News
News
వీడియోలు ఆటలు
X

దేవరకొండ? బెల్లంకొండ? రష్మిక డేటింగ్‌పై బాలీవుడ్ కన్‌ఫ్యూజన్, క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ

నేషనల్ క్రష్ రష్మికతో డేటింగ్ పై వస్తోన్న రూమర్స్ ను హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొట్టిపారేశారు. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారని మండిపడ్డారు.

FOLLOW US: 
Share:

Rashmika Mandanna : గత కొన్ని రోజులుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డేటింగ్ లో ఉన్నారంటూ వస్తోన్న వార్తలపై ఎట్టకేలకు రిప్లై వచ్చింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రూమర్స్ కు బెల్లంకొండ ఫైనల్ గా స్పష్టత ఇచ్చారు. ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. అవన్నీ కేవలం రూమర్సేనని ఆయన కొట్టిపారేశారు.

నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా.. పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. గతేడాది సుకుమార్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న 'పుష్ప పార్ట్ 1'లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించిన రష్మిక.. పాన్ ఇండియా హీరోయిన్ గానూ ప్రసిద్ది గాంచారు. ఇంతకుముందు ఉన్న పేరు, ప్రఖ్యాతల కంటే.. ఈ సినిమా తర్వాత ఆమెకు వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక.. టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. 

అంతకుముందు వీరిద్దరూ తరచూ విమానాశ్రయంలో కలిసి కనిపించడం, కొన్ని పబ్లిక్ ఈవెంట్ లకు హాజరు కావడంతో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని, డేటింగ్ లో ఉన్నారంటూ అప్పటికే పుట్టుకొచ్చిన పలు వార్తలకు ఆజ్యం పోసినట్టయింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పలు వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై అటు రష్మిక గానీ, ఇటు బెల్లంకొండ గానీ ఇప్పటివరకూ స్పందించలేదు. ఆ ప్రచారం తప్పని ఖండించలేదు. దీంతో చాలా మంది ఈ వార్తలు నిజమేనని అనుకున్నారు.

తాజాగా రష్మికతో రిలేషన్ షిప్ పై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పందించారు. హిందీ రిమేక్ 'ఛత్రపతి' సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొంటున్న బెల్లంకొండ.. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా రష్మిక మందన్నతో డేటింగ్ పుకార్లలో నిజం ఉందా అన్న ప్రశ్నపై క్లారిటీ ఇచ్చారు. అసలు ఇలాంటి వార్తలను ఎలా పుట్టిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తామిద్దరూ ప్రేమలో ఉన్నట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. తానూ, రష్మిక మంచి స్నేహితులమని తేల్చి చెప్పారు. తామిద్దరం హైదరాబాద్‌కు చెందిన వాళ్లం కావడంతో షూటింగ్‌ పనుల మీద తరచూ ముంబయికి వెళ్తుంటామన్నామని తెలిపారు. అలా వెళ్లేటప్పుడు ఎయిర్‌పోర్టులో కలుసుకుంటామన్నారు. అలా అనుకోకుండా కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ అన్నారు. అంత మాత్రానికే ఇలాంటి వార్తలు రాసేస్తారా..? ఈ వార్తలన్నీ కేవలం రూమర్స్‌ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

అయితే, రష్మిక‌కు విజయ్ దేవరకొండకు మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందనే రూమర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ దేవరకొండకు బదులు.. బెల్లకొండ అని పొరపాటు పడి ఉండొచ్చని నెటిజన్స్ అంటున్నారు. అయితే, ‘లైగర్’ తర్వాత దేవరకొండ గురించి బాలీవుడ్‌కు స్పష్టత వచ్చిందని, కాబట్టి వారు పొరబడే ఛాన్సే ఉండకపోవచ్చని ఓ వర్గం అంటోంది.

2005లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఛత్రపతి' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు హిందీలో రీమేక్ గా వస్తోన్నఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా... బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమాలో నుష్రత్ భారుచ్చా హీరోయిన్ గా నటిస్తోంది. శరద్ కేల్కర్ , భాగ్యశ్రీ, ఫ్రెడ్డీ దారువాలా లాంటి తదితరులు నటించిన ఈ ఈ సినిమా... మే 12న విడుదల కానుంది.

Also Read: అన్నపై తమ్ముడి ఎఫెక్ట్ - 'కస్టడీ' బిజినెస్‌‌కు ‘ఏజెంట్’ గండం?

Published at : 04 May 2023 12:49 PM (IST) Tags: Rashmika Mandanna Chatrapathi entertainment news Bellamkonda Sreenivas Dating Roumers

సంబంధిత కథనాలు

Sai Dharam Tej - Manager Issue : సెట్‌లో గొడవ నిజమే - మేనేజర్‌ను మార్చేసిన సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej - Manager Issue : సెట్‌లో గొడవ నిజమే - మేనేజర్‌ను మార్చేసిన సాయి ధరమ్ తేజ్

కీర్తి సురేష్‌కు టాలీవుడ్ షాక్ - శ్రీలీలా ఎఫెక్ట్‌తో కోలీవుడ్‌కు జంప్!

కీర్తి సురేష్‌కు టాలీవుడ్ షాక్ - శ్రీలీలా ఎఫెక్ట్‌తో కోలీవుడ్‌కు జంప్!

NTR - Balakrishna : బాలకృష్ణకు ముందే చెప్పిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్

NTR - Balakrishna : బాలకృష్ణకు ముందే చెప్పిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్

Bholaa Shankar Pre Release : 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు 'ఇంద్ర' సెంటిమెంట్!?

Bholaa Shankar Pre Release : 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు 'ఇంద్ర' సెంటిమెంట్!?

Varshini - Washington Sundar : వర్షిణి ప్రేమలో సుందర్! - తన కంటే ఆరేళ్లు చిన్నోడితో డేటింగ్?

Varshini - Washington Sundar : వర్షిణి ప్రేమలో సుందర్! - తన కంటే ఆరేళ్లు చిన్నోడితో డేటింగ్?

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు