Janaki Kalaganaledu February 13th: భార్య ప్రేమని కాదన్న రామ- డబ్బు కొట్టేసి మోసం చేసిన చరణ్ ని జానకి పట్టుకోగలదా?
రామ చేసిన అప్పు వల్ల జ్ఞానంబ కుటుంబం కష్టాలు పడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. *
జానకి తన ప్రేమని రామా ముందు వ్యక్తపరచాలని అనుకుంటుంది. ఇద్దరూ కలిసి ఒక చోటకి వస్తారు. కళ్ళు మూసుకోమని జానకి చెప్తుంది. గులాబీ పూలు ఎదురుగా పెట్టి కళ్ళు తెరవమని అంటుంది. కొందరి జీవితాల్లో ముందుగా వచ్చేది నా జీవితంలో ఇప్పుడు వచ్చింది. ఈరోజు ప్రేమికుల రోజు. మీరు నన్ను ప్రేమించానని చెప్పారు కానీ నేను పెళ్ళైన తర్వాత మిమ్మల్ని ప్రేమించాను. ప్రేమ అంటే రెండు అక్షరాలు కలపడం కాదు రెండు మనసులు కలపడం అని మనం ఇద్దరం కలిశాక అర్థం అయ్యింది. నిజమైన ప్రేమకి నిలువెత్తు రూపం ఇస్తే అది మీరే. ఐ లవ్యూ అని చెప్పి రామ చేతికి ముద్దుపెడుతుంది.
Also Read: రాజ్ చెంప మీద కొట్టిన కావ్య- కనకం ఇంటికి పెళ్ళిచూపులకు వస్తామన్న అపర్ణ
రామ మాత్రం జానకి ఇచ్చిన పూలు తీసుకోకుండా ఆ ప్రేమని అందుకునేంత ప్రశాంతంగా మనసు లేదని చెప్తాడు. ‘తమ్ముళ్ళు ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారు అమ్మ అది తట్టుకోలేదు దాని గురించే ఆలోచిస్తున్నా, నా ఆనందం అమ్మ. ఈరోజు తను ఆనందంగా లేదు నేను ఇవ్వలేకపోతున్నా. ఈ సమయంలో ఏదైనా బహుమతిగా ఇవ్వాలని అనుకుంటే అది మా అమ్మ ఆనందమే. మీరు మీ ప్రేమని చెప్తే నేను బాధని చెప్పాను క్షమించండి’ అని అంటాడు. ఆ మాటకి జానకి చాలా బాధపడుతుంది. మల్లిక ఇల్లు వదిలి వెళ్లిపోతున్నందుకు తెగ సంబరపడుతుంది. మల్లికతో మాట్లాడటానికి గోవిందరాజులు వస్తాడు. మీరు వెళ్తాను అన్నప్పటి నుంచి అత్తయ్య చాలా బాధపడుతున్నారని చెప్తాడు. బయటకి వెళ్లిపోవాలనే ఆలోచన మానుకోమని అడుగుతాడు. మంచో చెడో అందరం కలిసే ఉందామని బతిమలాడతాడు.
కోపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నామని అనుకుంటున్నారా ఏంటని మల్లిక డ్రామా మొదలుపెడుతుంది. ఇదే మాట బయట జనాలతో చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఉమ్మడిగా ఉన్న కుటుంబాన్ని విడగొట్టాలని అనుకుంటారు కదా అని అంటుంది. ఈ చిన్న ఇంట్లో ఎన్ని రోజులు బాధపడతాం, ఎవరో ఒకరు అడుగు వేయాలని మేము బయటకి వెళ్తున్నాం అని మల్లిక అంటుంది. మీరు వెళ్తే మేము సుఖంగా ఉండాలని ఎందుకు అనుకుంటామని జ్ఞానంబ చెప్తుంది. ఇదే పాత ఇల్లు అయితే వెళ్లిపోతామని చెప్తామా చిన్న ఇల్లు కాబట్టి వెళ్లిపోతున్నామని మల్లిక అంటుంది. విష్ణు వచ్చి మల్లికకి థాంక్స్ చెప్తాడు. అందరం బాగుండాలని మనం బయటకి వెళ్తున్నామని అన్నందుకు చాలా సంతోషంగా ఉందని విష్ణు అంటాడు. కానీ మల్లిక మాత్రం అదేమీ లేదు ఏదో కవర్ చేశానని చెప్తుంది.
Also Read: ఊహించని నిర్ణయం తీసుకున్న మహేంద్ర- బెట్టు చేస్తున్న రిషిధార, బిక్కమొహం వేసిన చక్రపాణి
అత్తయ్య వాళ్ళు బాధపడుతున్నారు మనం అయినా ఆగిపోదామని జెస్సి అఖిల్ ని అడుగుతుంది. కానీ అఖిల్ మాత్రం ఎప్పటిలాగానే మాట్లాడతాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోతాం, మళ్ళీ తిరిగి వచ్చేది లేదు ఈ విషయం బయట చెప్తే వాళ్ళతో పాటు నువ్వు ఉండిపోతావ్ అని వార్నింగ్ ఇస్తాడు. మల్లిక అన్న మాటలు తలుచుకుని అటు జానకి, ఇటు జ్ఞానంబ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఏం జరగాలని రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందని భారం దేవుడి మీద వేస్తారు. జానకి దేవుడు ముందు దణ్ణం పెట్టుకుంటూ ఉండగా తన ఫ్రెండ్ తనతో వచ్చి మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఫోన్ వస్తుంది. తన అన్నయ్యకి జాబ్ వచ్చిందని, రూ.20 లక్షలు కడితే 3 నెలల్లో డబ్బులు తిరిగి ఇస్తారని ఆఫర్ బాగుందని ఆ అమ్మాయి జానకితో చెప్తుంది. అది విని జానకికి చరణ్ అని అర్థం అవుతుంది.