Jamuna Death: సీనియర్ నటి జమున మృతి పట్ల సినీ ప్రముఖుల నివాళి
సీనియర్ నటి జమున మృతి పట్ల తెలుగు సినిమా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీర్చలేని లోటుగా అభివర్ణించారు. దివంగత నటి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
సీనియర్ నటి జమున మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని టాలీవుడ్ ప్రముఖులు తెలిపారు. ఎన్నో సినిమాల్లో అద్భుత పాత్రలు పోషించి తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అభిప్రాయపడ్డారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు. జమున కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు- చిరంజీవి
“సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది. ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను” అని చిరంజీవి తెలిపారు.
సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి.మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు.మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది.ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 27, 2023
కళకు కళాకారులకు మరణం లేదు- బాలకృష్ణ
“అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నింటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున గారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195పైగా సినిమాల్లో నటించి నవరస నటనా సామర్థ్యం కనబరిచారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆరోజుల్లోనే హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రశంసలు పొందారు. నాన్నగారు అన్నట్లు కళకు, కళాకారులకు మరణం ఉండదు. ఈ రోజు జమునగారు భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి” అని నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.
తెలుగు ప్రేక్షకులకు సత్యభామగా గుర్తుండిపోతారు - పవన్ కల్యాణ్
“ప్రముఖ నటి, మాజీ ఎంపీ జమున గారు దివంగతులు కావడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు సినీ పరిశ్రమలో అలనాటి తరానికి తను ప్రతినిధిగా ఉన్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన జమున గారు, తెలుగు ప్రేక్షకులకు సత్యభామగా గుర్తుండిపోతారు. ఆ పౌరాణిక పాత్రకు ప్రాణం పోశారు. ప్రజా జీవితంలో లోక్ సభ సభ్యురాలిగా సేవలందించారు. జమున గారి మృతి పట్ల చింతిస్తూ వారి కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
శ్రీమతి జమున గారు ఆత్మకు శాంతి చేకూరాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/pndCA41A0N
— JanaSena Party (@JanaSenaParty) January 27, 2023
ఇండస్ట్రీకి ఆమె చేసిన సేవ ఎంతో గొప్పది- మహేష్ బాబు
జమున మృతి వార్త చాలా బాధ కలిగించిందని మహేష్ బాబు తెలిపారు. ఆమె ఎన్నో ఐకానిక్ పాత్రలు చేశారన్నారు. సినిమా పరిశ్రమకు ఆమె చేసిన సేవలు ఎంతో గొప్పవన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Saddened to hear about the demise of #Jamuna garu. Will fondly remember her for all her iconic roles and her immense contribution to the industry. My condolences to her family and loved ones 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) January 27, 2023
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మహారాణి- జూ. ఎన్టీఆర్
“దాదాపు గా 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మహారాణి లా కొనసాగారు. ‘గుండమ్మ కథ’, ‘మిస్సమ్మ’ లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేసారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
దాదాపు గా 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మహారాణి లా కొనసాగారు. గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేసారు.
— Jr NTR (@tarak9999) January 27, 2023
మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/ImmYbmBFl0
జమున గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి- కల్యాణ్ రామ్
మహానటి జమున ఆత్మకు శాంతి చేకూరాలని నందమూరి కల్యాణ్ రామ్ ప్రార్థించారు. ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
మహానటి జమున గారి ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్థన. జమున గారి కుటుంబసభ్యులు మరియు వారి సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 27, 2023
Read Also: ‘పఠాన్’ కోసం షారుఖ్, దీపికా పదుకొనే ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?