అన్వేషించండి

Guppedantha Manasu Mirchi Madhavi: ''గుప్పెడంతమనసు'' సీరియల్ నుంచి దేవయాని ( మిర్చి మాధవి) ఔట్

Mirchi Madhavi: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇందులో మెయిన్ విలన్ గా నటిస్తోన్న దేవయాని ( మిర్చి మాధవి) సీరియల్ నుంచి తప్పుకుంటోందనే వార్త ఈసీరియల్ అభిమానులను నిరాశకు గురిచేసింది

Guppedantha Manasu Mirchi Madhavi: గుప్పెడంత మనసు సీరియల్ లో మెయిన్ లీడ్ అయిన రిషి(ముఖేష్ గౌడ), వసు (రక్షా గౌడ) ప్రేక్షకులకు ఎంతబాగా కనెక్ట్ అయ్యారో...మహేంద్ర, జగతి, దేవయాని, ధరణి , గౌతమ్, ఫణీంద్ర పాత్రలు కూడా బాగా మార్కులు సంపాదించుకున్నాయి. అయితే ఇప్పటికే గౌతమ్ గా నటించిన కిరణ్ కాంత్...బ్రహ్మముడి సీరియల్ తో బిజీ అయిపోయాడు. అంటే దాదాపుగా గుప్పెడంతమనసు నుంచి తప్పుకున్నట్టే.  ఇప్పుడు దేవయాని ( మిర్చి మాధవి) తప్పుకుంటోందట. గౌతమ్ అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ కాబట్టి పెద్దగా నష్టమేమీ లేదు కానీ దేవయాని పాత్ర అంటే సీరియల్ కి మెయిన్ విలన్. ఓ రకంగా చెప్పాలంటే సీరియల్ లో ఈమె కనిపించగానే కుట్రలకు కేరాఫ్ గా ఫిక్సైపోతారు ప్రేక్షకులు...కార్తీకదీపంలో మోనితను రియల్ గా కూడా విలన్ గా చూసినట్టే..గుప్పెడంతమనసు సీరియల్ లో దేవయానిని కూడా రియల్ విలన్ గానే చూస్తారు బుల్లితెర ఆడియన్స్. ఆమె ఏ రేంజ్ లో నటిస్తుందో ఇంతకన్నా చెప్పడానికేముంది. ఇప్పుడు ఆమె తప్పుకుంటోంది అనే విషయం తెలిసి సీరియల్ అభిమానులు అవాక్కవుతున్నారు.

Also Read: వసు గురించి ఈగో మాస్టర్ కి దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే, జగతితో కలసి బయలుదేరిన రిషి!

ఇంతకీ దేవయాని పాత్ర తీసేస్తే సీరియల్ కి శుభంకార్డే కదా అంటారేమో..కాదు కాదు..కేవలం మిర్చిమాధవి సీరియల్ నుంచి బయటకు వచ్చేస్తోంది అంతే..ఆ పాత్రలోకి మరొకరు రాబోతున్నారు. ఈ మాట నిజమే అనేందుకు ఆధారం ఏంటంటే  దేవయానికి ఆ సీరియల్ నటులు సెండాఫ్ చెప్పిన వీడియో, ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఆ మూవీ టీమ్ లో కొందరు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో మిస్ యూ అంటూ పోస్ట్ చేశారు. ఇంతకీ మాధవి ఎందుకు తప్పుకుంటోంది అంటే..  ఆమె యూకే‌కి వెళ్లిపోతోందట. అక్కడి నుంచి వచ్చి షూటింగ్ చేసే అవకాశం లేకపోవడంతో వెళ్లిపోతోంది. మాధవి ప్లేస్‌లో మరొక నటి రాబోతున్నారు. ప్రస్తుతానికి అయితే ఆమె చివరి ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

దేవయాని (మిర్చి మాధవి) సీరియల్ నుంచి తప్పుకోవడంతో ముఖేష్ గౌడ (రిషి) ఎమోషనల్ అయ్యాడు. పెద్దగా సీరియల్‌గా నటించినా.. నిజంగానే పెద్దమ్మ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ధరణి పాత్రలో నటించిన సీతామహాలక్ష్మి కూడా లవ్ యూ, మిస్ యూ అంటూ పోస్టులు పెట్టింది.  నెటిజన్లు కూడా మిస్ యూ దేవయాని మేడం అంటూ పోస్టులు పెడుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Seethamahalakshmi_pspk✊🏻🇮🇳 (@seethamahalakshmi_pspk)

ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘మిర్చి’లో నటించినప్పటి నుంచీ ఆమెకు ‘మిర్చి మాధవి’గా పేరొచ్చింది. ఆమెది గుంటూరు జిల్లా. 
 త్రిశూలం సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన మాధవి..కథలో రాజకుమారి, చిన్నారి, కంటే కూతుర్నే కనాలి సీరియల్స్  తో మంచి పేరు సంపాదించుకుంది. ఇక సినిమాల విషయానికి వస్తే మిర్చి, 100 % లవ్, శతమానం భవతి, గద్దలకొండ గణేష్ లో నటించింది. 

టాప్ హెడ్ లైన్స్

Sobhita Dhulipala: అక్కినేని ఫ్యాన్స్‌కు శోభిత షాక్... చైతూతో పెళ్ళయ్యాక బోల్డ్ ఫోటోషూట్
అక్కినేని ఫ్యాన్స్‌కు శోభిత షాక్... చైతూతో పెళ్ళయ్యాక బోల్డ్ ఫోటోషూట్
Ram Charan - Sara Arjun: రామ్ చరణ్ సరసన 'ధురంధర్' బ్యూటీ - నిర్మాత ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే?
రామ్ చరణ్ సరసన 'ధురంధర్' బ్యూటీ - నిర్మాత ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే?
Karthika Deepam 2 Serial Today October 13th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మిస్సింగ్..! తల్లిని నిలదీసిన సూరజ్! కార్తీక్‌ని కొట్టిన దశరథ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మిస్సింగ్..! తల్లిని నిలదీసిన సూరజ్! కార్తీక్‌ని కొట్టిన దశరథ్!
Nindu Noorella Saavasam Serial Today October 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: లోయలోకి పడబోయిన అమర్‌ - కాపాడిన భాగీ   
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: లోయలోకి పడబోయిన అమర్‌ - కాపాడిన భాగీ   

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Embed widget