By: ABP Desam | Updated at : 06 Mar 2023 03:14 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Venkatesh Maha/Instagram
సినిమా ఇండస్ట్రీలో విభేదాలు సహజంగా వస్తూనే ఉంటాయి. ఒక దర్శకుడు తీసిన సినిమాలపై మరొక దర్శకుడు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి కొంత మంది మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. తాజాగా దర్శకుడు వెంకటేష్ మహా అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చకున్నారు వెంకటేష్. లైఫ్ యాంథాలజీ గా వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత సత్యదేవ్ హీరోగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ వంటి డిఫరెంట్ జోనర్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇటీవల ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘కేజీఎఫ్ 2’ సినిమా అందులో హీరో యష్ పాత్రపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అటు సోషల్ మీడియాలోనూ ఆయనపై ట్రోల్స్ వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇటీవల దర్శకుడు వెంకటేష్ మహా ఒక యూట్యూబ్ ఛానల్ లోని ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయనతో పాటు దర్శకులు నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. ఇండియన్ బ్లాక్ బ్లస్టర్ సినిమా ‘కేజీఎఫ్’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమలాంటి దర్శకులు తమ అభ్యుదయ భావాలను పక్కనపెట్టి సినిమాలు చేస్తే అంతకంటే గొప్ప సినిమాలు తీయగలం అని అన్నారు. కానీ, తాము అలాంటి సినిమాలు చేయడం లేదని, విలువలతో కూడిన సినిమాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాంటి సినిమాలను కూడా డిగ్రేడ్ చేస్తున్నారని, అవి ఓటీటీ సినిమాలు అని అంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇండైరెక్టుగా ‘కేజీఎఫ్ 2’ సినిమాను కోడ్ చేస్తూ ఒక సినిమా ఉంది. అందులో హీరో తల్లి కొడుకుని గొప్ప వాడు అవ్వాలని చెబుతుందని, మళ్లీ ఆ కొడుకు తల్లికు బంగారం తెస్తానని మాట ఇస్తాడు. అందుకోసం బంగారం తవ్వే వద్దకు వెళ్తాడు. అక్కడ వాళ్లను ఉద్దరిస్తాడు. మళ్లీ చివర్లో ఆ బంగారం తీసేవాళ్లందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఆ బంగారం మొత్తం ఒక చోట పడేస్తాడు. అలాంటి గొప్పవాడు అవ్వమని ఆ తల్లి చెప్పడం. అలాంటి సినిమాను గొప్ప సినిమా అంటూ మనం ఎగబడి చూసేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు.
దర్శకుడు వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై ట్రోల్స్ జరుగుతున్నాయి. వెంకటేష్ వ్యాఖ్యలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే కొంత మంది నెటిజన్స్ దర్శకుడి మాటలకు మద్దతు ఇస్తుండగా మరికొంత మాత్రం ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. దర్శకుడు వెంకటేష్ మహా వెంటనే హీరో యష్ కు, దర్శకుడు ప్రశాంత్ నీల్ కు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ఆయన సినిమాలను కన్నడలో బ్యాన్ చేస్తామంటూ ఫైర్ అవుతున్నారు. వేరే దర్శకుడి సినిమాలు నచ్చకపోతే చూడటం మానేయాలని అంతేగాని ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అని పలువురు హితవు పలుకుతున్నారు. మరి వెంకటేష్ మహా వ్యాఖ్యలపై హీరో యష్, ప్రశాంత్ నీల్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Janaki Kalaganaledu March 23rd: జానకి, రామ హనీమూన్- మనవడిని చూసి మురిసిపోతున్న జ్ఞానంబ
Aditi Rao Hydari-Siddharth: సిద్దార్థ్‌తో రిలేషన్‌పై అదితి రావు ఘాటు స్పందన - అదేంటీ, అలా అనేసింది?
Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల
Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు
‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు