Hyper Aadi: హైపర్ ఆది ఫోటో కాల్చేసిన ఆటో రామ్ ప్రసాద్, చింపేసిన రష్మి!
Hyper Aadi : హైపర్ ఆది ఫోటోను ఆటో రామ్ ప్రసాద్ కాల్చేశాడు. అసలేం జరిగింది.
Hyper Aadi : ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’కి సంబంధించిన కొత్త ప్రోమో విడుదల అయ్యింది. జబర్దస్త్ లో కనిపించే నటీనటులు, మరికొంతమంది టీవీ ఆర్టిస్ట్ లు ఇందులో కనిపిస్తూ స్కిట్స్ చేసి ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. తాజాగా విడుదలైన ప్రోమోలో హైపర్ ఆదిని టార్గెట్ చేశారు. అందరూ కలిసి హైపర్ ఆది వల్ల ఇబ్బంది పడ్డామని చెప్పారు. ఆటో రామ్ ప్రసాద్ అయితే ఆది ఫోటో కాల్చేశాడు. రష్మి కూడా ఆది ఫోటో చించేసి అందరికీ షాక్ ఇచ్చింది.
‘ధనం మూలం ఇదం జగత్.. అప్పో రక్షిత్ రక్షితః.. కిందా మీద తోపు అప్పు చేసినోడు తోపు’ అంటూ హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ కలిసి స్కిట్ చేసి అలరించారు. ఈ షోకి హీరో ఆది, పాయల్ రాజ్ పుత్ విచ్చేశారు. వాళ్ళిద్దరూ కలిసి ‘తీస్ మార్ ఖాన్’ సినిమాలో నటిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ షోకి వచ్చి కాసేపు సందడి చేశారు. ఇక టీవీ నటులు ఇరగదీసే డాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చి అదరగొట్టారు.
ఆదితో పాటు మగవాళ్ళంతా ఆడవాళ్ళతో కబడ్డీ ఆడారు. ‘డైరెక్టర్ చేతిలో కంటెంట్ ఉంది.. నా చేతిలో మీకుంది’ అంటూ ఆది కబడ్డీ ఆటకి దిగి ఆడవాళ్ళతో కలిసి కాసేపు సరసాలు ఆడుతూ నవ్వులు పూయించాడు. ఇక ఖుషి సినిమాలోని నడుము సీన్ చేయాలంటూ ఆది రష్మీకి చెప్తాడు. ఇక ఆది నడుము చూస్తుంటే ‘ఏయ్ మీరు నా వొడుము చూశారు’’ అని రష్మి అనేసరికి ‘‘వొడుము ఏంటమ్మో’’ అని గాలి తీసేస్తాడు.
‘‘స్టేజ్ మీదకి కొంతమంది ఫోటోస్ తీసుకోస్తాం.. మీకు నచ్చని వాళ్ళ ఫోటోస్ చింపేయవచ్చు, కాల్చేయొచ్చు అని రష్మి చెప్తుంది. స్టేజ్ మీదకి వచ్చిన రామ్ ప్రసాద్ ఒక విషయంలో నేను హర్ట్ అయ్యాను, ఆది ఫోటోని కాల్చేస్తాడు. తర్వాత వచ్చిన పరదేశి కూడా ఆది ఫోటోని ముక్కలు ముక్కలుగా చింపేస్తాడు. ఆ ఘటనతో అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు. ఇక రష్మి వంతు వచ్చినప్పుడు తను కూడా ఆది ఫోటో చింపేస్తుంది. తర్వాత ఆది వంతు వచ్చినప్పుడు ఎవరి ఫోటో తీసుకుంటాడో అని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండటంతో ప్రోమోకి ఎండ్ కార్డ్ పడింది. అయితే ఆదిని అందరూ ఎందుకు టార్గెట్ చేశారు ? ఇది నిజమా లేక టీఆర్పీ కోసం ఇలా చేశారా? అని అనుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే పూర్తి షో ప్రసారం అయ్యేవరకు ఆగాల్సిందే.
గతంలో కూడా ఇలాగే ఆదిని పోలీసులు స్టేజ్ మీదకి వచ్చి అరెస్ట్ చేసి హంగామా చేశారు. చివరికి అది స్కిట్ లో భాగమని గాలి తీశారు, 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో ఈ మధ్య టీఆర్పీ స్కిట్స్ అని కొత్తగా ఒక సెగ్మెంట్ స్టార్ట్ చేశారు. రష్మీ గౌతమ్ స్పృహ తప్పి పడిపోయినట్టు నటించడం, ఇమ్మాన్యుయేల్ తన మీద చెయ్యి వేశాడని పూర్ణ ఫైర్ అవ్వడం వంటివి టీఆర్పీ స్కిట్ అన్నమాట. ఇప్పుడు ఆది ఫోటో కాల్చేయడం కూడా టీఆర్పీ కోసమే అని అనుకుంటున్నారు.
Also Read : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ
Also Read : అదీ రాజమౌళి రేంజ్, హాలీవుడ్ దర్శకులతో కలిసి - దర్శక ధీరుడికి అరుదైన గౌరవం