Vidya Balan Birthday: 43వ వసంతంలోకి విద్యా బాలన్, 10 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..
హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణి విద్యా బాలన్. ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ అమ్మడు గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
సెల్యులాయిడ్ లో పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ కు కేరాఫ్ అడ్రస్ విద్యా బాలన్. పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోయిన నటించడంలో తనకు తానే సాటి. ఇవాళ ఈ నటీమణి 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అద్భుత నటనతో జాతీయ అవార్డును గెలుచుకున్న విద్యా బాలన్, భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్, కుటుంబ సభ్యులతో కలిసి ప్రైవేటుగా పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనుంది. ఈ సందర్భంగా తనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
1.ముంబైకి చెందిన తమిళ బ్రాహ్మణ అమ్మాయి
విద్యాబాలన్.. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో మూలాలున్న ముంబైకి చెందిన తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. P.R. బాలన్, సరస్వతి దంపతులకు రెండో కుమార్తె. విద్యకు ప్రియా బాలన్ అనే అక్క ఉంది. విద్య ఇంట్లో తమిళం, మలయాళం మిక్స్ గా మాట్లాడేవారు. నటి ప్రియమణికి సెకెండ్ కజిన్ అవుతుంది.
2.బాల్యం నుంచి నటనపై ఆసక్తి
విద్యా బాలన్ కు చిన్నప్పటి నుంచి నటన పట్ల మక్కువ ఎక్కువ. షబానా అజ్మీ, శ్రీదేవి, మాధురీ దీక్షిత్ లాంటి నటీమణుల సినిమాలను చూస్తూ పెరిగారు. చిన్నప్పటి నుంచే సినిమాల్లోకి రావాలని భావించారు.
3.యాక్షన్ డెబ్యూ- టెలివిజన్ కెరీర్
16 సంవత్సరాల వయస్సులో ఏక్తా కపూర్ ప్రసిద్ధ షో ‘హమ్ పాంచ్’తో తన నటనను ప్రారంభించారు. ఈ షోలో విద్యా బాలన్ రాధిక అనే క్యారెక్టర్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ టీవీ షోలు చేయడం మానేశారు.
4.కలిసిరాని మలయాళ చిత్రపరిశ్రమ
ముంబై వర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని చదువుతున్న రోజుల్లో విద్యాబాలన్ కు ‘చక్రం’ అనే సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నారు. లోహిత దాస్ దర్శకత్వంలో మొదటి షెడ్యూల్ షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. ఈ సమయంలో ఆమె డజనుకు పైగా చిత్రాలకు సంతకం చేశారు. అయితే, ప్రొడక్షన్ సమస్యల కారణంగా ‘చక్రం’ మొదటి షెడ్యూల్ తర్వాత ఆగిపోయింది. ఆమె మలయాళంలో పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్ట్ ‘కలరి విక్రమన్’. అది కూడా విడుదల కాలేదు. మలయాళం చిత్రపరిశ్రమలో విద్యాబాలన్ కు 'అన్ లక్కీ హీరోయిన్'గా ముద్ర పడింది.
5.తమిళ సినిమాతో సక్సెస్
ఆ తర్వాత విద్యా బాలన్ కోలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. R మాధవన్ ‘రన్’తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అనంతరం ‘మనస్సెల్లామ్’లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. అయితే, ఆమె పాత్రకు సరిపోవడం లేదని భావించిన మేకర్స్ తన స్థానంలో త్రిషను తీసుకున్నారు.
6.యాడ్ ఫిల్మ్స్ తో గుర్తింపు
విద్యాబాలన్ సౌత్ ఫిల్మ్ కెరీర్ లో సక్సెస్ కాలేకపోయినా, యాడ్ ఫిల్మ్స్ తో సక్సెస్ అయ్యారు. సినిమాల్లో పెద్ద బ్రేక్ దక్కక ముందు సుమారు 60 యాడ్స్ చేశారు. యాడ్ ఫిల్మ్స్ కోసం సీనియర్ ఫిల్మ్ మేకర్ ప్రదీప్ సర్కార్‌తో కలిసి పని చేశారు. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లోకి రావడానికి తను చాలా సహకరించారు.
7.’పరిణీత’లో బాలీవుడ్ లోకి అడుగు
దర్శకుడు ప్రదీప్ సర్కార్ రికమండేషన్ తో విద్యా బాలన్ ‘భలో థేకోతో’ బెంగాలీ సినిమా చేశారు. అదే సమయంలో బాలీవుడ్ మూవీ ‘పరిణీత’ కోసం ఆడిషన్ ఇచ్చారు. పలు స్క్రీన్ టెస్టుల తర్వాత ఎంపికయ్యారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
8.ఆమె నటనపై తీవ్ర విమర్శలు
అద్భుత నటిగా పేరు తెచ్చుకున్న విద్యా బాలన్ ‘కిస్మత్ కనెక్షన్‘, ‘హే బేబీ‘ వంటి చిత్రాలలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తను నమ్మిన పాత్రలనే చేయాలని విద్యా బాలన్ భావించారు.
9.మలయాళంలో మరోసారి ఫెయిల్యూర్
సీనియర్ దర్శకుడు కమల్ హెల్మ్ చేసిన బయోపిక్‌లో లెజెండరీ రచయిత మాధవి కుట్టి అకా కమల్ సురైయా పాత్రను చేసేందుకు విద్యా బాలన్ ఓకే చెప్పారు. ఈ బయోపిక్ తో మళ్లీ మలయాళ సినిమా పరిశ్రమలోకి రావాలని భావించారు. కొన్ని కారణాలతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో దర్శకుడు ఆమెను 'అన్ ప్రొఫెషనల్' యాక్టర్ గా అభివర్ణించారు.
10.విద్య డ్రీమ్ రోల్
‘మిస్టర్ ఇండియా‘లో శ్రీదేవి నటించినట్లే, తన సినిమాలో కనీసం ఒక సన్నివేశంలో అయినా ప్రముఖ హాస్య నటుడు చార్లీ చాప్లిన్ పాత్రను పోషించాలని కోరుకుంటున్నట్లు విద్యాబాలన్ చాలా సార్లు చెప్పారు.
Read Also: తునీషా శర్మ సూసైడ్ టు రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్, 2022లో టాప్ 10 కాంట్రవర్సీలు ఇవే!