అన్వేషించండి
Giri Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
Giri Babu Death : టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు గిరిబాబు శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

నటుడు గిరిబాబు కన్నుమూత
Tollywood Senior Actor Giribabu Passed Away : టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ తెలుగు నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2023లో వచ్చిన 'అన్నీ మంచి శకునములే' ఆయనకు చివరి చిత్రం. దాదాపు 600కు పైగా సినిమాల్లో ఆయన నటించారు.
Advertisement
ట్రెండింగ్ వార్తలు






















