Hunt Movie Trailer: ‘హంట్’ ట్రైలర్ - మెమరీ లాస్ పోలీస్, ఓ థ్రిల్లింగ్ కేస్ - సుధీర్ బాబు స్టంట్స్ అదుర్స్!
సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘హంట్’ మూవీ ట్రైలర్ వచ్చేసింది. యాక్షన్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ ట్రైలర్ నచ్చేస్తుంది.
సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం 'హంట్' (Hunt) మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఇందులో సుధీర్ బాబు మెమరీ లాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్, భరత్ కీలక పాత్రల్లో నటించారు. బుధవారం విడుదలైన ట్రైలర్ చూస్తే.. తప్పకుండా ఆశ్చర్యపోతారు. సుధీర్ బాబు అదిరిపోయే స్టంట్స్‌తో ఆకట్టుకున్నాడు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. అర్జున్ అనే పోలీస్ అధికారి ఓ ప్రమాదంలో గతాన్ని మరిచిపోతాడు. దీంతో అతడు పూర్తి చేయాల్సిన ఓ ముఖ్యమైన కేసు విచారణ మధ్యలోనే ఆగిపోతుంది. దాని గురించి పూర్తి సమాచారం తెలిసింది కేవలం అర్జున్ మాత్రమే. ఈ నేపథ్యంలో అర్జున్ ఉన్నతాధికారి (శ్రీకాంత్).. ఆ కేసును నువ్వు మాత్రమే పూర్తి చేయగలవ్ అని అర్జున్‌కు చెబుతాడు. ‘‘ఆ అర్జున్ పూర్తి చేయలేకపోయిన ఆ కేసును.. ఈ అర్జున్(మెమరీ లాస్ తర్వాత) పూర్తి చేయాలి. ఇది హై ప్రొఫైల్ మర్డర్ కేస్. ఒక అసిస్టెంట్ కమిషనర్‌ను పట్టపగలు స్నిప్పర్ గన్‌తో హత్య చేశారు. చనిపోయిన ఆర్యన్ దేవ్ మనకు మంచి స్నేహితుడు’’ అని టాస్క్ ఇస్తాడు. కేసు డైరీలో ఉన్న వ్యక్తుల అతడికి గుర్తులేకపోయినా అర్జున్ ఆ కేసు మూలాలను కనుగొనే ప్రయత్నంలో పడతాడు. ఈ సందర్భంగా అతడికి ఎదురైన సవాళ్లు ఏమిటీ? అతడు పూర్తిగా మరిచిపోయిన కేసులో కీలక ఆధారాలను మళ్లీ ఎలా సంపాదిస్తాడు వంటి అంశాలను ట్రైలర్‌లో చూపించారు. చెప్పాలంటే.. ట్రైలర్ పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. హీరో ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేసిన ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి.
స్టంట్స్ అదుర్స్..
మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన చాలా సినిమాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ 'హంట్'లో స్టంట్స్ కంపోజ్ చేశారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ సూపర్ డూపర్ హిట్ హాలీవుడ్ సినిమా ఫ్రాంచైజీ 'జాన్ విక్'లో నాలుగో సినిమాకు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు 'హంట్' మూవీలో అవి హైలైట్ అవుతాయని దర్శక నిర్మాతలు ఇటీవల తెలిపారు. 'జాన్ విక్ 4'కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన 'పాపతో పైలం...' పాట యూట్యూబ్‌లో ట్రెండవ్వుతోంది. ఈ సాంగ్‌కు యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. జిబ్రాన్ సంగీతం అందించగా... మంగ్లీ, నకాష్ అజీజ్ ఆలపించారు.
Read Also: ఓ మై గాడ్ - ‘వాల్తేరు వీరయ్య’ కోసం చిరంజీవి, రవితేజ అంత రెమ్యునరేషన్ తీసుకున్నారా?
సుధీర్ బాబు, శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ పోలీస్ అధికారులుగా నటిస్తున్న ఈ సినిమాలో 'మైమ్' గోపి, 'జిల్' ఫేమ్ కబీర్ దుహాన్ సింగ్, మౌనిక రెడ్డి, 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఫేమ్ గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, సత్య కృష్ణన్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి కళ : వివేక్ అన్నామలై, యాక్షన్ : రేనౌడ్ ఫవేరో (యూరప్), స్టంట్స్ : వింగ్ చున్ అంజి, కూర్పు : ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం : అరుల్ విన్సెంట్, సంగీతం : జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం : మహేష్.