News
News
X

Ennenno Janmalabandham December 15th: వేదని మాటలకి మురిసిపోతున్న యష్- అభిమన్యు అక్క ఎంట్రీ, మాళవికకి ఇక చుక్కలే

వేద, యష్ ని కలిపేందుకు వెకేషన్ ప్లాన్ చేస్తారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

యష్, వేదని ఒక్కటి చేసేందుకు అందరూ కలిసి వాళ్ళని అగ్రహారం పంపించేందుకు ఒప్పిస్తారు. ఈ టూర్ ని ఏమని అంటారు ప్రేమ యాత్ర అనా అనుకుని వేద తెగ సిగ్గుపడిపోతుంది. అటు యష్ కూడా హ్యాపీగా ఉంటాడు. వాళ్ళ కోసం సులోచన, మాలిని అన్నీ రెడీ చేసి తెగ హడావుడి చేస్తారు. వేద, యష్ ఇద్దరు బ్యాగ్ లు పట్టుకుని బయటకి వస్తారు. ఆఫీసు గొడవలు పక్కన పెట్టి ఎంజాయ్ చెయ్యమని మాలిని చెప్తుంది. పాత గొడవలు మర్చిపోయి కొత్తగా లైఫ్ మొదలుపెట్టమని సులోచన వేదకి జాగ్రత్తలు చెప్తుంది. మనసులో నుంచి అన్నీ తీసేసి హాయిగా గడపమని అంటారు. ఖుషి వచ్చి లేట్ అవుతుంది మీరు బయల్దేరమని అంటుంది. అదేంటి నువ్వు రావడం లేదా అని వేద అడుగుతుంది. ఎగ్జామ్స్ ఉన్నాయని  రాలేనని ఖుషి చెప్తుంది.

రెండు కుటుంబాలు సంతోషంగా వాళ్ళని వెకేషన్ కి పంపిస్తారు. అభిమన్యు హడావుడిగా ఇంట్లో అందరికీ పనులు చెప్పి చేయిస్తూ ఉంటాడు. ఇంటికి ఎవరైనా గెస్ట్ లు వస్తున్నారా అని ఖైలాష్, మాళవిక అడుగుతారు. అవును లేడి లయన్ మిసెస్ భ్రమరాంబిక దేవి వస్తుందని చెప్తాడు. మా అక్క యూఎస్ నుంచి చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది.

మాళవిక: మీ అక్కకి మన విషయం తెలియదు కదా తెలిస్తే ఎలా ఒప్పుకుంటుందా

అభి: నువ్వే ఒప్పించాలి, నిన్ను చూసి మా అమ్మ ఇంప్రెస్ అయిపోవాలి. మన పెళ్ళికి మనకంటే అక్కే తొందరపడాలి

మాళవిక: వచ్చేది మీ అక్క కాదు నా ఆడపడుచు, మా ఇద్దరి అనుబంధం చూసి ఆశ్చర్యపోయేలా చేస్తా

అభి: మన పెళ్ళికి నువ్వే మా అక్కని ఒప్పిస్తావ్, నీ మీద నాకు నమ్మకం ఉంది బంగారం

సరే రెడీ అయిపోతానని మాళవిక అంటుంది. ఖైలాష్ తన పరిస్థితి ఏంటని అడుగుతాడు. తన అక్కవి స్కానింగ్ కళ్ళు అని చూడగానే మనిషి ఎలాంటి వాడో చెప్పేస్తుంది జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. ఊరికి వెళ్తునందుకు వేద చాలా హ్యపీగా ఉంటుంది. తనతో కలిసి ఊరికి వెళ్తునందుకు హ్యపీగా ఫీల్ అవుతున్నావా అని యష్ అడుగుతాడు. వేద కావాలని మీతో వస్తున్నందుకు కాదని చెప్పేసరికి యష్ బుంగమూతి పెడతాడు. ఇద్దరు అలుగుతారు. మళ్ళీ కాసేపటికే సరదాగా మాట్లాడుకుంటారు. వేద కారులో చాలా ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళ అమ్మమ్మ ఊరు గురించి చాలా సంతోషంగా చెప్తుంది. వేద చిన్నప్పుడు చేసిన చిలిపి అల్లరి గురించి చెప్పి ఆనందంగా ఉంటుంది.

వేద మాట్లాడుతూ ఉంటుంటే తనని తాను మైమరిపోయి చూస్తూ ఉంటాడు. కారు ఆపి మరీ వేదని చూస్తూ ఉంటాడు. నువ్వు గలగలా కబుర్లు చెప్తుంటే వినాలని అనిపిస్తుంది, చూసే కొద్ది చూడాలని అనిపిస్తుందని యష్ మనసులో అనుకుంటాడు. ఏంటి తన వైపు కొత్తగా చూస్తున్నాడని వేద అనుకుంటుంది. కన్ను ఆర్పకుండా వేదని చూస్తూనే ఉంటాడు.

Published at : 15 Dec 2022 08:04 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham Serial December 15th Episode

సంబంధిత కథనాలు

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!

HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!

టాప్ స్టోరీస్

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం