News
News
X

Janaki Kalaganaledu November 1st: మల్లికని భయపెట్టిన కల- కన్నింగ్ ప్లాన్ వేసి జానకిని నమ్మించిన అఖిల్

మల్లిక దొంగ కడుపు డ్రామా జానకికి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

జానకి చెప్పింది నిజమేనా హాస్పిటల్ కి వెళ్దాం పదా అని జ్ఞానంబ మల్లికని అడుగుతుంది. నాకు హాస్పిటల్ అంటే  భయం రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి అని మల్లిక కవర్ చేస్తుంది. పని తప్పించుకుని తిరుగుతుంటే నాకు డౌట్ గా నే ఉందని గోవిందరాజులు అంటాడు. అయితే డాక్టర్ ని ఇంటికి పిలిపించమని గోవిందరాజులు చెప్తాడు. జానకి ఫోన్ చేస్తుంటే నేనే నిజం చెప్తాను అని మల్లిక ఫోన్ చెయ్యకు అని అంటుంది. అత్తయ్యగారు ముందు నాకు కడుపు వచ్చిందనే అనుకున్నా కానీ కొన్ని రోజులకి అది కాదని అర్థం అయ్యింది, అప్పటికే వారసుడు రాబోతున్నాడు అని మీరు కలలు కంటున్నారని చెప్పలేకపోయాను అని నిజం చెప్పేస్తుంది.

Also Read: దేవి మీద చెయ్యెత్తిన రుక్మిణి- ఆదిత్యని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలు

కడుపు అని అబద్ధం చెప్పి అందరి మనోభావాలతో ఆడుకున్న నిన్ను వదిలిపెట్టకూడదు అని జ్ఞానంబ అంటుంది. నీ ద్వారా ఇంటికి వారసుడు రాబోతున్నాడని అమ్మ ఎంత సంతోషించిందో తెలుసా అని రామా కూడా బాధపడతాడు. ఎందుకు మల్లిక మా అందరి మనసులతో ఆడుకుంటున్నావ్ నిలదీస్తాడు. ఇంకా నీతో మాటలు ఏంటి మీ అమ్మానాన్నని తీసుకుని రా అని విష్ణు వెళ్లిపొమ్మని అంటాడు. మల్లిక విష్ణు కాళ్ళ మీద పడి నన్ను పంపించకండి అని బతిమలాడుతుంది. నన్ను పంపించకండి అని నిద్రలో బతిమలాడుతుంది. అది విని విష్ణు కంగారుగా లేచి ఏమైందని అడుగుతాడు. అదంతా కల అని మల్లిక తేరుకుంటుంది. విష్ణు పుట్టబోయే బిడ్డ గురించి ఆరాటపడటం చూసి మల్లిక ఫీల్ అవుతుంది.

అఖిల్ పొద్దున్నే లేచి బయటకి వెళ్లిపోదామని అనుకుంటాడు. మీ మాటలు నన్ను బాగా ఇన్ స్పైర్ చేశాయి, నేను ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ చేయాలని, కోర్సు నేర్చుకోవాలని అనుకుంటున్నా అని జెస్సికి చెప్తాడు. కోర్సు చేయాలంటే డబ్బు కావాలి కదా అంటాడు. నిన్ను బాగా చదువుకోమంటే ఈ పార్ట్ టైమ్ జాబ్ ఏంటి అని జానకి అడుగుతుంది. నువ్వే నాకు స్పూర్తి వదిన ఒకవైపు ఇంటి పనులు చేసుకుంటూనే మరోవైపు ఐపీఎస్ కి ప్రిపేర్ అవుతున్నావ్ కదా నేను కూడా అలాగే చేయాలని అనుకుంటున్నా అని అఖిల్ చెప్తాడు. జెస్సి తన మెడలో చైన్ తీసి దాన్ని తాకట్టు పెట్టి కోర్సు ఫీజు కట్టమని చెప్తుంది. జానకి వద్దని అంటుంది కానీ అఖిల్ అడ్డుపడతాడు. అన్నయ్య డబ్బు ఇస్తే నేను మళ్ళీ చెడిపోతాను అని జానకిని నమ్మిస్తాడు. జానకి తన మాటలు నమ్మి డబ్బు ఇస్తుంది.

News Reels

Also read: లాస్యకి వార్నింగ్ ఇచ్చిన నందు- తులసి నుంచి ఇంటిని లాగేసుకునేందుకు అనసూయ స్కెచ్

తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు అఖిల్ మనసులో సంబరపడతాడు. మల్లిక జానకి గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. చికిత వచ్చి అమ్మగారు పిలుస్తున్నారని చెప్తుంది. ఎలా తప్పించుకోవాలో తెలియక తిప్పలు పడుతుంది. రాత్రి వచ్చిన కల ఇప్పుడు నిజం అయ్యేలా ఉందే అని మల్లిక టెన్షన్ పడుతుంది. జ్ఞానంబ కోపంగా ఉంటే మల్లిక వచ్చి భయపడుతూ రమ్మన్నారంట అని అడుగుతుంది. తమరి గురించి తెలిసింది అందుకే రమ్మన్నాం అని గోవిందరాజులు అనేసరికి జానకి చెప్పేసిందా అని భయపడుతుంది. ఇన్నాళ్ళూ నీకు అన్నీ సమకూర్చాము కానీ నువ్వు చేసిన పని బాధ, కోపం అనిపించిదని జ్ఞానంబ అంటుంది.

Published at : 01 Nov 2022 10:10 AM (IST) Tags: janaki kalaganaledu serial today episode Janaki Kalaganaledu Serial Written Update Janaki Kalaganaledu Serial Janaki Kalaganaledu Serial November 1st Update

సంబంధిత కథనాలు

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Panchathantram Trailer : బ్రహ్మానందం థీమ్ పంచేంద్రియాలు - వీల్ ఛైర్‌లో స్వాతి

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Gurtunda Seetakalam : తమన్నాతో సత్యదేవ్ సినిమా గుర్తుందిగా? విడుదలకు రెడీ!

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Bigg Boss 6 Telugu: వేదికపై ఫ్యామిలీ మెంబర్స్, పాత కంటెస్టెంట్లు, టీవీ సెలెబ్రిటీలు - ప్రోమో అదిరిపోయింది

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి