News
News
X

Janaki Kalaganaledu March 18th: పండంటి బిడ్డకి జన్మనిచ్చిన జెస్సి- సంతోషంలో జ్ఞానంబ కుటుంబం

జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

ఎస్సై మనోహర్ నిజస్వరూపం గురించి జానకి భర్త రామకి చెప్తుంది. తన మీద కోపంతోనే కావాలని షూస్ లేస్ కట్టించుకున్నాడని అంటుంది. చెడు మీద గెలవాలంటే మీరు ఐపీఎస్ అవడం అని రామ ధైర్యం చెప్తాడు. గోవిందరాజులు పూజలో అమ్మలక్కలు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉండగా జ్ఞానంబ వస్తుంది. ఇంటి పెద్ద కోడలు బాధగా నీతో చెప్పడానికి వస్తే నువ్వు వినలేదు తర్వాత మాట్లాడదామని వస్తే నువ్వే మాట్లాడావ్ అని అంటాడు. కూతురు తప్పు చేస్తే తల్లిగా మందలించానని అంటుంది. మీరు జానకి వైపు నుంచే కాదు రామ వైపు నుంచి కూడా ఆలోచిస్తే తన బాధ అర్థమవుతుందని చెప్తుంది. విష్ణు, అఖిల్ లా రామ కాదు తన మనసు వేరు ఇది కావాలని ఎప్పుడు నోరు తెరిచి ఇది కావాలని అడగలేదు ఒక్క జానకి విషయంలో తప్ప. నేను వాడిని కళ్ళలో పెట్టుకుని చూసుకున్నా వాడి భార్య కూడా అలాగే చూసుకోవాలని అనుకుంటున్నానని చెప్తుంది.

Also Read: తులసికి పెళ్లిరోజు కానుక ఇచ్చిన నందు- విక్రమ్ ని గుప్పిట్లో పెట్టుకునేందుకు రాజ్యలక్ష్మి ఎత్తుగడ

జానకి ఇలా చేయడం ముమ్మాటికి తప్పేనని అంటుంది. జానకి భర్త రెడీ అవుతుంటే వెళ్ళి కౌగలించుకుంటుంది. కాసేపటికి తేరుకుని అదంతా తన కల అని బయటకి వస్తుంది. ఏమైంది నాకు మనసు కంట్రోల్ తప్పుతుంది, లక్ష్యం చేరుకునేవరకు గీత దాటకూడదని పుస్తకాల వైపు చూసి అనుకుంటుంది. జెస్సికి నొప్పులతో అల్లాడిపోతుంటే ఇంట్లో అందరూ కంగారు పడతారు. వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వస్తారు. స్టేషన్ కి వచ్చిణ మనోహర్ ఇంకా జానకి రాలేదా అని సుగుణని అడుగుతాడు. నిన్న మీరే రెక్కి వర్క్ చెప్పారు కదా అని సుగుణ అంటే వెళ్ళిందా లేదా అనేది కావాలి, ఇంతవరకు ఫోన్ కూడా చేయలేదు ఏమనుకుంటుందని మండిపడతాడు. వెంటనే జానకికి కాల్ చేసి పొజిషన్ ఏంటో కనుక్కోమని చెప్తాడు. దీంతో సుగుణ జానకికి కాల్ చేస్తుంది కానీ తను లిఫ్ట్ చేయదు. జానకి ఫోన్ తీసుకురాకుండా హాస్పిటల్ లో ఉంటుంది.

జెస్సికి పెయిన్స్ వస్తున్నాయని నార్మల్ డెలివరీ అవుతుందేమోనని చూస్తున్నామని డాక్టర్ చెప్తుంది. జెస్సీకి కడుపులో ఉన్న బిడ్డకి ఎటువంటి ప్రమాదం లేదు కదా అని రామ టెన్షన్ పడుతుంటే జానకి ఏం కాదని చెప్తుంది. హాస్పిటల్ లో ఉన్న దేవుడి విగ్రహం దగ్గరకి వెళ్ళి దండం పెట్టుకుంటుంది. జెస్సికి కడుపులో బిడ్డకి ఏం కాకుండా జాగ్రత్తగా ఉండేలా చూడు. ఇంతకముందు జెస్సి స్కానింగ్ చూసి కడుపులో బిడ్డ ఎదుగుదల సరిగా లేదని చెప్పారు. ఆ తర్వాత బాగానే ఉందని చెప్పారు. పైకి రామకి ధైర్యం చెప్పినా లోలోపల భయంగా ఉంది భారం నీదే స్వామి అని దండం పెట్టుకుంటుంది. ఆ మాటలన్నీ జ్ఞానంబ విని డెలివరీ కష్టంఅవుతుందని డాక్టర్ చెప్పారా అని కంగారుగా అడుగుతుంది. అలా ఏమి లేదని జానకి ధైర్యం చెప్తుంది. నిజం దాచి ఒక్కదానివి బాధపడటం అలవాటు కదా అని అంటుంది కానీ జానకి మాత్రం ఏం కాదని చెప్తుంది.

Also Read: రిషి, వసుకి ఫస్ట్ నైట్- ఉచ్చుబిగించిన దేవయాని, ఈసారి తప్పించుకోవడం కష్టమే

ఇటు మనోహర్ జానకి ఉన్న స్పాట్ కి వెళ్తున్నానని సుగుణకి చెప్పి వెళ్తాడు. ఎంతగా ఫోన్ చేసినా జానకి లిఫ్ట్ చేయకపోవడంతో స్టేషన్ రికార్డ్ లో ఉన్న రామ నెంబర్ కి కాల్ చేస్తుంది. జెస్సికి నార్మల్ డెలివరీ అయ్యిందని మగబిడ్డ పుట్టాడని డాక్టర్ వచ్చి చెప్పడంతో జ్ఞానంబ కుటుంబం సంతోషిస్తుంది.

Published at : 18 Mar 2023 11:09 AM (IST) Tags: janaki kalaganaledu serial today episode Janaki Kalaganaledu Serial Written Update Janaki Kalaganaledu Serial Janaki Kalaganaledu Serial March 18th Update

సంబంధిత కథనాలు

Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!

Dasara Collections: ‘దసరా’ అడ్వాన్స్ బుకింగ్ అదుర్స్ - నాని కెరీర్‌లో సరికొత్త రికార్డు!

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Silk Smitha Poster: ‘దసరా’ మూవీలో సిల్క్ స్మితా పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా - అసలు విషయం చెప్పేసిన దర్శకుడు

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?