News
News
వీడియోలు ఆటలు
X

WAR 2 Update: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్ 2’ నుంచి కీలక అప్‌డేట్ - షూటింగ్‌కు సర్వం సిద్ధం

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కబోతున్న చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

FOLLOW US: 
Share:

‘RRR’ సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్ వరుసబెట్టి పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండూ పాన్ ఇండియన్ సినిమాలుగానే తెరకెక్కుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘వార్2’లో నటించేందుకు ఓకే చెప్పారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరో కాగా, ఎన్టీఆర్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు.  

వార్ 2’ నుంచి కీలక అప్ డేట్

‘వార్ 2’ గురించి యష్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటన చేసింది.  స్పై యూనివర్స్ చిత్రంలోకి జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తుండగా, నెగెటివ్ రోల్ లో ఎన్టీఆర్ కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. సినిమా షూటింగ్ ప్రారంభం ముహూర్తం సైతం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించాలని ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

అప్పుడు సిద్దార్థ్ ఆనంద్, ఇప్పుడు అయాన్ ముఖర్జీ

అటు 'వార్' సినిమాలో లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు. సినిమాలో ఇద్దరి మధ్య భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. ఇద్దరూ పోటా పోటీగా నటించారు. చివరకు, టైగర్ ష్రాఫ్ క్యారెక్టర్ మరణించినట్టు చూపించారు.   ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. 'వార్' సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అయితే, 'వార్ 2'కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రశాంత్ నీల్ మూవీ కంటే ముందే ‘వార్ 2’ షూటింగ్!

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నారు. హీరోగా ఆయన 30వ చిత్రమిది. దీని తర్వాత 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారు. ప్రభాస్ హీరోగా నీల్ చేస్తున్న 'సలార్' కంప్లీట్ అయ్యాక,  ఎన్టీఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే, దాని కంటే ముందు 'వార్ 2' షూటింగ్ స్టార్ట్ చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే ఈ ఏడాది నవంబర్‌లో 'వార్ 2'ను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని హృతిక్ రోషన్, ఎన్టీఆర్,  యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా భావిస్తున్నారట.   

View this post on Instagram
 
A post shared by Jr NTR (@jrntr)

Read Also: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్, రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Published at : 12 Apr 2023 04:24 PM (IST) Tags: Jr NTR Hrithik Roshan War 2 shooting

సంబంధిత కథనాలు

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

టాప్ స్టోరీస్

CPI Narayana : సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

CPI Narayana :   సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి

Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి