Allu Arjun : పుష్పరాజ్‌తో ఫ్యామిలీ మ్యాన్ కలిస్తే?
Manoj Bajpayee To Act With Allu Arjun?: పుష్ప... పుష్పరాజ్ అంటే ప్రేక్షకులకు గుర్తు వచ్చే పేరు అల్లు అర్జున్. ఫ్యామిలీ మ్యాన్ అంటే మనోజ్ బాజ్‌పాయి! ఒకవేళ వీళ్ళిద్దరూ కలిస్తే...
![Allu Arjun : పుష్పరాజ్‌తో ఫ్యామిలీ మ్యాన్ కలిస్తే? Manoj Bajpayee to act with Allu Arjun in Pushpa sequel Pushpa 2 movie Allu Arjun : పుష్పరాజ్‌తో ఫ్యామిలీ మ్యాన్ కలిస్తే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/20/1f567c7082238adde3b58639e99c772d1658314834_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పుష్ప... పుష్పరాజ్... ఈ పేరు వింటే ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఆ తర్వాత 'తగ్గేదే లే...' అంటూ 'పుష్ప'లో ఆయన చూపించిన మేనరిజమ్ గుర్తుకు వస్తుంది. మరి, ఫ్యామిలీ మ్యాన్ అంటే... వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయి! 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ రెండు సీజన్స్‌తో ఆయన ఆకట్టుకున్నారు. ఒకవేళ పుష్పతో ఫ్యామిలీ మ్యాన్ కలిస్తే... ఈ కాంబినేషన్ కోసం సుకుమార్ ట్రై చేస్తున్నారని టాక్.
'పుష్ప 2' (Pushpa 2 Movie) త్వరలో స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌లో కనిపించిన నటీనటులతో పాటు కొంత మంది కొత్త ఆర్టిస్టులను రెండో పార్ట్ కోసం ఎంపిక చేస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఆల్రెడీ విజయ్ సేతుపతి పేరు వినబడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మనోజ్ బాజ్‌పాయి పేరు కూడా వినబడుతోంది. ఇటీవల ఆయన్ను సంప్రదించి సినిమా గురించి చెప్పారట. అయితే, దర్శక - నిర్మాతలు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
అల్లు అర్జున్ 'హ్యాపీ' సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మనోజ్ బాజ్‌పాయి కనిపించారు. ఇప్పుడు 'పుష్ప 2'లో ఆయన రోల్ ఎలా ఉండబోతోందో? వెయిట్ అండ్ సి!
రష్మికా మందన్నా కథానాయికగా... ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్న 'పుష్ప 2'ను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. త్వరలో మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు.
Also Read : నాని సినిమాలో లేడీ విలన్ - పవర్ఫుల్ క్యారెక్టర్ లో పూర్ణ
సినిమాలో భన్వర్ షింగ్ షెకావత్ పాత్రలో నటించిన ఫహాద్ ఫాజిల్, 'పుష్ప 3' కూడా ఉంటుందని లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. సో... అందులో ఇంకెంత మంది ఉంటారో చూడాలి.
Also Read : 'ఆర్ఆర్ఆర్'లో పులితో ఎన్టీఆర్ ఫైట్ - వీఎఫ్ఎక్స్‌కు ముందు, తర్వాత
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)