గ్యాంగ్‌స్టర్ గంగరాజు మూవీ పోస్టర్‌పై వివాదం, పోలీసులను కించపరిచేలా ఉందంటూ ఫైర్
గ్యాంగ్‌స్టర్ గంగరాజు మూవీ పోస్టర్ వివాదాస్పదమవుతోంది. పోలీసులను కించపరిచేలా ఉందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

గ్యాంగ్‌స్టర్ గంగరాజు మూవీ పోస్టర్‌పై వివాదం, పోలీసులను కించపరిచేలా ఉందంటూ ఫైర్
గ్యాంగ్‌స్టర్ గంగరాజు మూవీ పోస్టర్ వివాదాస్పదమవుతోంది. యునిఫాంలో ఉన్న లేడీ పోలీస్‌ను హీరో ముద్దు పెడుతున్న పోస్టర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఆ యునిఫాంపై తెలంగాణ పోలీస్ అని రాసి ఉండటం వల్ల హైదరాబాదీలు రియాక్ట్ అవుతున్నారు. హైదరాబాద్ పోలీసులపై ఎంతో గౌరవం ఉందని, ఈ సినిమా పోస్టర్..వారి గౌరవానికి మచ్చ తెచ్చేలా ఉందంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో హైదరాబాద్ సిటీ పోలీస్, తెలంగాణ డీజీపీ, సైబరాబాద్ పోలీస్, రాచకొండ పోలీస్ ట్విటర్ ఐడీలను ట్యాగ్ చేశాడు. "ఇది ముమ్మాటికీ తప్పే" అంటూ మరికొందరు నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు.
Gangstar gangaraju movie. We respect hyd City police what is this sir. Please take action on movie director sir. Insulting police uniform sir @RachakondaCop @hydcitypolice @TelanganaDGP @cyberabadpolice pic.twitter.com/2byq0JHhcW
— JAGDEESH REDDY (@JAGDEESHREDDY1) June 24, 2022
చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. కన్న పీసీ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. హీరో లక్ష్, ఇప్పటికే వలయం చిత్రంలో నటించారు. ఇదే ఆయనకు మొదటి సినిమా. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ గంగరాజు సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు.
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















