News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

Janaki Kalaganaledu July 18th Update: మల్లెపూలు తేలేదని బుంగమూతి పెట్టిన జానకి- జ్ఞానంబ చేతిలో మల్లికకు చీవాట్లు

జానకి జ్ఞానంబ కి ఇచ్చిన మాట కోసం ఎలాగైనా రామాని ఒప్పించాలని ప్రయత్నిస్తుంది. కానీ రామా మాత్రం ముందు ఐపీఎస్ కల నెరవేరిన తర్వాతే పిల్లల గురించి ఆలోచించాలని చెప్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

జానకి రామాని గదిలోకి తీసుకొచ్చి ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతుంది. ఏంటి ఇచ్చేది నేనేమీ తీసుకురాలేదని అంటాడు. నేను మల్లెపూలు తెమ్మని అంతగా చెప్పినా కూడా మీరు ఎలా మర్చిపోతారని అడుగుతుంది. కాలేజీకి మల్లెపూలు పెట్టుకుని వెళ్తే బాగోదని అంటాడు. నేను అకాడమీకి వెళ్ళను మీరు మల్లెపూలు తీసుకురాలేదని అలిగానని బుంగమూతి పెడుతుంది. ఈ మధ్య పనులు వల్ల మీకు అసలే చదువుకోవడం కుదరడం లేదు ఇప్పుడు అకాడమీకి వెళ్లకపోతే ఎలా అంటాడు. ఈరోజూ అకాడమీకి సెలవు అని చెప్తుంది. ఇక మల్లెపూలు తీసుకొచ్చి తన జడలో పెట్టమని రామాకి ఇస్తుంది. అవి ఎలా పెట్టాలో తెలియక రామా తికమక పడుతూ ఎలాగోకల పెట్టేస్తాడు. కాసేపు ఇద్దరి మధ్య రొమాన్స్ నడుస్తుంది. ఇక రామా దుప్పటి ముసుగేసుకుని జానకి తలలో పూలు పెట్టింది తలుచుకుని తెగ సిగ్గుపడిపోతాడు. 

Also Read: వసుని అవమానించిన సాక్షికి మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్ ఇచ్చిన రిషి, మనసులో ప్రేమను చెప్పకనే చెప్పిన వసు

ఇక మల్లిక జానకిని ఇరికించేందుకు మళ్ళీ ప్రయత్నిస్తుంది. రాత్రి ఎవరో కాలేజీ నుంచి ఫోన్ చేసి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తెమ్మని చెప్పారని వెన్నెల, అఖిల్ కి  చెప్తుంది. ఆ మాటకి మా కాలేజీ నుంచి అయితే డే టైమ్ ఫోన్ చేస్తారని అఖిల్, వెన్నెల చెప్తారు. అప్పుడే జ్ఞానంబ దంపతులు వస్తారు. వీళ్ళ కాలేజీ వాళ్ళేమో పగటి పూట మాత్రమే ఫోన్ చేస్తారంట కానీ వాళ్లేమో రాత్రి పూట ఫోన్ చేశారు. జానకి పేరు చెప్పి సర్టిఫికెట్స్ తెమ్మని చెప్పారు కానీ ఆ విషయం చెప్తే మీరేమో నమ్మడం లేదు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్టు జానకిని సరిఫికెట్స్ తీసుకురమ్మని చెప్పడం వెనుక ఉన్న బ్రహ్మ రహస్యం ఎంతో ఆ బ్రహ్మకే తెలియాలని అంటుంది. అయిపోయిందా నీ సన్నాయి నొక్కుల మేళం తెలిసి తెలియని తింగరి తనంతో ప్రవర్తిస్తున్నావ్, తెలుసుకుంటావ్ లే మారతావని చూస్తున్న కానీ నీకు చెప్పి చెప్పి మాకు చిరాకు వస్తుందే తప్ప నువ్వు మారడం లేదని మల్లికకు చీవాట్లు పెడుతుంది. ఆ మాటలకి అఖిల్, వెన్నెల భయపడి పారిపోతారు. మీరు నన్ను తిట్టండి అత్తయ్యగారు కానీ జానకికి కాలేజీ నుంచి ఫోన్ వచ్చిన విషయాన్ని తేలికగా తీసుకోకండి అని చెప్తుంది. ఎందుకంటే ఏదో ఒక రోజు దీని గురించి రహస్యం బయట పడుతుంది అప్పుడు మీరు కూడా తెలుసుకుని బాధపడతారని అంటుంది. ఇక దీని గురించి మాట్లాడొద్దని రాత్రే చెప్పాం కదా మరీ మళ్ళీ ఎందుకు పొద్దున్నే పెట్రోల్ పోసే కార్యక్రమం పెట్టుకున్నావని గోవిందరాజులు మొట్టికాయలు వేస్తాడు. ఎప్పుడు తోటికోడలు మీద పడి చాడీలు చెప్పడం తప్ప వేరే పని లేదా అని తిడతాడు. 

Also Read: పాపం మిస్టర్ యారగెంట్, వేద ముందు పరువు పోయే- ఎట్టకేలకు సారికను పట్టుకున్న యష్, నిజం బట్టబయలు

జానకి వాళ్ళ ముందు నువ్వు ఇలా మాట్లాడితే బాగోదని మల్లికకి జ్ఞానంబ వార్నింగ్ ఇస్తుంది. ఇక అందరూ తింటూ ఉండగా జానకి రామాతో సరసాలు మొదలుపెడుతుంది. కాళ్ళు గిల్లుతూ రామాని తిననివ్వకుండా చేయడంతో మెలికలు తిరుగుతూ ఉంటాడు. జానకి గారు ఏం చేస్తున్నారు మీరు అని ఇద్దరు గుసగుసలాడుకుంటారు. అది చూసి మల్లిక కుళ్ళుకుంటుంది. రామా ఏమైంది, ఒంట్లో ఏమైనా బాగోలేదా అని జ్ఞానంబ అడుగుతుంది. అదేమీ లేదమ్మా అని కవర్ చేస్తాడు. ఇదంతా మల్లిక గమనిస్తూ వీళ్ళు చెప్పే డైలాగులకి యాక్టింగ్ కి అస్సలు పొంతన కుదరడం లేదే అని అనుకుంటుంది. 

 

Published at : 18 Jul 2022 10:12 AM (IST) Tags: janaki kalaganaledu serial janaki kalaganaledu serial today Janaki Kalaganaledu Serial Today Episode Written Update Janaki Kalaganaledu July 18 th

సంబంధిత కథనాలు

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

SSMB28Update: 'పోకిరి' రిలీజ్ డేట్‌కి మహేష్, త్రివిక్రమ్ సినిమా - సమ్మర్‌లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!

SSMB28Update: 'పోకిరి' రిలీజ్ డేట్‌కి మహేష్, త్రివిక్రమ్ సినిమా - సమ్మర్‌లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!

Puri Jagannadh: క్రేజీ డీల్ వదులుకున్న 'లైగర్' టీమ్ - ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరి జగన్నాధ్!

Puri Jagannadh: క్రేజీ డీల్ వదులుకున్న 'లైగర్' టీమ్ - ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరి జగన్నాధ్!

టాప్ స్టోరీస్

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి  దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?

Munawar Faruqui : హైదరాబాద్ లో మునవార్ ఫారుఖీ షో, అడ్డుకుంటామని బీజేవైఎస్ వార్నింగ్

Munawar Faruqui : హైదరాబాద్ లో మునవార్ ఫారుఖీ షో, అడ్డుకుంటామని బీజేవైఎస్ వార్నింగ్