Jana Gana Mana Shelved : 'జన గణ మణ' పాడేసిన విజయ్ దేవరకొండ - పూరి
Jana Gana Mana Movie Shelved : 'లైగర్' రిజల్ట్ విజయ్ దేవరకొండ తదుపరి సినిమా 'జన గణ మణ' మీద భారీ ప్రభావం చూపించింది. ఇప్పుడు ఆ చిత్రాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
![Jana Gana Mana Shelved : 'జన గణ మణ' పాడేసిన విజయ్ దేవరకొండ - పూరి Jana Gana Mana Shelved Vijay Devarakonda Puri Jagannadh's JGM Telugu Movie Shelved - Reports Jana Gana Mana Shelved : 'జన గణ మణ' పాడేసిన విజయ్ దేవరకొండ - పూరి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/02/306869c153afa21d48d90bb71b81e35e1662117908440313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కు పాన్ ఇండియా లెవల్‌లో మార్కెట్ ఉంది. అందుకు, 'లైగర్'కు వచ్చిన ఓపెనింగ్ కలెక్షన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా విడుదలకు ముందు చాలా హైప్ నెలకొంది. అయితే, ఫలితం ఆ స్థాయిలో లేదు.
బాక్సాఫీస్ దగ్గర దారుణంగా 'లైగర్' బోల్తా కొట్టింది. సినిమాకు మొదటి రోజు తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్ బలంగా వినిపించింది. సినిమాలు ఫ్లాప్ కావడం కొత్త కాదు. కానీ, 'లైగర్' ఎందుకు ఫ్లాప్ అయ్యింది? అని విశ్లేషిస్తే... పూరి జగన్నాథ్ వైపు ఎక్కువ వేళ్ళు చూపించాయి. కథ, కథనాలు సరిగా రాసుకోలేదని చాలా మంది నుంచి విమర్శలు వినిపించాయి. 'లైగర్' కోసం విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ చేసినా... శారీరకంగా, మానసికంగా ఎంత కష్టపడినా... నత్తితో నటించే సన్నివేశాలు ఆయనకు అంతగా సూట్ కాలేదని కొందరు కామెంట్ చేశారు. 'లైగర్' పరాజయానికి కారణాలు ఏమైనా... ఆ ప్రభావం 'జన గణ మణ' మీద పడిందని, ఆ సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టేశారని ఫిల్మ్ నగర్ వర్గాల కథనం.
'లైగర్' విడుదలైన తర్వాత రోజు మీటింగ్!
'లైగర్' విడుదలైన తర్వాత రోజు 'జన గణ మణ' సినిమా (Jana Gana Mana Movie) యూనిట్ కోర్ టీమ్ మీటింగ్ జరిగింది. అయితే, ఆ రోజు తీవ్ర నిర్ణయాలు ఏవీ తీసుకోలేదు. సినిమాను పక్కన పెట్టేసేంత స్థాయిలో చర్చలు ఏమీ జరగలేదు. 'లైగర్' నెగిటివ్ టాక్ మీద మాత్రమే చర్చ జరిగిందట. అయితే... ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వారంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా 'లైగర్' అని ట్రేడ్ వర్గాలు తేల్చడం వంటివి 'జన గణ మణ'ను తాత్కాలికంగా పక్కన పెట్టాలనే నిర్ణయానికి కారణం అయ్యాయని తెలిసింది.
పూరితో మూడు చేయాలనుకున్నారు!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుసగా మూడు సినిమాలు చేయాలని విజయ్ దేవరకొండ అనుకున్నారు. 'లైగర్' విడుదలకు ముందు 'జన గణ మణ' స్టార్ట్ చేశారు. ఒక షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది కూడా! అయితే... 'లైగర్' ఫ్లాప్ కావడంతో మూడో సినిమా సంగతి పక్కన పెడితే, రెండో సినిమా 'జన గణ మణ' కూడా ఆపేశారు. పూరి దర్శకత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట.
Also Read : విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్ల హిట్టూ ఫ్లాపులు రాలేదు - దర్శక అభిమాని సూటి లేఖ
'జన గణ మణ' సెట్స్‌లో అడుగుపెట్టని విజయ్ దేవరకొండ
'జన గణ మణ' షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ముంబైలో ఓపెనింగ్ జరిగిన తర్వాత ఒక షెడ్యూల్ చేశారు. అందులో హీరోయిన్ పూజా హెగ్డే కూడా పాల్గొన్నారు. అయితే, అసలు ఇప్పటి వరకూ ఆ సినిమా సెట్స్‌లో విజయ్ దేవరకొండ అడుగు పెట్టలేదట. హీరో లేకుండా మిగతా తారాగణం మీద సన్నివేశాలు తీశారట. అందుకు సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యిందని టాక్. ఇప్పుడు ఆ ఖర్చును విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ చేరి సగం భరిస్తారట.
'జన గణ మణ' చిత్ర నిర్మాణ సంస్థ, 'మై హోమ్' గ్రూప్‌కు చెందిన శ్రీకర స్టూడియోస్‌కు ఈ సినిమా బదులు వేరే సినిమా చేస్తానని విజయ్ దేవరకొండ చెప్పారట. పూరి జగన్నాథ్ సైతం మరో సినిమా చేస్తానని అన్నారని ఇండస్ట్రీ గుసగుస.
Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)