SSMB29: మహేష్ బాబుకు జోడీగా గ్లోబల్ బ్యూటీ... 'ఎస్ఎస్ఎంబి 29' కోసం జక్కన్న మైండ్ బ్లోయింగ్ ప్లాన్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో 'ఎస్ఎస్ఎంబి 25' తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ కోసం మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్ నడుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా 'ఎస్ఎస్ఎంబి 29' కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించబోయే నటీనటులు ఎవరు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ముఖ్యంగా హీరోయిన్ ఎవరు అన్న విషయంపై ఉత్కంఠత కొనసాగుతోంది. నిజానికి ఒక్క మహేష్ బాబు తప్ప, ఈ సినిమాలో నటించే మెయిన్ లీడ్స్ గురించి ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు జక్కన్న. ఈ నేపథ్యంలోనే తాజాగా 'ఎస్ఎస్ఎంబి 29' సినిమాలో హీరోయిన్ అంటూ పలు అంతర్జాతీయ నటీమణుల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 'ఎస్ఎస్ఎంబి 29' సినిమాలో భాగం కాబోతోందని వార్తలు బయలు దేరాయి.
'ఎస్ఎస్ఎంబి 25'లో గ్లోబల్ బ్యూటీ
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న 'ఎస్ఎస్ఎంబి 29' సినిమా 2025 జనవరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్టులలో ఒకటి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా 900 నుంచి 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితం అవుతుందని అంచనా. జక్కన్న తలపెట్టిన ఈ ప్రాజెక్ట్ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ ఫిలింగా తెరకెక్కుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి తండ్రి సినిమా కథను డెవలప్ చేయడానికి తమకు ఏకంగా రెండేళ్లు పట్టిందని చెప్పి పెంచేశారు. అంతేకాకుండా ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుందని వెల్లడించారు. ఇక ఈ మాగ్నమ్ ఓపస్ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కాబోతోందని అంటున్నారు. ఇందులో మహేష్ బాబు పాత్ర హనుమంతుడి పాత్రను బేస్ చేసుకుని ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక కొనసాగుతోంది.
Also Read: ప్రేమ ఎక్కడ పుట్టింది? పెళ్లి ప్రపోజల్ ఎక్కడ? ఫస్ట్ టైమ్ ఓపెన్‌గా చెప్పిన శోభిత - నాగ చైతన్య
ఇందులో అంతర్జాతీయ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తారని రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా 'ఎస్ఎస్ఎంబి 29' సినిమాలో ఓ పాత్ర కోసం ప్రియాంక చోప్రాతో చిత్ర బృందం చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రా ఎలాంటి పాత్ర పోషిస్తుంది ? ఇంతకీ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అనేది తెలియాల్సి ఉంది.
మహేష్, ప్రియాంక నెక్స్ట్ మూవీస్ ఇవే
కాగా మహేష్ బాబు చివరిసారిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'గుంటూరు కారం' చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చిన 'ముఫాసా : ది లయన్ కింగ్' అనే హాలీవుడ్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. డిసెంబర్ 20న ఈ సినిమా తెరపైకి రాబోతోంది. మరోవైపు ప్రియాంక చోప్రా చివరిసారిగా 2023లో 'లవ్ ఎగైన్'లో లీడ్ రోల్ పోషించింది. ఇందులో సామ్ హ్యాగన్ తో కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు ప్రియాంక చోప్రా చేతిలో 'హెడ్స్ ఆఫ్ స్టేట్', 'ది బ్లఫ్' వంటి హాలీవుడ్ సినిమాలు ఉన్నాయి.
Also Read: బిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి