అన్వేషించండి

Anurag Kashyap: ‘కాంతార’, ‘పుష్ప’ సినిమాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్

గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం పట్ల అనురాగ్ తన ధోరణిని వినిపిస్తూ వస్తున్నారు. దీనిపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

బాలీవుడ్ విలక్షణ దర్శకుల్లో అనురాగ్ కశ్యప్ ఒకరు. ఆయన అనుకున్న మాటను నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అలాగే ఒక్కోసారి తన వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకుంటారాయన. గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం పట్ల అనురాగ్ తన ధోరణిని వినిపిస్తూ వస్తున్నారు. దీనిపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఆయన మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మాటలు బాలీవుడ్ లోనే కాక దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. 

ఇటీవల ఓ సందర్భంలో ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోందన్నారు. బాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ పై మేకర్స్ దృష్టి పెడుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే బాలీవుడ్ ను నాశనం చేస్తోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవానికి బాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల ప్రస్తావన ఉండేది కాదని, అయితే ఇప్పుడిప్పుడే హిందీలో కూడా పాన్ ఇండియా సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ తనను తాను నాశనం చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. 

‘పుష్ప’, ‘కాంతార’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలు దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించవచ్చు, కానీ అలాంటి సినిమాలను బాలీవుడ్ లో కాపీ కొట్టి దాన్ని పాన్ ఇండియాగా తీయాలని ప్రయత్నిస్తే అది భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని అన్నారు. ఇప్పుడు బాలీవుడ్ కు కావాల్సింది పాన్ ఇండియా సినిమాలు కాదని, ఇండస్ట్రీ కి ధైర్యాన్నిచ్చే సినిమాలపై దర్శక నిర్మాతలు దృష్టి పెట్టాలని హితవు పలికారు.

అలాగే కశ్యప్ మరాఠీలో వచ్చిన ‘సైరత్’ సినిమా గురించి మాట్లాడుతూ.. మరాఠీలో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయిన సినిమా ‘సైరత్’ అని అన్నారు. కానీ వాస్తవానికి ఆ సినిమా మరాఠీ ఇండస్ట్రీని నాశనం చేస్తుందన్నారు. ఇదే విషయంపై ఆ సినిమా దర్శకుడితో తాను మాట్లాడానని చెప్పుకొచ్చారు. ఎందుకంటే అంత తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అందరూ ఆ సినిమాను అనుసరిస్తున్నారని.. కొత్త కథలను తీసుకురావడవం లేదని అన్నారు. దీని ప్రభావం మొత్తం ఇండస్ట్రీ పై పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బాక్స్ ఆఫీస్ వసూళ్లను దృష్టిలో పెట్టుకొని తమ పంథాను మార్చుకొని సినిమాలు చేస్తే అది ఏ ఇండస్ట్రీకైనా నష్టమే అని అన్నారు. 

అయితే వాస్తవానికి ‘కాంతార’ లాంటి సినిమాలు పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకొని తీయలేదు. కన్నడలో ఆ సినిమాకు విశేష స్పందన రావడంతో తర్వాత పాన్ ఇండియా లెవల్ లో ఆ చిత్రాన్ని విడుదల చేశారు. అలాగే బాలీవుడ్ లో ఈ యేడాది వచ్చిన ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ’ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయగా ఆ సినిమా మంచి వసూళ్లను సాధించింది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ యేడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా జాబితాలోకెక్కింది. దీనిబట్టి చూస్తే సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు తప్ప.. లోకల్, పాన్ ఇండియా అని ఉండదని కొంతమంది సినీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక అనురాగ్ కశ్యప్ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘దొబాారా’ సినిమా ఈ యేడాది విడుదలైంది. ఈ సినిమా బాలీవుడ్ లో డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత వ్యాపార వేత్త విజయ్ మాల్యా జీవితం ఆధారంగా ‘ఫైల్ నెం 323’ సినిమాను వచ్చే ఏడాది పట్టాలెక్కించనున్నారు అనురాగ్.

 Read Also: ఆ షర్ట్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ - వైసీపీకి కౌంటర్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
Allu Arjun: అల్లు అర్జున్‌కు భారీ ఊరట- నంద్యాల కేసు కొట్టేసిన హైకోర్టు 
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
RRB: ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
Caste Census : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Embed widget