అన్వేషించండి

Prabhas: బాలీవుడ్ హీరో నో చెబితే ప్రభాస్ 'ఎస్' అన్నారా? ఆ నెగిటివ్ షెడ్ రోల్ చేస్తారా? 

రెబల్ స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలే. ఇప్పుడున్నవి పూర్తి చేయడానికి మరో ఏడాదిన్నర లేదా రెండేళ్లు పట్టొచ్చు. ఆ తరువాత మరో సినిమా చేసేందుకు ఆయన ఎస్ చెప్పారని ఫిలింనగర్ టాక్.

డార్లింగ్స్... ఇప్పటి వరకు ప్రభాస్ (Prabhas) హీరోయిజం చూశారు. ఇప్పుడు రెబల్ స్టార్ విలనిజం చూడడానికి రెడీ అవ్వండి. ఒక నెగిటివ్ షేడ్ రోల్ చేయడానికి ఆయన ఎస్ అన్నారట. అయితే ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఎలా లేదన్నా ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు టైం పడుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏది? ఎవరితో సినిమా చేయడానికి ప్రభాస్ ఓకే అన్నారు? అనే వివరాల్లోకి వెళితే...

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రభాస్!
'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం అందుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma). ఆయనతో ఓ సినిమా చేయడానికి ప్రభాస్ ఓకే చెప్పారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఆ సినిమాలో ఆయనది నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ అని తెలిసింది. ఈ ఏడాది అయితే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు లేవు. కానీ ఈ సినిమా న్యూస్ రెబల్ స్టార్ అభిమానులు అందరికీ ఒక కిక్ ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

'బ్రహ్మ రాక్షస' చేయడానికి ప్రభాస్ ఓకే అన్నారా?
'హనుమాన్' సినిమా విడుదలైన తర్వాత ముచ్చట. ఆ సినిమా పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయడానికి బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh) ఓకే చెప్పారు. అతనితో కథ మీద కొంత చర్చ కూడా జరిగింది. ఆ చిత్రానికి 'బ్రహ్మ రాక్షస' (Brahma Rakshasa) అనే టైటిల్ ఖరారు చేశారు. అయితే ఏమైందో ఏమో? తమ తమ పరిస్థితులు వల్ల సినిమా చేయడం కుదరడం లేదని ప్రశాంత్ వర్మతో పాటు రణవీర్ సింగ్ ఒక నోట్ విడుదల చేశారు.

రణవీర్ సింగ్ 'నో' చెప్పిన సినిమాను ప్రభాస్ చేయాలని అనుకోవడం అటు బాలీవుడ్ వర్గాలలో, ఇటు టాలీవుడ్ సర్కిళ్లలో హాట్ టాపిక్ అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఆయనకు ఉన్న లైనప్ చూస్తే ఈ సినిమా 2026 లేదా 2027 లో గాని సెట్స్ మీదకు వెళ్లదేమో!?

Also Read: రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!


ప్రస్తుతం 'ది రాజా సాబ్' షూటింగ్ చేస్తున్నారు ప్రభాస్. ఆయన హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. అయితే అందులో ప్రభాస్ జాయిన్ కాలేదు త్వరలో జాయిన్ అవుతారు. ఈ రెండిటి తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అది వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ కానుంది. 'స్పిరిట్' కంప్లీట్ చేశాక 'సలార్ 2', 'కల్కి 2' సినిమాలు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభాస్ మీద ఉంది. ఇప్పుడు ఆయన చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి అయ్యాక ప్రశాంత్ వర్మ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.

మరోవైపు ప్రశాంత్ వర్మ కూడా బిజీగా ఉన్నారు. 'హనుమాన్' సీక్వెల్ 'జై హనుమాన్' తీస్తున్నారు. అది కాకుండా నటి సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు. ఆ సినిమాకు ఆయన దర్శకత్వం వహించాల్సి ఉంది. ఇది కాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కొన్ని చిత్రాలకు కథలు అందిస్తున్నారు. అది కూడా పూర్తి కావాలి. ఒకటి మాత్రం నిజం... ప్రభాస్ ప్రశాంత్ వర్మ కలయికల సినిమా భీభత్సమైన హైప్ తీసుకు వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Also Read: శ్రద్ధా కపూర్, సమంత కాదు... అల్లు అర్జున్ 'పుష్ప 2' ఐటమ్ సాంగ్ చేసేది ఈ అమ్మాయే!

టాప్ హెడ్ లైన్స్

Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget