అన్వేషించండి

Akkineni Akhil : దసరాకు గుడ్ న్యూస్ లోడింగ్... అఖిల్ కొత్త సినిమా అప్డేట్ - ఫ్యాన్స్ గెట్ రెడీ

Akkineni Akhil : అక్కినేని అఖిల్ నుంచి సినిమా రాక చాలా కాలం అవుతోంది. ఆయన నెక్స్ట్ మూవీ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్న అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.

Akkineni Akhil New Movie : మన్మధుడు, కింగ్ అనే బిరుదులతో అక్కినేని నాగార్జున టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో ఎన్నటికీ చెరిగిపోని ముద్రను వేసుకున్నాడు. చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోలతో పోటీ ఉన్నప్పటికీ, ఆ పోటీని తట్టుకొని నిలబడటమే కాదు ఇండస్ట్రీలోని 4 మూల స్తంభాల్లో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి అని నిరూపించారు. దివంగత లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు వారసత్వాన్ని నిలబెట్టి, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఆయన వారసులు, ముఖ్యంగా అఖిల్ మాత్రం ఇంకా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తడబడుతూనే ఉన్నారు. 

నాగ చైతన్య ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా రేస్ లో దూసుకెళ్లాడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన 'తండేల్' అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా చుట్టూ ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. కానీ మరోవైపు ఆయన సోదరుడు, నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కెరీర్ మాత్రం డేంజర్ జోన్ లో ఉంది. ఆయన కెరీర్ ఏమైపోతుందోనని నాగార్జునతో పాటు అక్కినేని అభిమానులు కూడా తెగ టెన్షన్ పడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, చేతిలో ఒక భారీ నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ అఖిల్ కెరీర్ ఇంకా సెటిల్ కాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ హీరోకి హిట్ అనేది అందని ద్రాక్షగా మారింది.

ఇక అఖిల్ కెరీర్ పై 'ఏజెంట్' మూవీ కొట్టిన దెబ్బ మామూలుది కాదు. దీని నుంచి కోలుకోవడానికి అఖిల్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆయన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాడని టాక్ నడుస్తోంది. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది అంటూ రూమర్లు వినిపించినప్పటికీ, దాని గురించి అఫీషియల్ గా ఊసే లేదు. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనేది డౌట్ గానే మారింది. ఈ నేపథ్యంలోనే అఖిల్ ఒక కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, దానికి సంబంధించిన అప్డేట్ దసరాకు రాబోతుందని టాక్ నడుస్తోంది.

Read Also : Janaka Aithe Ganaka Trailer: స్టార్టింగ్ టు ఎండింగ్ నవ్వులే నవ్వులు... ‘జనక అయితే గనక’ రిలీజ్ ట్రైలర్‌ అదుర్స్ అంతే!

అఖిల్ రీసెంట్ గా ఓ కొత్త డైరెక్టర్ చెప్పిన కథకు ఫిదా అయ్యాడని, నాగార్జున కూడా కథ నచ్చడంతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వారసుడి సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. జనవరిలో ఈ సినిమా ప్రారంభమవుతుందని టాక్ నడుస్తుండగా, సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ దసరాకు రాబోతుందని ఫిలింనగర్ సర్కిల్స్ లో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న భారీ బడ్జెట్ సినిమాతో పాటు ఈ సినిమా షూటింగ్ లో కూడా ఒకేసారి పాల్గొనే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఇప్పటికే యూవీ క్రియేషన్స్ కు సంబంధించిన స్టోరీ రెడీగా ఉందని, ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అంటున్నారు. కానీ 'విశ్వంభర' మూవీ రిలీజ్ పూర్తయ్యేదాకా ఈ సినిమాను పట్టాలెక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అందుకే అంతలోపు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఆ కొత్త డైరెక్టర్ తో ఒక సినిమాను అఖిల్ మొదలుపెట్టబోతున్నాడని అంటున్నారు. ఆ తర్వాత యూవీ సినిమా స్టార్ట్ కానుందని సమాచారం. ఏదైతేనేం చాలా కాలం తర్వాత అక్కినేని అఖిల్ నుంచి మూవీ అప్డేట్ రాబోవుతుండడం ఆయన అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయం.

Read Also : Nayanthara: రెండేళ్ల తరువాత నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి నయనతార, విఘ్నేష్‌ల పెళ్లి... ఆ వివాదం కూడా - రన్ టైమ్ ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget