Allu Arjun on Major: మేజర్ మూవీ అద్భుతం, అడివి శేష్ మ్యాజిక్ చేశాడు: అల్లు అర్జున్ ట్వీట్
మేజర్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు అల్లు అర్జున్. సపోర్ట్‌ని మర్చిపోలేనంటూ అడివి శేష్ బదులిచ్చారు.
మేజర్ టీమ్‌కి అల్లు అర్జున్ ప్రశంసలు
సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ మేజర్ మూవీ జూన్ 3వ తేదీన విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో చూసిన ఉత్తమ చిత్రమిదేనని సినీ అభిమానులంతా ట్వీట్‌లు, పోస్ట్‌లు చేస్తున్నారు. అడివి శేష్ నటననూ అభినందిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియాతో పాటు GMB ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ పతాకాల సంయుక్త సమర్పణలో తెరకెక్కింది ఈ చిత్రం. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈయన మేకింగ్‌పైనా ప్రశంసల జల్లు కురుస్తోంది. బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో ఉన్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలు కూడా ప్రశంసిస్తున్నాయి. ఇప్పటికే సల్మాన్ ఖాన్, నాని సహా పలువురు సెలెబ్రెటీలు మేజర్ సినిమా అద్భుతం అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడీ జాబితాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు. మేజర్ చిత్రం సూపర్ అంటూ మూవీ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు. "మేజర్ టీమ్ మెంబర్స్‌కి అభినందనలు. మనసుని హత్తుకునేలా తీశారు. మ్యాన్ ఆఫ్ ది షో అడివి శేష్ మరోసారి మ్యాజిక్ చేశారు. ప్రకాష్ రాజ్, రేవతి, సయూ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ సహా ఇతర నటీనటులు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు. శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. గుండెల్ని పిండేసే ఇలాంటి మూవీని మాకు అందించినందుకు మహేశ్ బాబుకి పెద్ద థాంక్స్" అంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్.
Big congratulations to the entire team of #MajorTheFilm. A very heart touching film . Man of the show @AdiviSesh does his magic once again. Impactful support by @prakashraaj ji , Revathi , @saieemmanjrekar, #SobhitaDhulipala & all artists . Mind blowing Bsm by @SricharanPakala
— Allu Arjun (@alluarjun) June 4, 2022
మీ సపోర్ట్‌కి బిగ్ థాంక్స్: అడివి శేష్
ఈ ట్వీట్‌పై అడివి శేష్ స్పందించారు. "మీ అభిమానానికి కృతజ్ఞతలు. క్షణం సినిమా నుంచి మేజర్ వరకూ నన్ను ఎంతగానే సపోర్ట్ చేశారు. డిసెంబర్ 17వ తేదీ నా పుట్టిన రోజు. ఆ రోజు పుష్ప సినిమాతో నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడీ ట్వీట్‌తో మేజర్ మూవీ సక్సెస్‌ని మరింత స్పెషల్‌గా మలిచారు" అని బదులిచ్చారు అడివి శేష్.
Big man! Thank you so much for “AA”LL the love ❤️From #Kshanam to #Major Your support, grace and kindness has been incredible. It means a lot to me personally. You gifted #Pushpa on my birthday (Dec 17) :) and now you have made the success of #Major even sweeter #MajorTheFilm https://t.co/5xVh8ZTooC
— Adivi Sesh (@AdiviSesh) June 4, 2022