అన్వేషించండి
Advertisement
DJ Tillu Review - 'డీజే టిల్లు' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?
DJ Tillu Movie Review Telugu: 'డీజే టిల్లు' సాంగ్ చార్ట్ బస్టర్! ట్రైలర్ యూత్‌ను అట్ట్రాక్ట్ చేసింది. మరి, సినిమా ఎలా ఉంది?
డీజే టిల్లు
రొమాంటిక్ క్రైమ్ కామెడీ
Director
విమల్ కృష్ణ
Starring
సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి, బ్రహ్మాజీ, ప్రిన్స్, ప్రగతి, నర్రా శ్రీనివాస్ తదితరులు
సినిమా రివ్యూ: డీజే టిల్లు
రేటింగ్: 3/5
నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి, బ్రహ్మాజీ, ప్రిన్స్, ప్రగతి, నర్రా శ్రీనివాస్ తదితరులు
రేటింగ్: 3/5
నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి, బ్రహ్మాజీ, ప్రిన్స్, ప్రగతి, నర్రా శ్రీనివాస్ తదితరులు
కథ - స్క్రీన్ ప్లే: సిద్ధూ జొన్నలగడ్డ, విమల్ కృష్ణ
డైలాగ్స్: సిద్ధూ జొన్నలగడ్డ
ఎడిటర్: వివేక్ హర్షన్
సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
స్వరాలు: రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల
నేపథ్య సంగీతం: తమన్
సమర్పణ: పీడీవీ ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: విమల్ కృష్ణ
విడుదల తేదీ: ఫిబ్రవరి 12, 2022
విడుదల తేదీ: ఫిబ్రవరి 12, 2022
'డీజే టిల్లు' సాంగ్ చార్ట్ బస్టర్! విడుదలైన తర్వాత ఎక్కడ చూసినా... ఆ టైటిల్ సాంగ్ ఎక్కువ వినిపించింది. ట్రైలర్ యూత్‌ను అట్ట్రాక్ట్ చేసింది. రచయితగా 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'మా వింత గాధ వినుమ' సినిమాలతో సిద్ధూ జొన్నలగడ్డ విజయాలు అందుకున్నారు. మరి, ఈ సినిమాకు ఎటువంటి కథ ఇచ్చారు? హీరోగా ఎలా చేశారు? 'ప్రేమమ్', 'జెర్సీ', 'భీష్మ', 'రంగ్ దే' ... యువ హీరోలతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తీసిన సినిమాలు విజయాలు సాధించాయి. మరి, ఈ సినిమా ఎలా ఉంది?
కథ: డీజే టిల్లు అలియాస్ బాలగంగాధర్ తిలక్ (సిద్ధూ జొన్నలగడ్డ) టిపికల్ హైదరాబాదీ కుర్రాడు. మహాంకళమ్మ జాతర, హాఫ్ శారీ ఫంక్షన్స్, బారాత్ లకు డీజే కొడతాడు. ఒక క్లబ్బుకు వెళ్ళినప్పుడు రాధిక (నేహా శెట్టి) కనిపిస్తుంది. పరిచయమైన పది నిమిషాలకు ప్రేమలో పడుతుంది. తన బర్త్ డే రోజున తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని, ఇంట్లో ఏర్పాటు చేసిన బర్త్ డే ఫంక్షన్‌కు రమ్మని రాధికను టిల్లు ఇన్వైట్ చేస్తాడు. తనకు రావడం కుదరదని ఆమె చెబుతుంది. టిల్లూను తన ఫ్లాట్‌కు రమ్మని చెబుతుంది. అతడు వెళతాడు. అక్కడ ఫ్లాట్‌లో డెడ్ బాడీ ఉంటుంది. ఆ డెడ్ బాడీ ఎవరిది? మర్డర్ కేసు నుంచి బయట పడటం కోసం రాధిక, టిల్లు ఎన్ని తిప్పలు పడ్డారు? బార్ ఓనర్ షాన్ (ప్రిన్స్), సీఐ రావ్ (బ్రహ్మాజీ)తో రాధికకు ఎటువంటి సంబంధం ఉంది? టిల్లూను రాధిక మోసం చేసిందా? చివరకు, ఏమైంది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: డీజే టిల్లుది టిపికల్ క్యారెక్టర్. ఆల్రెడీ ట్రైలర్స్, సాంగ్స్ చూస్తే... ఒక ఐడియా వస్తుంది. సినిమా ప్రారంభమైన వెంటనే ఆ క్యారెక్టర్ గురించి స్వయంగా తండ్రి ఇంట్రడక్షన్ ఇవ్వడం మొదలు పెడతారు. డీజే టిల్లు ప్రపంచంలోకి తీసుకు వెళతారు. పరిచయమైన పది నిమిషాల్లో అమ్మాయి ప్రేమలో పడటం ఏమిటి? కారులో ముద్దు ఇవ్వడం ఏమిటి? అనే సందేహాలు రాకుండా కథను వినోదాత్మకంగా ముందుకు నడిపారు. థాంక్స్ టు 'డీజే టిల్లు' సాంగ్ అండ్ తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్... సినిమాలో వైబ్ ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేశాయి. ఎంటర్‌టైనింగ్, రీఫ్రెషింగ్ మ్యూజిక్ వల్ల ఫస్టాఫ్ అలా అలా సరదాగా గడిచింది. సెకండాఫ్ స్టార్ట్ అయిన కొంతసేపటికి కథలో వేగం తగ్గింది. కామెడీ కూడా! ఫైనల్‌గా... సినిమా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో ముగిసింది.
'డీజే టిల్లు'కు స్క్రీన్ మీద హీరో సిద్ధూ జొన్నలగడ్డ అయితే... స్క్రీన్ వెనుక హీరో తమన్. దర్శకుడు విమల్ కృష్ణతో కలిసి కథ రాసిన సిద్ధూ జొన్నలగడ్డ... కథ కంటే హీరో క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. ఆ క్యారెక్టరైజేషన్, టిల్లు పాత్రలో సిద్ధూ నటన వర్కవుట్ అయ్యాయి. టిపికల్ హైదరాబాదీగా సిద్ధూ పాత్రలో ఒదిగిపోయారు. తెలంగాణ యాసలో సెటైరికల్ డైలాగులు చెబుతుంటే బావుంటుంది. నేహా శెట్టి అందంగా కనిపిస్తూ... అభినయంతో ఆకట్టుకున్నారు. బ్లాక్ సారీలో ఆమె లుక్ బావుంది. ప్రిన్స్ క్యారెక్టర్ జస్ట్ ఓకే. సీఐగా కీలకమైన పాత్రలో బ్రహ్మాజీ ఆకట్టుకుంటారు. నర్రా శ్రీనివాస్‌దీ కీలక పాత్ర. కానీ, కామెడీ వర్కవుట్ అవ్వలేదు. జడ్జ్ పాత్రలో ప్రగతి, కానిస్టేబుల్‌గా ఫిష్ వెంకట్ తళుక్కున మెరిశారు. సెకండాఫ్ హాస్పిటల్ ఎపిసోడ్ అనుకున్నంత నవ్వించలేదు. అందువల్ల, కొంత డిజప్పాయింట్ అవుతాం.
'డీజే టిల్లు' టైటిల్ సాంగ్‌కు రామ్ మిరియాల ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌లో తమన్ ఆ వైబ్ కంటిన్యూ చేశారు. అలాగే, కొత్త తరహా నేపథ్య అందించారు. శ్రీ చరణ్ పాకాల అందించిన 'పటాస్ పిల్ల', 'నువ్విలా' పాటలు బావున్నాయి. అందంగా చిత్రీకరించారు. సినిమాటోగ్రఫీ సూపర్ ఉంది. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా! సినిమా అంతా రిచ్ లుక్ ఉంది. లాజిక్కులు ఆలోచించకుండా జస్ట్ సరదాగా నవ్వుకోవాలని వెళితే... డీజే టిల్లు ఎంటర్‌టైన్ చేస్తాడు. తెలుగులో ఇటువంటి ఫిల్మ్ మేకింగ్, జానర్ సినిమాలు చాలా తక్కువ వచ్చాయి. అందువల్ల, కొత్తగా ఉంటుంది. ఈ వీకెండ్ 'డీజే టిల్లు'దే. ప్రేక్షకులకు మంచి టైమ్‌పాస్ మూవీ ఇది.
Also Read: 'ఎఫ్ఐఆర్' రివ్యూ: పోకిరి టైప్ టచ్ ఇచ్చారు కానీ!
Also Read: 'ఎఫ్ఐఆర్' రివ్యూ: పోకిరి టైప్ టచ్ ఇచ్చారు కానీ!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement