అన్వేషించండి

Hansika Mothwani : కొత్త ఇంటిని కొన్న హన్సిక.. భర్తతో కలిసి గృహ ప్రవేశం - పిక్స్ వైరల్ 

Hansika Motwani : సౌత్ హీరోయిన్ హన్సిక కొత్త ఇంటికి సంబంధించిన గృహ ప్రవేశం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఆమె తన భర్తతో కలిసి పూజలు చేస్తూ కన్పించింది.

Hansika Motwani New House : సౌత్ లో స్టార్ హన్సిక తాజాగా కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. తాజాగా ఆ ఇంట్లోకి తన భర్తతో కలిసి అడుగు పెడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హన్సిక కొత్త ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

హన్సిక గృహ ప్రవేశం 

దక్షిణాది చిత్రాలతో సహా కొన్ని హిందీ చిత్రాలలో నటించి తనకంటూ ఇండస్ట్రిలో నటిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది హన్సిక. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ 'కోయి మిల్ గయా'లో బాలనటిగా నటించి టాలీవుడ్‌, కోలీవుడ్ లో స్టార్‌గా ఎదిగింది. టాలీవుడ్ లో 'దేశముదురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హన్సిక. ఇందులో అల్లు అర్జున్ తో ఆమె ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు మూవీ లవర్స్ ఫిదా అయ్యారు. అయితే ఆ తరువాత 'దేశముదురు' రేంజ్ హిట్ దక్కలేదు. అడపా దడపా అవకాశాలు వచ్చినా అవి యావరేజ్ లేదా డిజాస్టర్ టాక్ ను తెచ్చుకున్నాయి.

కోలీవుడ్ లో మాత్రం తన హవాను బాగానే చూపించింది. పెళ్లి తరువాత లేడి ఓరియంటెడ్ సినిమాలకు పరిమితం అయిన హన్సిక తాజాగా కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేయడం విశేషం. ఇక నటిగా ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న హన్సిక మోత్వాని కొత్తగా  నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. హన్సిక 2022 డిసెంబర్ 4న సోహైల్ కతురియాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్ళయిన రెండేళ్ల తరువాత ఈ జంట కొత్త ఇల్లు కొన్నారు. హన్సిక తన కొత్త గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలను అభిమనులతో పంచుకుంది.

హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భర్త సోహైల్ కతురియాతో తమ ఆచారాల పద్ధతుల్లో పూజ చేస్తున్న చిత్రాలను పంచుకుంది. ఈ ప్రత్యేక సందర్భంలో హన్సిక ఆకుపచ్చ పట్టు చీరను ధరించింది. ఈ లుక్‌లో ఆమె చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆమె భర్త సోహైల్ కతురియా లేత ఆకుపచ్చ రంగు షేర్వాణీ ధరించాడు. కొన్ని రోజుల క్రితమే హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో BMW 6 సిరీస్ లగ్జరీ కారును కొన్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తానికి కొత్త కారు, కొత్త ఇల్లు కొన్న హన్సికకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hansika Motwani (@ihansika)

హన్సిక చివరి సినిమా ఇదే 

ఇదిలా ఉంటే బాలనటిగా టీవీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆమె 2000లో 'షక లక బూమ్ బూమ్'లో కనిపించింది. ఆ తర్వాత ఆమె ఏక్తా కపూర్ ప్రముఖ సీరియల్ 'సాస్ భీ కభీ బహు థీ'లో కనిపించింది. ఇక హీరోయిన్ గా మారాక భారీ సంఖ్యలో తెలుగు, తమిళ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. హన్సిక చివరిసారిగా 2024లో వచ్చిన హారర్ చిత్రం 'గార్డియన్'లో కనిపించింది. ఇప్పుడు ఆమె తదుపరి తమిళ చిత్రం 'రోదయా బేబీ'లో కనిపించనుంది. ఈ సినిమా నవంబర్ 2024లో విడుదల కానుంది. ఈ చిత్రానికి జెమ్ రాజా శర్వణన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Read Also : Radhika Apte: బేబీ బంప్‌తో షాక్ ఇచ్చిన 'లెజెండ్' హీరోయిన్ - త్వరలో తల్లి కానున్న రాధికా ఆప్టే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP News: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలి - వైఎస్‌ఆర్సీపీ వర్క్‌షాప్‌లో జగన్ కీలక వ్యాఖ్యలు
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలి - వైఎస్‌ఆర్సీపీ వర్క్‌షాప్‌లో జగన్ కీలక వ్యాఖ్యలు
IND Vs NZ: ఫాస్ట్ పిచ్‌పై బొక్కబోర్లా పడ్డ టీమిండియా - చరిత్రలో లోయెస్ట్ స్కోరు - ఐదుగురు డకౌట్!
ఫాస్ట్ పిచ్‌పై బొక్కబోర్లా పడ్డ టీమిండియా - చరిత్రలో లోయెస్ట్ స్కోరు - ఐదుగురు డకౌట్!
MAGIC Release Date: డిసెంబర్‌లో ‘మ్యాజిక్’ చేయనున్న గౌతం - ‘దేవర’ తర్వాత అనిరుధ్ తెలుగు సినిమా!
డిసెంబర్‌లో ‘మ్యాజిక్’ చేయనున్న గౌతం - ‘దేవర’ తర్వాత అనిరుధ్ తెలుగు సినిమా!
Best CNG Cars Under 10 Lakh: రూ.10 లక్షల్లోపు బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - మంచి మైలేజీతో సిటీల్లో బెస్ట్!
రూ.10 లక్షల్లోపు బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - మంచి మైలేజీతో సిటీల్లో బెస్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్తమిళ రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్, ఆ ట్వీట్‌ల అర్థమేంటి?Vizianagaram Pydithalli sirimanu utsavam | విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం ఎప్పుడైనా చూశారా.? | ABPNita Ambani on Ratan Tata | రతన్ టాటాపై నీతా అంబానీ కీలక వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP News: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలి - వైఎస్‌ఆర్సీపీ వర్క్‌షాప్‌లో జగన్ కీలక వ్యాఖ్యలు
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలి - వైఎస్‌ఆర్సీపీ వర్క్‌షాప్‌లో జగన్ కీలక వ్యాఖ్యలు
IND Vs NZ: ఫాస్ట్ పిచ్‌పై బొక్కబోర్లా పడ్డ టీమిండియా - చరిత్రలో లోయెస్ట్ స్కోరు - ఐదుగురు డకౌట్!
ఫాస్ట్ పిచ్‌పై బొక్కబోర్లా పడ్డ టీమిండియా - చరిత్రలో లోయెస్ట్ స్కోరు - ఐదుగురు డకౌట్!
MAGIC Release Date: డిసెంబర్‌లో ‘మ్యాజిక్’ చేయనున్న గౌతం - ‘దేవర’ తర్వాత అనిరుధ్ తెలుగు సినిమా!
డిసెంబర్‌లో ‘మ్యాజిక్’ చేయనున్న గౌతం - ‘దేవర’ తర్వాత అనిరుధ్ తెలుగు సినిమా!
Best CNG Cars Under 10 Lakh: రూ.10 లక్షల్లోపు బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - మంచి మైలేజీతో సిటీల్లో బెస్ట్!
రూ.10 లక్షల్లోపు బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - మంచి మైలేజీతో సిటీల్లో బెస్ట్!
Amazon Prime Video Ads: ఆడియన్స్‌పై అమెజాన్ బాంబు - ఇక ప్రైమ్ వీడియోలో యాడ్స్ - రాకుండా ఉండాలంటే?
ఆడియన్స్‌పై అమెజాన్ బాంబు - ఇక ప్రైమ్ వీడియోలో యాడ్స్ - రాకుండా ఉండాలంటే?
YSRCP News:  సైలెంట్‌గా పార్టీ ప్రక్షాళన చేస్తున్న జగన్- ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగింత- ప్రతిపాడులో వైసీపీకి టీడీపీ నేత హోప్
సైలెంట్‌గా పార్టీ ప్రక్షాళన చేస్తున్న జగన్- ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగింత- ప్రతిపాడులో వైసీపీకి టీడీపీ నేత హోప్
Amaravati News: మూడు విభాగాలుగా అమరావతి నిర్మాణం- సీఆర్‌డీఏ భవనంతోనే పనులు పునఃప్రారంభం 
మూడు విభాగాలుగా అమరావతి నిర్మాణం- సీఆర్‌డీఏ భవనంతోనే పనులు పునఃప్రారంభం 
Akkada Ammayi Ikkada Abbayi: హీరోగా నాలుగేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ టైటిల్‌తో ప్రదీప్ కొత్త సినిమా... రీ ఎంట్రీ ప్లాన్ అదుర్స్
హీరోగా నాలుగేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ టైటిల్‌తో ప్రదీప్ కొత్త సినిమా... రీ ఎంట్రీ ప్లాన్ అదుర్స్
Embed widget