Ginna Movie Collections : విష్ణు మంచు 'జిన్నా' ఫస్ట్ డే కలెక్షన్స్ - మిగతా మూడు బెటర్
అమెరికాతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 'జిన్నా' వసూళ్లు మరీ తక్కువ ఉన్నాయి. ఈ సినిమా కంటే తమిళ డబ్బింగ్ సినిమాల కలెక్షన్స్ బావున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
బాక్సాఫీస్ పరంగా చూసుకుంటే విష్ణు మంచు (Vishnu Manchu) ఖాతాలో మరో ఫ్లాప్ చేరినట్టేనని తెలుగు సినిమా ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విష్ణు లేటెస్ట్ సినిమా 'జిన్నా' ఫస్ట్ డే కలెక్షన్స్ మరీ దారుణంగా ఉన్నాయనేది ట్రేడ్ టాక్. అమెరికాలో మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై ఆసక్తి చూపించలేదని వసూళ్లు చూస్తుంటే అర్థం అవుతోంది.
Ginna Movie Box Office Collection Day 1 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 'జిన్నా' చెప్పుకోదగ్గ థియేటర్లలో విడుదల అయ్యింది. కొన్ని ఏరియాల్లో పేరున్న థియేటర్లలో సినిమా ప్రదర్శించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్ దగ్గర విష్ణు మంచు భారీ కటౌట్ పెట్టారు. కలెక్షన్స్ మాత్రం భారీ స్థాయిలో రాలేదు. ఈ సినిమాకు ఏపీ, తెలంగాణలో మొదటి రోజు పది నుంచి పన్నెండు లక్షల రూపాయల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తెలుగు రాష్ట్రాలు మినహాయిస్తే అమెరికాలో రూ. 40 వేల షేర్ వచ్చిందట. ఆల్ ఓవర్ అమెరికాలో 50 షోస్ వేస్తే, శుక్రవారం అంతా 50 మంది మాత్రమే చూశారట. సో, ఐదు వందల డాలర్లు వచ్చాయని చెప్పారు. ఏ విధంగా చూసుకున్నా 'జిన్నా' ఫస్ట్ డే కలెక్షన్స్ 15 లక్షలకు మించదని చెబుతున్నారు.
'జిన్నా'తో పాటు వెంకటేష్ మోడ్రన్ దేవుడిగా, విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన 'ఓరి దేవుడా', కార్తీ 'సర్దార్', శివ కార్తికేయన్ హీరోగా 'జాతి రత్నాలు' దర్శకుడు అనుదీప్ కేవీ తీసిన 'ప్రిన్స్' సినిమాలు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒక్కో సినిమాకు అటు ఇటుగా కోటి రూపాయల షేర్ వచ్చిందట. విష్ణు మంచు సినిమా కంటే తమిళ హీరోల సినిమాలకు తెలుగు ఎక్కువ వసూళ్లు రావడం చర్చనీయాంశం అవుతోంది. అమెరికాలో కూడా 'జిన్నా' కంటే మిగతా సినిమాలకు ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చారు.
The opening day numbers of #Oridevuda , #Prince and #Sardar in the range of 1Cr in Telugu states. #Ginna is around 10L
— TrackTollywood (@TrackTwood) October 22, 2022
'జిన్నా' సినిమాలో ఇద్దరు గ్లామర్ హీరోయిన్స్ సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ ఉన్నారు. వాళ్ళను చూడటానికి కూడా ప్రేక్షకులు ఎవరూ థియేటర్లకు రాకపోవడం గమనించాల్సిన అంశం. సునీల్, 'వెన్నెల' కిశోర్, రఘుబాబు, అన్నపూర్ణమ్మ వంటి స్టార్ కమెడియన్స్, సీజనల్ ఆర్టిస్టులు సినిమాలో ఉన్నారు. ఎంత మంది ఉన్నా సరే థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో ఫెయిల్ అయ్యారు.
Also Read : ఓయో కంటే 'జిన్నా' థియేటర్లు బెస్ట్ - రెచ్చిపోతున్న ట్రోలర్స్, మీమర్స్
'జిన్నా'ను తొలుత విజయ దశమికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్', కింగ్ అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్', బెల్లకొండ గణేష్ బాబు హీరోగా పరిచయమైన 'స్వాతిముత్యం' సినిమాలు ఉండటంతో వాయిదా వేశారు. ఇప్పుడు కూడా అక్టోబర్ 21న మూడు సినిమాల మధ్య కాకుండా 14 లేదంటే 28వ తేదీల్లో విడుదల చేసి ఉంటే ఓపెనింగ్స్ బావుండేవని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు ఈ సినిమా కలెక్షన్స్, ఖాళీగా ఉన్న థియేటర్ బుకింగ్స్ చూపిస్తూ మీమర్స్, ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. విష్ణు మంచు, సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు.