసరికి మల్లిక బతిమలాడినట్టు నటిస్తుంది. ఇంట్లో వాళ్ళని కడుపుతో ఉన్నావ్అని నమ్మించి తప్పు చేస్తున్నావ్ అని జానకి అంటుంది. నిజం తెలిసిన నువ్వు ఇంకా ఎందుకు చెప్పలేదో అర్థం కావడం లేదని మల్లిక అంటుంది. నిజం ఎక్కువ రోజులు దాగదు కడుపు దాగేది కాదు, నీవల్ల వారసుడు వస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ నీ గురించి నిజం తెలిస్తే భద్రకాళి అవతారం చూస్తావ్ అని జానకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.
Also Read: మాళవిక జైలుకి వెళ్ళి చిప్పకూడు తినాల్సిందేనన్న అభిమన్యు- కోర్టుకి చేరిన వేద, యష్
ఇంట్లో అందరూ పూజ చెయ్యడానికి శివాలయానికి వెళతారు. పూజ పూర్తయ్యే లోపు గుడి చుట్టూ ప్రదక్షిణలు చెయ్యమని రామా, జానకికి చెప్తుంది. వాళ్ళిద్దరూ కలిసి నడవటం చూసి మల్లిక కుళ్ళు కుంటుంది. అది గమనించిన గోవిందరాజులు కౌంటర్ వేస్తాడు. ఇంట్లో అందరి ముందు జెస్సి మీద ప్రేమ ఉన్నట్టు అఖిల్ నటిస్తాడు. కోనేటిలో దీపాలు వెలిగించమని పూజారి జ్ఞానంబ వాళ్ళకి చెప్తాడు. దీపాలు వెలిగించేందుకు దంపతులు వాటిని సిద్ధం చేస్తూ ఉంటారు. అందరి కల ఆశయం ప్రకారం మీరు ఐపీఎస్ చదివి ఆఫీసర్ అవ్వాలి అని రామా కోరుకుంటాడు.