News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Ektaa Kapoor-Mohanlal: మోహన్ లాల్‌తో చేతులు కలిపిన ఏక్తా కపూర్, ‘వృషభ’ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా?

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ ‘వృషభ’. నంద కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏక్తా కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

FOLLOW US: 
Share:

ప్రముఖ మలయాళ నటుడు ప్రధాన పాత్రలో, నంద కిషోర్ దర్వకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘వృషభ’. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏక్తా కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  సుమారు రూ. 200 కోట్లతో AVS స్టూడియోస్, కనెక్ట్ మీడియా సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఈ చిత్రం ఏక్తా కపూర్ నిర్మించబోయే తొలి పాన్ ఇండియన్ మూవీగా నిలువబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ పై మోహన్ లాల్ తో ఏక్తా కపూర్ సంతకాలు చేసినట్లు తెలుస్తోంది.

అగ్రిమెంట్ పై సంతకాలు చేసిన మోహన్ లాల్, ఏక్తా కపూర్!

నంద్ కిషోర్  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ఈ చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, కన్నడతో పాటు హిందీ భాషలోనూ రూపొందబోతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2024లో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. “ఇది ఏక్తా కపూర్ తొలి పాన్ ఇండియా మూవీ. “ఏక్తా కపూర్ ఈరోజు ముంబైలోని యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్టూడియోస్‌లో  ప్రముఖ నటుడు, మలయాళీ మెగాస్టార్ మోహన్‌లాల్‌ను కలిశారు. ‘వృషభ’ సినిమా అగ్రిమెంట్ పేపర్లపై సంతకం చేశారు. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు” అని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.  

గత ఏడాది ఆగష్టులో ‘వృషభ’ మూవీ ప్రకటన

ఇక ‘దృశ్యం’, ‘కంపెనీ’, ‘రాజవింటే మకన్’, ‘ఇరువర్’, ‘జనతా గ్యారేజ్‌’తో సహా పలు హిట్ చిత్రాలలో నటించిన మోహన్ లాల్ ఈ ప్రాజెక్టు గురించి ట్విట్టర్ వేదికగా పలు వివరాలు వెల్లడించారు. గత ఏడాది ఆగష్టులో ఈ సినిమాను ప్రకటించారు. “నేను ‘వృషభ’ కోసం సంతకం చేసినందుకు సంతోషిస్తున్నాను. AVS స్టూడియోస్ నుంచి రాబోతున్న నా మొదటి చిత్రం ఇదే. నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ వ్యాస్, ప్రవీర్ సింగ్, శ్యామ్ సుందర్ నిర్మిస్తున్నారు. ఈ బహుభాషా చిత్రం యాక్షన్,  ఎమోషన్‌తో నిండి ఉంటుంది. నేను మీ అందరి సపోర్టుతో పాటు ఆశీస్సులను కోరుతున్నాను” అని తెలిపారు. తాజాగా ఈ చిత్రంలో ఏక్తా కపూర్ జాయిన్ అయ్యారు.

వృషభ’ స్టోరీ ఏంటంటే?

‘వృషభ’ మూవీ తండ్రీ, కొడుకల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని తరాల గురించి చెప్పబడే ఒక భావోద్వేగ కథను చిత్రంగా మలువబోతున్నారు. AVS స్టూడియోస్ నుంచి రాబోయే ఈ బహుభాషా చిత్రంలో మోహన్‌లాల్ తండ్రి పాత్రను పోషించబోతున్నారు.  ఈ చిత్రం రెండు భావోద్వేగాల నడుమ కొనసాగబోతుందని మేకర్స్ వెల్లడించారు. ప్రేమ, ప్రతీకారం మధ్య జరిగే పోరాటాన్ని ఇందులో చూపించబోతున్నట్లు తెలిపారు.   

వరుస సినిమాలతో ఏక్తా బిజీ బిజీ

నిర్మాత ఏక్తా కపూర్ 2000 సంవత్సరంలో టెలివిజన్ పరిశ్రమలో ఒక విప్లవాన్ని సృష్టించారు. సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.  డిజిటల్ విప్లవం రావడంతో స్వంత OTT ప్లాట్‌ ఫారమ్‌ను స్థాపించారు. ప్రస్తుతం పాన్ ఇండియన్ మూవీని నిర్మించబోతున్నారు.   తాజాగా ఏక్తా కపూర్ అమెజాన్ మినీటీవీలో ‘బద్దమీజ్ దిల్‌’ను విడుదల చేసింది.  ఈ సంవత్సరం ఆమె నిర్మించిన రెండు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. వాటిలో ఒకటి  ఆయుష్మాన్ ఖురానా-అనన్య పాండే నటించిన ‘డ్రీమ్ గర్ల్ 2’ కాగా, మరొకటి  టబు, కరీనా కపూర్, దిల్జిత్ దోసాంజ్, కృతి సనన్ నటించిన ‘ది క్రూ’ సినిమా.  

Read Also: ప్రేమించిన అమ్మాయి కోసం ఒక్క రోజే రూ.25 వేలు ఖర్చు పెట్టా, ఆ తర్వాత తెలిసింది: ‘బలగం’ వేణు

Published at : 01 Jul 2023 10:01 AM (IST) Tags: Mohan Lal ekta kapoor Mohan Lal Pan India Film Vrushabha movie

ఇవి కూడా చూడండి

Bigg Boss Telugu 7: ‘స్పా’ బ్యాచ్‌లో మనస్పర్థలు - టమాటాల గురించి శోభా, ప్రియాంకల గొడవ

Bigg Boss Telugu 7: ‘స్పా’ బ్యాచ్‌లో మనస్పర్థలు - టమాటాల గురించి శోభా, ప్రియాంకల గొడవ

Lokesh Kanagaraj Fight Club : ఫైట్​క్లబ్​తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్​గా మాత్రం కాదు

Lokesh Kanagaraj Fight Club : ఫైట్​క్లబ్​తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్​గా మాత్రం కాదు

Naga Panchami November 29th Episode : కరాళి ప్రాణత్యాగం.. రంగంలోకి ఫణేంద్ర.. పంచమికి అండగా సుబ్బు!

Naga Panchami November 29th Episode : కరాళి ప్రాణత్యాగం.. రంగంలోకి ఫణేంద్ర.. పంచమికి అండగా సుబ్బు!

Krishna Mukunda Murari November 29th Episode : గత జ్ఞాపకాల్లో మురారి ముకుందతో పెళ్లికి ఏర్పాట్లు.. ముహూర్తం ఫిక్స్‌!

Krishna Mukunda Murari November 29th Episode : గత జ్ఞాపకాల్లో మురారి ముకుందతో పెళ్లికి ఏర్పాట్లు.. ముహూర్తం ఫిక్స్‌!

Bigg Boss Telugu 7: గౌతమ్‌కు ప్రియాంక సపోర్ట్ - వెధవను అయిపోయాను అంటూ అమర్ సీరియస్

Bigg Boss Telugu 7: గౌతమ్‌కు ప్రియాంక సపోర్ట్ - వెధవను అయిపోయాను అంటూ అమర్ సీరియస్

టాప్ స్టోరీస్

Lets Vote : ఓటేద్దాం రండి - ఓటు మన హక్కే కాదు బాధ్యత కూడా !

Lets Vote :  ఓటేద్దాం రండి - ఓటు మన హక్కే కాదు  బాధ్యత కూడా !

Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !

Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం