Pakka Commercial: 'పక్కా కమర్షియల్' సినిమాలో 'అందాల రాశీ' పాట విన్నారా?
‘పక్కా కమర్షియల్’ అందాల రాశీ పాటకు అనూహ్య స్పందన వస్తోంది.
![Pakka Commercial: 'పక్కా కమర్షియల్' సినిమాలో 'అందాల రాశీ' పాట విన్నారా? Huge Response for Andala Raashi Song in Pakka Commercial Movie Pakka Commercial: 'పక్కా కమర్షియల్' సినిమాలో 'అందాల రాశీ' పాట విన్నారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/01/2a67d4f742442055c1a69eedf24f1d11_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మారుతి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు యాక్షన్, కమర్షియల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయట. సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : రవీందర్, సహ నిర్మాత : ఎస్.కె.ఎన్, లైన్ ప్రొడ్యూసర్ : బాబు, ఎడిటింగ్ : ఎన్.పి. ఉద్భవ్, సినిమాటోగ్రఫీ : కరమ్ చావ్ల , సంగీత దర్శకుడు: జేక్స్ బిజాయ్.
View this post on Instagram
పాట లిరిక్స్
అందాల రాశీ మేకప్ వేసి.. నా కోసం వచ్చావే..
స్వర్గంలో కేసే నా మీద వేసి.. భూమ్మీద మూసావే..
నరనావకీలా పని నేర్పుతారా.. నను చేర్చుకోరా రెడీగా ఉన్నా రా..
ఫీ వద్దులేరా.. ఫేమస్సు కారా.. ఇక నా సేవ చేసేసుకో..
ఆగేటట్టుందే.. నా గుండె హిప్సే చూస్తుంటే..
ఏదీ గుర్తుకురాదే పాప పక్కన నువ్వుంటే.. (2)
అందాల రాశీ మేకప్ వేసి.. నా కోసం వచ్చావే..
బుల్లితెర నేనే.. బిగ్ స్టారును నేనే..
తెలుగిళ్లలోనే ప్రతి ఒక్కరు ఫ్యానే..
అన్నీ వదిలి వచ్చేసాను పోస్టే ఇచ్చుకో..
మోమాటాలు ఏవీ లేక ఫాలో చేసుకో..
మా బాగుందే నీ పేరు సూపర్ కుదిరిందే..
బ్లాక్ అండ్ వైట్ హాలుకు మొత్తం కలరింగ్ వచ్చిందే..
నా కండీషన్స్ అన్నీ నీకిష్టమైతే ఇక వచ్చేయ్ లేటెందుకే..
కాంబో కుదిరిందే.. మనిద్దరి కాంబో కుదిరిందే..
ఎండే లేని సీరియళ్లా వందేళ్లుండాలే.. (2)
అందాల రాశీ మేకప్ వేసి.. నా కోసం వచ్చావే..
స్వర్గంలో కేసే నా మీద వేసి.. భూమ్మీద మూసావే..
ఆగేటట్టుందే.. నా గుండె హిప్సే చూస్తుంటే..
ఏదీ గుర్తుకురాదే పాప పక్కన నువ్వుంటే.. (2)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)