ప్రేమించిన అమ్మాయి కోసం ఒక్క రోజే రూ.25 వేలు ఖర్చు పెట్టా, ఆ తర్వాత తెలిసింది: ‘బలగం’ వేణు
కమెడియన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వేణు.. 'బలగం' సినిమాతో సెన్సేషన్ డైరెక్టర్ అయ్యారు. తాజాగా ప్రేమపై తన ఒపీనియన్ ను పంచుకున్నారు. తనకసలు లవ్ అంటేనే ఇష్టముండదని... భయమని వేణు వ్యాఖ్యానించారు.
Balagam Venu : 'జబర్దస్త్' ద్వారా తెలుగు ప్రేక్షకులకు, బుల్లితెర వీక్షకులకు దగ్గరైన వేణు.. నేడు డైరెక్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. సినిమా తీయాలన్న తన కలను నెరవేర్చుకుని.. మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. 'బలగం' అనే టైటిల్ తో వచ్చిన ఈ మూవీ.. పల్లె అందాలను, కుటుంబ విలువలను చాటి చెప్పింది. ఎంతో మందిని కలిపింది.. మరెంతో మంది భావోద్వేగానికి గురయ్యేలా చేసింది. ఈ సినిమాతో కమెడియన్ గానే ప్రేక్షకులను నవ్వించడమే కాదు.. తెర వెనుక డైరెక్టర్ గా భావోద్వేగాలతో కన్నీళ్లు పెట్టించడమూ తెలుసని 'బలగం' సినిమాతో నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే అతని వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలపై రీసెంట్ గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన లైఫ్ లో లవ్ అంటేనే ఇష్టముండదంటూ ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేశారు.
"యూత్ గా ఉన్నప్పుడు అందరిలాగే నాక్కూడా నా ఆటోగ్రాఫ్ లాంటి లవ్ స్టోరీ ఒకటి. అయినా ఆ ఏజ్ లో అన్నీ అన్ మెచ్యూర్డ్, వన్ సైడ్ లవ్ స్టోరీలే. ఆ తర్వాత నాకు జరిగిన అవమానం కారణంగా అసలు లవ్ చేయాలంటేనే భయమేసేది. నాకసలు లవ్ అంటేనే ఇష్టం ఉండేది కాదు. ఆర్టిస్ట్ అయ్యాక బాగుందని... ఓ అమ్మాయిని ఇష్టపడ్డాను. పంచ్ లు వేస్తే నవ్వేది. వాళ్ల ఇంటికి వెళ్లినా ఏమనకపోయేవారు. సో.. ఇక ఏ ప్రాబ్లెమ్ ఉండదు. అంతా సెట్ అనుకున్నా. మామూలుగా లవ్ అంటే ఈడు జోడు బాగుందా, బ్యాగ్రౌండ్ బాగుందా అని చూస్తారు. కానీ అది కాదు కదా లవ్ అంటే. మనసు చూడాలి కదా. కానీ ఆ టైంలో మాత్రం ఆ అమ్మాయి క్యూట్ గా ఉంది, అప్పుడప్పుడూ ఫోన్ చేస్తే మాట్లాడుతుంది.. అని అంతా పాజిటివ్ గా ఊహించుకున్నా. ఓ రోజు ఫేక్ బర్త్ డే క్రియేట్ చేసుకుని ఆమెతో పాటు ఫ్రెండ్స్ అందర్నీ గోల్కొండ కోటకు తీసుకెళ్లి, అంతా తిరిగాం. మధ్య మధ్యలో ఆ అమ్మాయితో మాట్లాడడం, జోకులేయడం అంతా చేశాను. అలా సాయంత్రం అయ్యాక ఆ అమ్మాయితో ఇంకా ఎక్కువ సేపు గడపాలనిపించింది, ఆమెకు గుర్తుండిపోయే రోజుగా చేయాలని ఆమెను నక్లెస్ రోడ్డుకు తీసుకెళ్లి ఓ పెద్ద హోటల్ లో డిన్నరిచ్చాను. ఆ తర్వాత ఇంటికొచ్చాక అన్నీ లెక్కలేసుకుంటే.. మొత్తం రూ.25 నుంచి 30 వేలు అయింది. ఇక్కడ ఖర్చు కాదు.. కానీ దీనికి ఒక వారం నుంచే ఏర్పాట్లు.. ఫ్రెండ్స్ ను గాదర్ చేసుకోవడం, వాళ్లు వచ్చేలా చేయడం.. ఇలా అన్నీ చేశాను" అని వేణు చెప్పుకొచ్చారు.
"అలా ఆలోచిస్తుండగానే.. నా మనసుకు ఓ ఆలోచన తట్టింది. కళ్లు మూసుకుని అలా కాసేపు ఉండగానే.. సడెన్ గా మా ఇంట్లో వాళ్లందరూ గుర్తొచ్చారు. మామూలుగా మా అక్కలతో ఎమోషన్ ఎక్కువ. నేను ఇండస్ట్రీకి వస్తుంటే కూడా వాళ్లు ఎన్ని పూజలు చేశారో నాకు తెలుసు. నేను బాగుండాలని మా అమ్మ వాళ్లు ఎంత కోరుకున్నారో నాకు తెలుసు. నా 25 ఏళ్ల జీవితంలో వీళ్లందరూ ఇంత చేస్తే.. నేను ఒక గంట కోసం ఇంత చేశాను. ఆ అమ్మాయిని పడేయడానికి ఇంత ప్లాన్ వేసి, ఇన్ని చేశాను.. కానీ నా జీవితం కోసం ఆలోచించిన వాళ్ల కోసం నేను ఆలోచించలేకపోయానే అనిపించింది. వీళ్లెవర్నీ కాదు నిజంగా చేయాలంటే మా వాళ్లను ఇంప్రెస్ చేయాలని అప్పుడనుకున్నా. అప్పటి నుంచి ఆ అమ్మాయిని పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యాను. మా అక్కలు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నా. వాళ్ల మీద ఉన్న ఓవర్ ప్రేమ వల్ల నాకిష్టమైన అమ్మాయిని చేసుకుంటే వాళ్లకు ఆమె నచ్చకపోతే కష్టం కదా.. అందుకే వాళ్లు చూసిన అమ్మాయినే చేసుకుంటా అని ఫిక్స్ అయిన. చెప్పినట్టుగానే మా చుట్టాల్లో ఒక అమ్మాయిని చూపిస్తే ఆమెనే పెళ్లి చేసుకున్నా" అంటూ వేణు వివరించారు.
Read Also : Ram Charan Daughter Name : మెగా మనవరాలికి పేరు పెట్టేశారోచ్ - రామ్ చరణ్, ఉపాసన కుమార్తె పేరు ఏమిటంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial