Nayanthara Wedding Memes: ఫన్నీ మీమ్స్ - నయన్, విగ్నేష్ పెళ్లి, పాపం భట్టు తెగ ఫీలైపోతున్నాడు
నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇవి చూస్తే మీరు తప్పకుండా నవ్వేస్తారు.
నయనతార, విఘ్నేష్ శివన్‌లో గురువారం పెళ్లితో ఒక్కటయ్యారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న విఘ్నేష్ శివన్‌తో నయన్ ఏడు అడుగులు వేసి అర్ధాంగిగా మారింది. హిందూ సంప్రదాయం ప్రకారం నయన్ - విఘ్నేష్ పెళ్లి జరిగింది. తాళి కట్టిన తర్వాత నయనతార నుదుటిపై విఘ్నేష్ ముద్దు పెట్టారు. ఆ ఫోటో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. శనివారం చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. దీనికి సుమారు లక్ష మంది వస్తారని ఒక అంచనా.
‘షెరటాన్ హోటల్’ అనే రిసార్టులో గురువారం తెల్లవారుజామున 2.22 నిమిషాలకు నయన్, విఘ్నేష్‌ల పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు మాత్రమే హాజరవుతారని అనుకున్నారు, కానీ కొంత మంది టాప్ సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. కొన్ని ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు పరిశ్రమ నుంచి మాత్రం ఎవరూ వెళ్లినట్టు సమాచారం లేదు. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్‌తోపాటు డైరెక్టర్ అట్లీ, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అజిత్, విజయ్ సేతుపతి, కార్తీ, ఎస్ జె సూర్య హాజరయ్యారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూడా విచ్చేశారు.
నయన్ పెళ్లి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యం ‘అదుర్స్’ సినిమాలో నయన్‌ను ఎంతో ప్రేమించే బ్రహ్మానందం (భట్టు) ఫొటోలతో ఉన్న మీమ్స్ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ మీమ్స్ చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Also read: బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీపై రౌడీ షీటర్ దాడి
Also read: ఈ టీ షర్టు అంత ఖరీదా? కరీనా టేస్టు వరస్ట్ అంటూ నెటిజన్ల ట్రోలింగ్