By: ABP Desam | Updated at : 09 Dec 2022 11:40 PM (IST)
హరి హర వీరమల్లు సెట్స్‌లో క్రిష్, హరీష్ శంకర్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో దర్శకుడు క్రిష్ కొత్త ఆశలు పెంచారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా చేస్తున్న సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సెట్స్‌కు హరీష్ శంకర్ వచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘తెరి’ రీమేక్ చేయబోతున్నారని వార్తలు రావడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు.
‘హరిహర వీర మల్లు’ సెట్స్‌పై దిగిన ఫొటోలను హరీష్ శంకర్ పోస్ట్ చేశారు. దీనికి క్రిష్ రిప్లై ఇస్తూ ‘ఆల్ ది బెస్ట్ టు భవదీయుడు భగత్ సింగ్’ అని ట్వీట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో కూడా కన్ఫ్యూజన్ మొదలైంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చే సినిమా ‘భవదీయుడు భగత్ సింగ్’నా, లేకపోతే ‘తెరి’ రీమేక్‌నా అని గందరగోళం వ్యక్తం చేస్తున్నారు.
‘తెరి’ రీమేక్ కంటే ‘భవదీయుడు భగత్ సింగ్‘నే బెటర్ అని కొంతమంది ఫ్యాన్స్ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంబోలో తెరకెక్కే సినిమాకు సంబంధించిన అధికారిక అప్‌డేట్ త్వరలో రానుంది. అప్పుడు ఏ సినిమా అనేది క్లారిటీ రానుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,'సాహో' ఫేమ్ సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ప్రకటన గత ఆదివారం అధికారికంగా వచ్చింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్.
ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే!
పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్‌లో సినిమా రీమేక్ కాదని తెలిసింది. పవర్ స్టార్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని సుజిత్ స్టయిలిష్ యాక్షన్ స్క్రిప్ట్ డిజైన్ చేశారట. ఈ కథ కంటే ముందు అతడి చేతిలో 'తెరి' (తెలుగులో 'పోలీస్' పేరుతో విడుదల అయిన విజయ్, సమంత సినిమా) స్క్రిప్ట్ పెట్టారని, ఆ రీమేక్ చేయవచ్చని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించింది. అయితే... సుజిత్ చెప్పిన కథ నచ్చడంతో స్ట్రెయిట్ సినిమా చేయడానికి పవన్ మొగ్గు చూపారు.
సాహో' తర్వాత సుజిత్ మరో సినిమా చేయలేదు. మూడేళ్లుగా పలు స్క్రిప్ట్స్ మీద వర్క్ చేశారు. పవన్ సినిమాకు ముందు వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే... చివరకు పవర్ స్టార్‌ను ఆయన మెప్పించారు. సొంత కథతో ఒప్పించారు.
ప్రపంచ ప్రేక్షకులు అందరూ తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన 'ఆర్ఆర్ఆర్' (RRR Movie) తర్వాత డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న చిత్రమిది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా డీవీవీ సంస్థలో రెండో చిత్రమిది. ఇంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ హీరోగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా నిర్మించారు. పదేళ్ళ తర్వాత మళ్ళీ పవన్‌తో సినిమా చేస్తుండటం విశేషం.
Such a pleasure to see you on #HariHaraVeeraMallu sets brother..Keep rocking and all the very best for #BhavadeeyuduBhagathSingh 🌟💐🌟 https://t.co/caHL1QqBfx
— Krish Jagarlamudi (@DirKrish) December 9, 2022
Brahmanandam : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?
Ennenno Janmalabandham February 1st: భ్రమరాంబికకి వార్నింగ్ ఇచ్చిన మాళవిక- వేద మాటలకు బాధ పడిన యష్
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్లో సంజయ్ దత్, హీరోయిన్గా త్రిష
Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!
Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్లో Adani Enterprises, Sun Pharma
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని