Nathicharami: 'ఫ్యామిలీ మాన్ 2'లో సమంత చేసినట్టు పూనమ్ కౌర్ చేసిందా?
'ఫ్యామిలీ మాన్ 2'లో సమంత చేసినట్టుగా 'నాతిచరామి'లో పూనమ్ కౌర్ చేసిందా? తాజాగా విడుదలైన ట్రైలర్‌లో డైలాగులు వింటే అదే సందేహం కలుగుతోంది!
'ద ఫ్యామిలీ మాన్' వెబ్ సిరీస్ చూశారా? అందులో ఓ మనిషిని ముక్కలు ముక్కలుగా చేసి బయట పడేస్తుంది. తనను లైంగికంగా వాడుకుని, వేధించి, అవమానపరిచిన వ్యక్తిని అలా చేస్తుంది. 'నాతిచరామి' సినిమాలో పూనమ్ కౌర్ కూడా అదే విధంగా చేసిందా? లేటెస్టుగా విడుదలైన ట్రైలర్ చూస్తే అటువంటి సందేహమే కలుగుతోంది.
పూనమ్ కౌర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నాతిచరామి'. ఆమెకు జంటగా హీరో అరవింద్ కృష్ణ నటించారు. సందేశ్ బురి ప్రధాన పాత్రలో నటించారు. నాగు గవర దర్శకత్వం వహించారు. జై వైష్ణవి .కె నిర్మించారు. త్వరలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. శుక్రవారం సాయంత్రం ట్రైలర్ విడుదల చేశారు. "దానికి వేసిన ఏడు సంవత్సరాల శిక్ష చాలా తక్కువ. ఎంతో భయంకరంగా ఒక మనిషిని ముక్కలుగా చేసి... మూడు ప్రాంతాల్లో పడేసింది" అని ఓ మహిళా అధికారి డైలాగ్ చెబుతుంటే... జైల్లో ఖైదీగా పూనమ్ కౌర్‌ను పరిచయం చేశారు. ఆ తర్వాత ఆమె ఇంటికి ఒకరు వచ్చి డబ్బులు ఇస్తూ ఉండటం... ఆయన హత్యకు గురైనట్టు చూపించారు. భార్యాభర్తల మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
"క్రైమ్ నేపథ్యంలో తీసిన ఫ్యామిలీ డ్రామా 'నాతిచరామి'. హైదరాబాద్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా... కల్పిత పాత్రలతో తెరకెక్కించిన సినిమా. అప్పట్లో వై2కె సమస్య కారణంగా ఓ కుటుంబంలో జరిగిన ఘటన ఆధారంగా సినిమా రూపొందించాం" అని దర్శకుడు నాగు గవర చెప్పారు. ఈ సినిమాలో కవిత, మాధవి, జయశ్రీ రాచకొండ, కృష్ణ, సత్తన్న ఇతర తారాగణం.
Also Read: 'డీజే టిల్లు' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?
Also Read: సమంత, నయనతారలో విజయ్ సేతుపతి ఎవరికి ఓటేశాడు?
View this post on Instagram