అన్వేషించండి

Prabhas : బాలీవుడ్ బడా స్టార్ కు ప్రభాస్ ఝలక్... అతనితో మల్టీస్టారర్ కు డార్లింగ్ నో చెప్పాడా?

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి నటించే ఆఫర్ ను రిజెక్ట్ చేశాడనే రూమర్ బీ టౌన్ లో చక్కర్లు కొడుతోంది,.

Prabhas: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలకు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు స్టార్ హీరోలు జోడీ కడితే స్క్రీన్ దద్దరిల్లడం ఖాయం అనడానికి నిదర్శనమే 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించడం, ఆటా పాటా దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ను ఉర్రూతలూగించాయి. కానీ ప్రస్తుతం నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా దూసుకెళ్తున్న ప్రభాస్ మాత్రం తన రూటే సపరేటు అన్నట్టుగా పయనిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక బడా మల్టీస్టారర్ ఆఫర్ ను తిరస్కరించాడు అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ ఆఫర్ ఇచ్చింది ఎవరు? ఏ స్టార్ హీరోతో కలిసి పని చేయడానికి ప్రభాస్ నో చెప్పాడు? అనే వివరాల్లోకి వెళ్తే...

'సలార్', 'కల్కి' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో డార్లింగ్ ప్రస్తుతం ఫుల్ జోష్ తో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు 'రాజా సాబ్' అనే హారర్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. రీసెంట్ గా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభాస్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయనని ఆఫర్ల వెల్లువ ముంచెత్తుతోంది. పలుగురు బడా డైరెక్టర్స్ తో పాటు స్టార్స్ కూడా ప్రభాస్ తో కలిసి సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగానే బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ప్రభాస్ తో కలిసి సినిమాని చేయడానికి ఆసక్తిని కనబరిచారు అంటూ ప్రస్తుతం ఓ వార్త బీ టౌన్ లో చక్కర్లు కొడుతోంది. కానీ ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో కలిసి నటించాల్సి ఉండగా, ప్రభాస్ మొహమాటం లేకుండా నో చెప్పాడనేది ఆ రూమర్ల సారాంశం. ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్, మల్టీస్టారర్ లకు బదులుగా సోలో ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మల్టీ స్టారర్ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతున్నప్పటికీ ప్రభాస్ సోలో రోల్స్ సో బెటర్ అన్నట్టుగా సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ కొంతమంది బాలీవుడ్ మూవీ లవర్స్ ఆయన సిద్ధార్థ్ ఆనంద్ సినిమాను రిజెక్ట్ చేశాడంటూ వస్తున్న వార్తలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే, డార్లింగ్ అభిమానులు మాత్రం మంచి పని చేశారంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గతంలో ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలకు బాలీవుడ్ లో థియేటర్లు దక్కలేదన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు మాత్రం ఆయన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి మా డార్లింగ్ కావలసి వచ్చాడా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్', డైరెక్టర్ హను రాఘవపూడి తో కలిసి 'ఫౌజీ' సినిమాను చేస్తున్నాడు. 2024 ఎండింగ్లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రావాల్సిన 'కల్కి 2' సినిమాలలో కూడా ప్రభాస్ నటించబోతున్నాడు.

Read Also : Bigg Boss 8 Telugu 8 Day 59: 3 టాస్క్ లు, 6 గొడవలు- లవ్ బర్డ్స్ మధ్య చిచ్చు పెట్టిన గౌతమ్- యష్మి గౌడ కోసం నిఖిల్ కంటతడి

టాప్ హెడ్ లైన్స్

Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget