News
News
X

Project K Update : ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె'లో ఆ కాళ్ళు, వేళ్ళ కథ ఏంటి? నాగ్ అశ్విన్ ఏం చేస్తున్నారు?

ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' సినిమాను  వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. మరి, ఈ సినిమా కథ ఏంటి? ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లు చూస్తే ఏం అనిపిస్తోంది. 

FOLLOW US: 
Share:

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ రూపొందుతున్న సినిమా 'ప్రాజెక్ట్ కె' (Project K). దాదాపుగా ఐదొందల కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా... దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న మూడో సినిమా. మొదటి రెండు స్థానాల్లో 'ఆర్ఆర్ఆర్', 'రోబో' ఉన్నాయి. మరి, ఆ స్థాయిలో 'ప్రాజెక్ట్ కె'లో నాగ్ అశ్విన్ ఏం చేస్తున్నారు? ఎలాంటి ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు ఈ అంశమే ఆసక్తి రేపుతోంది.
 
మహాశివరాత్రి సందర్భంగా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2024 సంక్రాంతిని ప్రభాస్ కోసం లాక్ చేసింది వైజయంతీ మూవీస్. జనవరి 12, 2024న సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో దీపికా పదుకోన్, దిశా పటానీ లాంటి బాలీవుడ్ స్టార్స్, అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ కనువిందు చేయనున్నారు.

ఇదంతా ఓ ఎత్తు... సినిమా డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఆ పోస్టర్ మరో ఎత్తు! ఎవరిదో ఓ అరచేయి భూమిపైన ఉంది. ఈ చేతికి సంబంధించిన బాడీ కనిపించడం లేదు. కానీ, ఆ చేయి చాలా చాలా పెద్దది. దాని ముందు ముగ్గురు మనుషులు గన్ తో నిలబడి ఉన్నారు. చాలా మిస్టీరియస్ గా ఉన్న ఈ పోస్టర్ ఏం చెబుతుందో అర్థం కావట్లేదు. కానీ, ఈ గన్స్ పట్టుకున్న మనుషులు ఓ రకమైన స్పేస్ సూట్స్ లాంటివి వేసుకున్నారు. వాళ్ల చేతుల్లో ఉన్న గన్స్ కూడా హై ఎండ్ టెక్నాలజీవి. ఇంకా చేయికి చుట్టూ చాలా పెద్ద పెద్ద మెషినరీ అంతా విరిగి పడిపోయి ఉంది. సో ఇదంతా ఆ చేయి తాలూకు భారీ ఆకారపు మనిషి చేసిన విధ్వంసం. మరి ఆ మనిషి ఎవరు..ఈ విధ్వంసం అంతా ఎందుకు. The World is Waiting అని క్యాప్షన్ పెట్టారు పోస్టర్ లో. అంటే ఈ స్పేస్ సూట్స్ లాంటివి వేసుకున్న మనుషులది ఏ గ్రహం. లేదా భారీ మనిషి వేరే గ్రహం నుంచి వచ్చిన వ్యక్తా. ప్రశ్నలు చాలా చాలానే ఉన్నాయి. ఇది కచ్చితంగా సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అనేది అర్థం అవుతోంది. 

అమితాబ్ బచ్చన్ పుట్టినరోజున కూడా
ఈ ఒక్క పోస్టరే కాదు 2022 అక్టోబర్ 11న అమితాబ్ బచ్చన్ బర్త్ డే సందర్భంగా లెజెండ్స్ ఆర్ ఇమ్మోర్టల్ అని ఓ చేతి పోస్టర్ రిలీజ్ చేశారు. అదే నెలలో అంటే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా హీరోస్ ఆర్ నాట్ బార్న్ దే రైజ్ అంటూ మరో చేతిని పోస్టర్ గా రిలీజ్ చేశారు. లేటెస్టుగా రిలీజైన పోస్టర్ లో ఉన్న బాడీ సూట్ లాంటివే ఆ చేతికి కూడా ఉన్నాయి. సో ప్రభాస్ కూడా ఈ గన్స్ పట్టుకున్న గ్రూప్ లో మనిషి అయి ఉండొచ్చు. 2023 జనవరి 5న దీపికా పదుకోన్ బర్త్ డే రోజు... హిప్పీ క్రాఫ్ ఫేస్ మీద డార్క్ షేడ్, దుమ్ముతో కప్పుకుపోయి ఉన్న దీపికా ఫోటోను రిలీజ్ చేశారు. ఇప్పుడీ భారీ చేతి పోస్టర్.

Also Read రామ్ చరణ్‌తో కాదు, కన్నడ హీరోతోనే కన్నడ దర్శకుడి నెక్స్ట్ సినిమా 

డిసెంబర్ 31, 2022న ఇయర్ ఎండ్ స్పెషల్ లా రీ ఇన్వెంటింగ్ ద వీల్ అని వైజయంతీ మూవీస్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. భారీగా కనిపిస్తున్న టైర్ అది. అంతకు ముందు తమ సినిమా కోసం భారీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈవీ వెహికల్స్ కావాలని నాగ్ అశ్విన్ పోస్ట్ చేస్తే..ఆనంద్ మహీంద్రా స్పందించారు. కచ్చితంగా హెల్ప్ చేస్తామని ఇలాంటి సినిమాలు, ప్రాజెక్ట్స్ అంటే తనకు చాలా ఇష్టమంటూ అభయం ఇచ్చారు ఆనంద్ మహీంద్రా. సో అఫీషియల్ గా ప్రాజెక్ట్ కే టెక్నాలజీ విషయంలో మహీంద్రా సపోర్ట్ తీసుకుంటోంది. 

Also Read : తారకరత్న వారసులు ఎంత మందికి తెలుసు? చిన్న కుమార్తె, కొడుకు గురించి...  

సో... నాగ్ అశ్విన్ చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. మహానటి హిట్ తర్వాత ఇన్నేళ్ల పాటు ప్రాజెక్ట్ K పైనే నాగ్ అశ్విన్ పనిచేస్తున్నారు. అది కూడా వైజయంతీ మూవీస్ తమ 50 ఏళ్ల సినీ నిర్మాణ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేస్తున్న సినిమా ప్రాజెక్ట్ K. సో విడుదలైన తర్వాత ఇది ఎన్ని సంచనాలను క్రియేట్ చేయనుందో చూడాలి. 

Published at : 19 Feb 2023 04:00 PM (IST) Tags: deepika padukone Prabhas Project K Movie Story Director Nag Ashwin

సంబంధిత కథనాలు

Chiranjeevi As Chief Guest : సినిమా ఇవ్వలేదు కానీ ఆశీసులు ఇస్తున్న చిరంజీవి

Chiranjeevi As Chief Guest : సినిమా ఇవ్వలేదు కానీ ఆశీసులు ఇస్తున్న చిరంజీవి

Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!

Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!

Naga Chaitanya New House : ఆ ఇంటిలో సమంత - కొత్త ఇంట్లో నాగ చైతన్య!

Naga Chaitanya New House : ఆ ఇంటిలో సమంత - కొత్త ఇంట్లో నాగ చైతన్య!

Weight Loss Diet: ఓట్స్ Vs గోధుమరవ్వ: వీటిలో ఏది తింటే త్వరగా బరువు తగ్గుతారు

Weight Loss Diet: ఓట్స్ Vs గోధుమరవ్వ: వీటిలో ఏది తింటే త్వరగా బరువు తగ్గుతారు

Prabhas Health : రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం ఫారిన్‌లో ప్రభాస్

Prabhas Health : రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం ఫారిన్‌లో ప్రభాస్

టాప్ స్టోరీస్

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు -  మళ్లీ ఎప్పుడంటే ?

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు