Janaki Kalaganaledu February 22nd: జ్ఞానంబని బతికించుకునేందుకు జానకి ప్రయత్నాలు- మల్లిక తిక్క కుదిర్చిన గోవిందరాజులు
జ్ఞానంబ ఆరోగ్య పరిస్థితి గురించి జానకికి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జ్ఞానంబ ఆరోగ్య పరిస్థితి భర్తకి చెప్పలేక తనలో తనే బాధపడుతూ కుమిలికుమిలి ఏడుస్తుంది. అమ్మ గురించి అడుగుతుంటే చెప్పకుండా ఏడుస్తున్నారు ఏమైందని రామ కంగారుగా అడుగుతాడు. అమ్మకి ఆరోగ్యం బాగోలేదంటేనే తట్టుకోలేను ఇక ప్రాణం పోయిందంటే తట్టుకోలేనని రామ అంటాడు. అది విని నిజం ఇప్పుడే చెప్తే తట్టుకోలేరని జానకి బాధని దిగమింగుకుని రిపోర్ట్ బాగానే ఉన్నాయని చెప్తుంది. జ్ఞానంబ పనులు చేస్తూ ఉంటే జానకి వచ్చి వద్దని వారించి ఇంట్లో ఏ పనులు చేయవద్దని అంటుంది. అన్ని మందులు ఎందుకు వేసుకుంటున్నారు ఏదో ప్రాణం పోయేవాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చారని మల్లిక అనేసరికి తిలోత్తమ వచ్చి నాలుగు వాతలు పెడుతుంది.
Also Read: యష్ గురించి విన్నీకి చెడుగా చెప్పిన అభిమన్యు- విషమంగా వేద ఆరోగ్యం
జానకిని చూసి తిలోత్తమ తెగ మెచ్చుకుంటుంది. ఇంట్లో ఉన్న జానకి ఫ్యాన్స్ ని తట్టుకోలేకపోతుంటే బయట నుంచి వచ్చిన ఈ అత్త కూడా జానకికి ఫ్యాన్ అయిపోయిందని మల్లిక తిట్టుకుంటుంది. జానకి డాక్టర్ గురించి చెప్పిన మాటలు తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అత్తయ్యని కాపాడుకోవడానికి ఏదో ఒక దారి చూడాలి, ఇంట్లో వాళ్ళు ఎవరూ ఏడ్చే పరిస్థితి రాకుండా చూడాలని అనుకుంటుంది. జ్ఞానంబ తులసి కోటకి పూజ చేద్దామని వెళ్ళేసరికి అక్కడ పూజ చేసి దీపం పెట్టి ఉంటుంది. ఎవరు చేశారు అని అనుకుంటూ ఉండగా తనే చేసినట్టు చెప్తుంది. ఉదయం చన్నీళ్లతో స్నానం చేసి పూజ చేస్తే ఆరోగ్యం ఏమవాలి అందుకే ఇంటి పెద్ద కోడలిగా నేను చేస్తానని జానకి అంటుంది. అయినా ఆలోచించాల్సింది నీ భర్త గురించి నా గురించి కాదు అని జ్ఞానంబ చెప్తుంది. మంచాన పడి రేపో మాపో పోయే పరిస్థితిలో లేను తన పనులు తనని చేసుకొనివ్వమని అంటుంది.
Also Read: దిండ్లు పెట్టి జంప్ అయిన స్వప్న, కనిపెట్టేసిన కావ్య- రాజ్ పెళ్లి ఎవరితో జరగనుంది?
తిలోత్తమ వచ్చి జ్ఞానంబని గుడికి వెళ్దాం రమ్మని పిలుస్తుంది. మలయాళంని బండి దగ్గర పెట్టి బయట ఆర్డర్ల కోసం బయట తిరగమని గోవిందరాజులు అంటాడు. అప్పుడే మలయాళం వచ్చి మూడు వేలు కావాలని అడుగుతాడు. రామ దగ్గర కొద్దిగా డబ్బులు మాత్రమే ఉన్నాయని అనేసరికి గోవిందరాజులు మిగిలిన ఇద్దరి కొడుకులని పిలిచి డబ్బులు ఇవ్వమని చెప్తాడు. తమ దగ్గర లేవని అఖిల్, విష్ణు చెప్తాడు. వేరు కాపురం అని చెప్పి మమ్మల్ని డబ్బులు అడుగుతారు ఏంటి మలయాళాన్ని పిలిపించింది మీరే కదా అని మల్లిక అంటుంది. మీరు ఇంటికి ఏం ఖర్చులు పెడుతున్నారని గోవిందరాజులు అంటాడు. ఏం ఖర్చు చేస్తున్నారని ప్రశ్నిస్తుంది. మీరు బాత్ రూమ్ లో వాడుకునే సబ్బు దగ్గర నుంచి తినే తిండి వరకు ఆయన తీసుకొస్తున్న డబ్బు కదా జానకి అంటుంది.
అప్పుడే జ్ఞానంబ వస్తుంది. కరెంట్, గ్యాస్ వంటి వాటికి అందరూ సమానంగా చూసుకోవాలి కదా జ్ఞానంబ అంటుంది. కానీ విష్ణు మాత్రం ఇంట్లో కరెంట్, గ్యాస్ ఖర్చు అన్నయ్య వాళ్ళదే ఉంటుందని అంటాడు. అలా కాదు నెలకి 20 వేలు ఖర్చు ఉంటుంది డానికి ముగ్గురూ వాటా ఇవ్వాల్సిందేనని గోవిందరాజులు చెప్తాడు. ముగ్గురు నెల నెలా 6500 ఇవ్వాలని లెక్కలు వేసి తేలుస్తారు. చేసేది లేక మల్లిక ఇస్తామని అంటుంది. కొడుకుల మాటలకు జ్ఞానంబ బాధపడుతుంది. మీ విషయంలో ఎవరూ వాటాలు వేసుకోవాలసిన అవసరం లేదు మేము ఖర్చులు పంచుకోవాలని అనుకోవడం లేదు ప్రేమని పంచుకోవాలని అనుకుంటున్నామని రామ, జానకి ధైర్యం చెప్తారు.