By: ABP Desam | Updated at : 13 Jul 2022 03:28 PM (IST)
దిల్ రాజు, వాఘా రెడ్డి దంపతులు
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు అలియాస్ వి. వెంకట రమణా రెడ్డి ఇంట ఈ ఏడాది జూన్ నెలాఖరున వారసుడు అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఆయన రెండో భార్య పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చారు. లేటెస్ట్ టాక్ ఏంటంటే... ఆ అబ్బాయికి నామకరణం చేస్తున్నారట.
'దిల్' రాజు కుమారుడికి అన్వై రెడ్డి / అన్వయ్ రెడ్డి (Anvy Reddy - Son Of Dil Raju) అని పేరు పెడుతున్నారట. 'దిల్' రాజు మొదటి భార్య పేరు అనిత. రెండో భార్య పేరు తేజస్వి. అయితే... పెళ్లికి ముందు వాఘా రెడ్డి అని మార్చారు. ఇద్దరు పేర్లలో అక్షరాలు కలిసి వచ్చేలా అన్వై / అన్వయ్ అని పేరు పెట్టారని ఫిల్మ్ నగర్ వర్గాల కథనం.
కరోనా సమయంలో, రెండేళ్ల క్రితం... డిసెంబర్ 10, 2020లో 'దిల్' రాజు, వాఘా రెడ్డి (Vygha Reddy) వివాహం జరిగింది. నిజామాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుక నిర్వహించారు. వ్యక్తిగత విషయాల గురించి మీడియా ముందు 'దిల్' రాజు మాట్లాడటం తక్కువ. రెండో పెళ్లి, బిడ్డ పుట్టిన విషయం గురించి కూడా ఆయన మాట్లాడలేదు.
Also Read : బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్‌తో విజయ్ అనకొండ ఎఫైర్, అందుకే రష్మికకు ఛాన్సులు - కేఆర్కే సెన్సేషనల్ కామెంట్స్
తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'దిల్' రాజు 'వారిసు' (తమిళ టైటిల్) / 'వారసుడు' (తెలుగు టైటిల్) సినిమా చేస్తున్నారు. అది సెట్స్ మీద ఉండగా... 'దిల్' రాజు ఇంట వారసుడు అడుగు పెట్టడం విశేషం అని చాలా మంది అంటున్నారు. అబ్బాయి జన్మించిన సందర్భంగా పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు 'దిల్' రాజుకు శుభాకాంక్షలు చెప్పారు.
Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో లవ్‌పై రష్మిక షాకింగ్ రిప్లై, ఫ్యాన్స్ హర్ట్!
Vijay Devarakonda - Rashmika : విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి చేసుకుంటారా?
Controversial Issues: నెగిటివిటీతో పాపులారిటీ- బూతుపురాణమే ట్రెండ్, వివాదాలతో హిట్లు
Suchi Leaks: ‘వాళ్లు నాతో బలవంతంగా శృంగారం చేశారు’ - ఆ సింగర్ వ్యాఖ్యలపై స్పందించిన ధనుష్!
Vijay Devarakonda: రష్మికతో తనకున్న బంధం ఏంటో చెప్పేసిన విజయ్ దేవరకొండ!
BJP Politics: అటు ఈటల, ఇటు బండి - కరీంనగర్లో బీజేపీ వ్యూహం ఫలించేనా?
Raghavendra Rao: పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ అభిమానులపై రాఘవేంద్రరావు ఆగ్రహం
Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా
Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!